Telugu News

కాంగ్రెస్ పార్టీలో ఆయనే కీలకమా..?

ఇల్లందు నియోజకవర్గంలో ఉద్దండుడు ఎస్కే జానీ

0

కాంగ్రెస్ పార్టీలో ఆయనే కీలకమా..?

== ఇల్లందు నియోజకవర్గంలో ఉద్దండుడు ఎస్కే జానీ

== మైనార్టీ వర్గంలో పట్టున్న నాయకుడు

==కరోనా సమయంలో నిరుపేదలకు ఆపద్బాంధవుడు

== ఎస్ కే జానీ వైపు చూస్తున్న కాంగ్రెస్ టికెట్ ఆశావాహులు

== అధికార పార్టీ ఆశలు, ఆఫర్లు ఇచ్చిన తలోగ్గని నాయకుడు

( తమ్మిశెట్టి,ఇల్లెందు-విజయ న్యూస్)

కాంగ్రెస్ పార్టీ చితికి, చతికిపోతుంది. దేశవ్యాప్తంగా కొందరు పార్టీని కాపాడుతున్నారు అందులో వేకైక వ్యక్తి ఎస్ కే జానీ. ఇల్లెందు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బయటపడేసిన వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంపై విజయం ప్రతినిధి  ప్రత్యేక కథనం.

ఇది కూడా చదవండి: ఏన్కూరులో రోడ్డు ప్రమాదం…ఇద్దరి మృతి

కాంగ్రెస్ పార్టీ పుట్టుకతో రక్తం పంచుకుంటారు ఎన్ని ఆటంకాలు, అయినా ఎన్ని అవాంతరాలు జరిగిన వెనక్కి తగ్గరు ఆ కోవకు చెందిన వ్యక్తి ఎస్ కే జానీ పుట్టుకతో కాంగ్రెస్ కుటుంబం.ఇల్లెందు కూరగాయ మార్కెట్లో మంచి పేరున్న వ్యక్తి. తండ్రి తల్లి స్వగృహం ఇల్లెందు మండలం రాగబోయిన గూడెం. తండ్రి స్వగ్రామం ప్రస్తుత మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం. జానీ పుట్టకతో ఇక్కడే ప్రస్థానం మొదలైంది. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి చేదుడు వాదుడుగా నిలిచాడు. వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో అండగా ఉండి 2018లో కాంగ్రెస్ పార్టీని గట్టుకు చేర్చిన వేకేక వ్యక్తి జానీ. ప్రస్తుత నేపథ్యంలో మరో మారు ఆయనవసరం లేకపోలేదు. కాంగ్రెస్ నుండి సీట్ ఆశిస్తున్న ఆశాహోలంతా ఆయనకు టచ్ లో ఉన్నారు.

== మైనార్టీ వర్గంలో గట్టి పట్టున్న నాయకుడు

ఇల్లెందు ముస్లిం మైనార్టీ వర్గంలో గట్టి పట్టున్న నాయకుడు జానీ. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నాడు అదేవిధంగా మైనార్టీ వర్గాల్లో మంచి పేరు సంపాదించాడు. ఎన్ని ఆటంకాలు ఎదురైన వెనుతిరిగి చూడలేదు అందుకే పట్ల ముస్లిం మైనార్టీ సోదరులు కుటుంబాలు ఆసక్తి చూపుతున్నాయి. వాస్తవం చెప్పాలంటే ఇల్లెందు పట్టణంలో సహాయం చేసే గుణం అందరికీ ఉండదు. చేసేవారు ఉంటే అందులో ఎస్కే జానీ ఒకరు.

– కరోనా సమయంలో ఆపద్బాంధవుడు                ఇదికూడా చదవండి: ఇల్లెందు బరిలో ‘యాకన్న’

కరోనా సమయంలో ఆపద్బాంధవుడు ఎస్కే జానీ. ఇల్లెందు పట్టణంతోపాటు, చుట్టుపక్కల గ్రామాలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేసిన చరిత్ర ఆయనకి దక్కింది. మొదటి నుంచి కూరగాయల వ్యాపారం ఆయన సొంతం. కరోనా సమయంలో ఆయన త్యాగం అంతా ఇంత కాదు. ఇల్లెందు పలు వార్డులతోపాటు చుట్టుపక్కల మండలాలైన పలు గ్రామాలకు కూరగాయల పంపిణీ చేసిన ఏకైక వ్యక్తిగా ఆయనే నిలిచారు.

– ఆయన వైపు చూస్తున్న ఆశవహులు

ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో జానీ వైపే ఆశావహులు మొగ్గు చూపుతున్నారు. నిజానికి చెప్పాలంటే ఇల్లెందు పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి జానకి తప్ప, సరితూగే నాయకుడు లేకపోవడం గమనహరం. అదేవిధంగా పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాడు. 2015లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాడు. అప్పటినుండి కాంగ్రెస్ పార్టీ ని తన వంతుగా బలోపేతం చేస్తూ మన్నులను అందుకుంటున్నాడు. కాంగ్రెస్ పెద్దలు రేవంత్ రెడ్డి తో సహా సీనియర్లంతా ఆయనకి టచ్ లో ఉండడం విశేషం. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీటు విషయంలో ఢిల్లీ పెద్దలు  ఆయనకు టచ్లో వచ్చినట్టు సమాచారం.

– తలగ్గొని నాయకుడు                                    ఇది కూడా చదవండి: ఇల్లందులో కింగ్ మేకర్ ‘మడత’

అధికార పార్టీ ఎన్ని ఆశలు ఆఫర్లు చూపిన తలోగ్గని నాయకుడుగా జానీముద్రపడ్డాడు. కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీకి చేయూతనిచ్చాడే తప్ప, ఇతర ఏ పార్టీ వైపు మొగ్గుచూపులేదు. అధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో పదవులు, ఆఫర్లు ఇచ్చిన తిరస్కరించాడు. కాంగ్రెస్ పార్టీకే కట్టుబడి ఉంటానని కుండబద్దలు కొట్టాడు. పార్టీ మారడం అంటూ జరగదని తెగేసి చెప్పాడు. అలాంటి నాయకుడు పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. అదే విధంగా కార్యకర్తలకు తన వంతు చేయూతనిస్తూ ఆర్థికంగా సహకరిస్తున్నాడు. ఆయన పట్ల పిసిసి పెద్దలు, ఏఐసిసి పెద్దలు టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది.