***ఢీల్లీలో చెల్లని రూపాయి కేసీఆర్ : బండిసంజయ్
***జనగామ సవాళ్లకు..జనగామలోనే సమాధానం ఇస్తాం
***కల్వకుంట్ల రాజ్యాంగం అమలు కోసమే జనగామ సభ
***కరెంట్ విూటర్లు పెట్టమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదు
***సత్యాలతో ప్రజలను మభ్య పెట్టలేరని గుర్తుంచుకో
***నశం పెడితే మేం జండూబామ్ పెడతామని హెచ్చరిక
***కెసిఆర్ విమర్శలపై మండిపడ్డ బండి సంజయ్
***(హైదరాబాద్-విజయంన్యూస్)
ఢిల్లీలో చెల్లని రూపాయి సీఎం కేసీఆర్ అని, నువ్వు నశం పెడితే..మేము జండుబామ్ పెడతామని తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి మండిపడ్డారు. త్వరలోనే జనగామలోనే బిజెపి బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ..అందుకు తగ్గట్లుగానే ఘాటుగానే సమాధానం ఇస్తామని బండి సంజయ్ తెలిపారు. శుక్రవారం జనగామలో కేసీఆర్ ఎందుకు బహిరంగ సభ పెట్టారో అర్ధం కావడం లేదన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తున్నానని చెప్పడానికే కేసీఆర్ జనగామ సభ పెట్టి ఉంటారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ విూటర్లు పెడతామని కేంద్రం ఎప్పుడు చెప్పిందని బండి సంజయ్ ప్రశ్నించారు.
also read :-***నేలకొండపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
సీఎం కేసీఆర్ చెల్లని రూపాయి అని.. ఢల్లీిలో ఆయన్ను ఎవరూ పట్టించుకోరని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఢల్లీి వెళ్లి కథలు చెబుతాడా? సోయి లేకుండా మాట్లాడే కేసీఆర్ మాటలను ఎవరూ నమ్మరని ఫైర్ శనివారం నాడిక్కడ అయ్యారు.
జనగాం సభలో కేసీఆర్ మాటల తూటాలకు రాష్ట్ర బీజేపీ నేతల కౌంటర్లతో.. తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్‌గా డైలాగ్ వార్ మొదలైంది. జిల్లాల పర్యటనలో భాగంగా జరిగిన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటరిచ్చారు. కెసిఆర్ చేసిన విమర్వలు,చెప్పిన విషయాలన్నీ అబద్దాలేనన్నారు. యూపీ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తానన్న కేసీఆర్‌ను.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్.. ఓ చెల్లని రూపాయి అని విమర్శించారు. ఎందుకోసం బహిరంగ సభలు పెడుతున్నారో అర్థం కావడంలేదన్నారు. రాజ్యాంగంపై క్షమాపణలు చెబుతారని అనుకున్నానని.. కానీ ఆయనలో ఇంకా మార్పు రాలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం ప్రసంగం వినలేకపోయాను? కానీ ప్రజలు చాలా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోందన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తా అని చెప్పడానికే కేసీఆర్ జనగామ బహిరంగ సభ పెట్టారని బండి సంజయ్ విమర్శించారు.
also read;-తెలంగాణ దనిక రాష్ట్రం2.7 లక్షలకు చేరనున్న రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం
ప్రపంచంలో అత్యంత పెద్ద పార్టీ బీజేపీ.. టిఆర్‌ఎస్ చిన్న పార్టీ అన్నారు. కేసీఆర్ సోయి లేకుండా మాట్లాడారు? ఆయన పై విచారణ ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను రెచ్చకొట్టడానికి సెంటిమెంటును రగల్చడానికే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేంద్రం ధాన్యం కొనగోలు చేయమని ఎక్కడ చెప్పలేదన్న బండి సంజయ్.. వ్యవసాయ పంపుసెట్లకు విూటర్లు పెడతామని కేంద్రం ఎక్కడైనా లేఖ ఇచ్చిందా అని బండి సంజయ్ ప్రశ్నించారు.
డిస్కంలకు 48 వేల కోట్ల రూపాయల అప్పులు బాకీ ఉన్నారని ఆయన గుర్తు చేశారు. హుజురాబాద్‌లో ఎంతమందికి దళితబంధు ఇచ్చారో జాబితా విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 317 జీవో సవరించాలని ఉపాధ్యాయులు ఆందోళన చేస్తుంటే పోలీసులు అరెస్టులు చేస్తున్నారు.. అరెస్ట్ చేసినవారిని వెంటనే విడుదల చేయాలని బండి సంజయ్ కోరారు. కేసీఆర్ అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందని.. అందుకే మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలిస్తున్నాడని బండి సంజయ్ నిప్పులు చెరిగారు. కల్వకుంట్ల రాజ్యాంగం కావాలో, అంబేద్కర్ రాజ్యాంగం కావాలో తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలన్నారు. బీజేపీ అంటే కేసీఆర్ భయపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ పిడికెడు అని కామెంట్ చేసిన కేసీఆర్ ఎందుకు అలా భయపడుతున్నారని నిలదీశారు. త్వరలోనే జనగామలో బహిరంగ సభ పెట్టి టీఆర్‌ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.
also read :-దమ్మపేట రెవెన్యూ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేత…..
బీజేపీ కార్యకర్తలను నశం పెట్టి కొడుతామని కేసీఆర్ హెచ్చరిస్తారా..కేసీఆర్ నశం పెడితే మేము జండూబామ్ పెడుతామని కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పై ఖచ్చితంగా దర్యాప్తు జరుగుతదంన్నారు. ముఖ్యమంత్రి అయి ఉండి బాధ్యత లేకుండా మాట్లాడుతు న్నారన్న బండి సంజయ్.. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని జనగామ సభ నుంచే అమలు చేస్తున్నానని భ్రమలో ఉన్నాడన్నారు. నోరు తెరిస్తే మందువాసన వచ్చే కేసీఆర్ ను పక్కాగా సభలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ చేపిస్తం అన్నారు. తాగినట్లు తేలితే… జైలుకు పంపుతామని.. ఆ స్కీం కేసఆర్ కోసం కచ్చితంగా తీసుకొస్తా అన్నారు. సభ సందర్భంగా బీజేపీ కార్యకర్తలను దౌర్జన్యంగా అరెస్ట్ చేశారన్నారు.
సీఎం సభకు రెండ్రోజుల ముందు నుండే కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్లో పెట్టారన్నారు. పోలీసుల సమక్షంలో దాడులు చేయిస్తున్నరని.. బీజేపీ కార్యకర్తలు లాఠీలకు, దాడులకు భయపడకుండా బయట కొచ్చి భారతమాతాకీ జై అంటూ జెండా పట్టుకుని వస్తున్నారన్నారు. తెలంగాణలో పాలన ఇలాగే కొనసాగితే…. నిజాం పాలన మాదిరిగా కేసీఆర్ వస్తుంటే… చెప్పులు చేతుల్లో పట్టుకుని వంగి వంగి దండాలు పెట్టాలేమో? అన్నారు. సీఎం సభ పెడితే ప్రభుత్వం చేసిన పనులు చెప్పాలని..డబుల్ బెడ్రూం, నిరుద్యోగ భృతి ఎంత మందికి ఇచ్చావో చెప్పాలన్నారు. సంక్షేమ పథకాల గురించి మాట్లాడాలికానీ..బీజేపీపై మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలు అంటే కేసీఆర్ ఫ్యావిూలికి గజగజ అన్నారు. విూడియా సమావేశంలో రాజాసింగ్ కూడా పాల్గొన్నారు.