Telugu News

పేదలకు. విలేకరులకు మధ్యతరగతి కుటుంబాల వారికి రాజీవ్ స్వగృహ ను కేటాయించాలి

 ఖమ్మం రూరల్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో దీక్షలు

0

పేదలకు. విలేకరులకు మధ్యతరగతి కుటుంబాల వారికి రాజీవ్ స్వగృహ ను కేటాయించాలి
 ఖమ్మం రూరల్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో దీక్షలు
 హాజరైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గప్రసాద్
(ఖమ్మంరూరల్, ఖమ్మం-విజయంన్యూస్)
రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం పాట ను రద్దు చేసి పేదలకు విలేకరులకు మధ్యతరగతి వారికి కేటాయించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ప్రభుత్వాధికారులను కోరారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ స్వగృహ సముదాయం ముందు రిలే నిరాహార దీక్షలను నిర్వహిస్తుండగా, రెండో రోజు శుక్రవారం కొనసాగించారు. జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్, గోళ్లపాడు మాజీ సర్పంచ్ మద్ది వీరారెడ్డి. జిల్లా బీసీ సెల్ కార్యదర్శి చంద్రగిరి నగేష్ . పోలెపల్లి ఉపసర్పంచ్ గార్ల రాజశేఖర్ లు దీక్ష చేపట్టగా,జిల్లా ఎస్సీ సెల్ జిల్లా నాయకులు ఆరెంపుల రామయ్య పూల మాలలు వేసి దీక్షలు ప్రారంభించారుజ సాయంత్రం ఐదు గంటలకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ దీక్షలకు సంఘీభావం తెలిపారు.

also read :-సకల హంగులతో ఖమ్మం కార్పోరేషన్ భవన నిర్మాణం : మంత్రి పువ్వాడ

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ స్వగ్రహ ను మధ్యతరగతి, పేదవారి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మంచి సంకల్పంతో ప్రారంభించిందని. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం స్వార్థంతో కార్పొరేట్ సంస్థలతో కుమ్మక్కై పేదవాడు ఇంటి కల సాకారం కాకుండా స్వార్థంతో వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. కావున వేలంపాటను రద్దుచేసి గతంలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారొ వారికే కేటాయించాలని అన్నారు. స్థానికులకు అవకాశం ఇవ్వాలని, గతంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ తప్పకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో రాచరిక పాలన చేయాలని చూస్తున్నదని .ప్రపంచ దేశాల్లో గొప్పదైన రాజ్యాంగాన్ని మార్చాలని సిఎం కెసిఆర్ అనడం అతని నియంతృత్వానికి నిదర్శనమని ఇది ముమ్మాటికీ మహానుభావుడు అంబేద్కర్ ని దారుణంగా అవమానించడమేనని రాజ్యాంగాన్ని మార్చాలన్న మాటలు ఉపసంహరించుకునే దాక పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని అన్నారు ఈసారి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి తప్పకుండా వస్తుందని అప్పుడు రాజీవ్ స్వగృహ ను మధ్యతరగతి కుటుంబాల వారికి ఇస్తామని అన్నారు ఈనెల 16 .17 న జరిగే రాజీవ్ స్వగృహ వేలం పాటను అడ్డుకుంటామని అన్నారు.

also read :-సమ్మక్క సారలక్క గద్దెను సందర్శించిన పొంగులేటి

అనంతరం దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. జిల్లా బీసీ సెల్ కార్యదర్శి చంద్రగిరి నగేష్ అధ్వర్యంలో మహిళలు, సాయి నగర్ రాజీవ్ గృహకల్ప వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు రాందాస్ నాయక్ పాలేరు నియోజకవర్గ డిజిటల్ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ మొత్కూరి ధర్మారావు జిల్లా .మండల కిసాన్ కాంగ్రెస్ నాయకులు గుడిపల్లి పుల్లారావు. దండా రోహిణ్. ఆలేటి సైదులు . మొహమ్మద్ చోట్. పొడిశెట్టి లక్ష్మి పల్లపు ఉప్పమ్మ ధనమ్మ sk రంజాన్ తదితరులు పాల్గొన్నారు