Telugu News

ఒంటరైన సండ్ర..అవుతున్నాడా..? చేస్తున్నారా.?

సండ్ర భవిష్యత్ ఏమిటి..?

0

ఒంటరైన సండ్ర

== అవుతున్నాడా..? చేస్తున్నారా.?

== దూరమవుతున్న ఆగ్రనాయకత్వం

== సీనియర్లపై  షటేర్లు సందిస్తున్న సండ్ర

== ఒంటెత్తు పోకడలే అందుకు కారణమా.?

== మంత్రి రేసులో ఉన్నందుకే కక్ష్యపూరితమా.?

== సండ్ర భవిష్యత్ ఏమిటి..?

సండ్ర ఒంటెత్తు పొకడగా వెళ్తున్నారా..? మంత్రి పదవిపై కన్నేశారా..? దాని కోసం ఒంటరిగా అడుగులేస్తున్నారా…? అది గమనించిన జిల్లాను శాసించగల్గిన నేతలు దూరమైయ్యారా..? కావాలనే దూరమవుతున్నారా..? ఆగ్రనాయకులపై సండ్ర షెటైర్లు ఎందుకు..? ఆ దూకుడే వెనకాల అంతర్యమేంటి..?  వరసగా మూడు సార్లు గెలిచి,నాల్గొవ సారి విజయం కోసం ప్రయత్నాలు చేస్తున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తన వర్గాన్నిబలోపేతం చేసుకున్నట్లే కనిపిస్తున్నారు…అంతే కాకుండా ఆయనకు అడ్డుపడే వారిపై షెటేర్లు సందిస్తు,  సవాల్ చేస్తు ముందుకు వెళ్తున్నాడు. అందుకు గాను సీనియర్లు సండ్రపై గుర్రుగా ఉన్నట్లు కనిపిస్తోంది.. దాని ఫలితం రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది..? వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపు ఎలా ఉంటుంది.. పూలపై పానుపా…? ముళ్లమీద పానుపా..? సండ్ర భవిష్యత్ ఏంటి..? విజయం ప్రతినిధి అందించే రాజకీయ విశ్లేషణాత్మక కథనం.

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

సత్తుపల్లి నియోజకవర్గంలో వరసగా మూడు సార్లు గెలిచి, తన సత్తా ఏంటో చూపించిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నాల్గొవ సారి గెలిచేందుకు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోనే ఎక్కువ సార్లు గెలిచిన ఎమ్మెల్యేలలో వనమా వెంకటేశ్వరరావు తరువాత అంతటి స్థానం సాధించిన సండ్ర వెంకటవీరయ్య రాజకీయ భవిష్యత్ పై నీలినిడలు కమ్ముకుంటున్నట్లే కనిపిస్తున్నాయి. నాలుగు సార్లు గెలిచి ఐదోవ సారి గెలవాలనే తపనతో ఉన్న సండ్ర వెంకటవీరయ్యను కనిపించని శక్తులు అడ్డుపడుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి.. అదేంటో చూద్దాం..

ఇది కూడా చదవండి: భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

రాష్ట్రంలోని నియోజకవర్గాలలో సత్తుపల్లికి ప్రత్యేక స్థానం ఉంది…ఖమ్మం జిల్లాకే తలమానకమైన నియోజకవర్గం సత్తుపల్లి.. ఎందరో మహానీయులను అందించిన ఆ నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు, జలగంప్రసాద్ రావు, తుమ్మల నాగేశ్వరరావు లాంటి రాజకీయ మేథావులను అందించిన నేల ఇది. ఆ నేల ప్రస్తుతం పునర్వీభజనలో ఎస్సీ రిజర్వేషన్ కావడంతో బయట నియోజకవర్గ వ్యక్తులకు ప్రాథాన్యతనిచ్చింది.. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గానిదే  అధిపత్యం ఎక్కువ ఉంటుంది.  అలాంటి నియోజకవర్గంలో మొత్తం 11 సార్లు ఎన్నికలు జరగ్గా అందులో ఐదు     సార్లు కాంగ్రెస్, ఆరు సార్లు టీడీపీ విజయం సాధించింది. 1994 నుంచి 2018 ఎన్నికల వరకు ఆరు సార్లు ఎన్నికలు జరిగితే అందులో ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అది కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హావ్వా కొనసాగుతున్న సందర్భంలో అక్కడ  కాంగ్రెస్ గెలుచుకుంది. మిగిలిన ఐదు సార్లు టీడీపీ పార్టీ గెలిచింది.. వరసగా మూడు సార్లు టీడీపీ పార్టి నుంచి సండ్ర విజయం సాధించారు. మూడు సార్లు కూడా మాజీ మంత్రి తుమ్మలనాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మద్దతతో గెలిచినట్లు ప్రచారం జరిగింది.  2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన సండ్ర, రాజకీయ మార్పుల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. అప్పటికే మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగినప్పటికి అదిసాధ్యపడలేదు. వచ్చే ఎన్నికల్లో సండ్ర పరిస్థితి ఏంటి..?

== దూకుడు పెంచిన సండ్ర… అదే నష్టం చేస్తుందా..?

వరసగా మూడు సార్లు విజయం సాధించిన సండ్ర వెంకటవీరయ్యకు నియోజకవర్గంలో పట్టు పెరిగింది.. జనబలం పెరిగింది. కానీ ఒక్కటి మాత్రం లోపం కనిపిస్తోంది.. ఆయన ఒంటెత్తు పోకడ, దూకుడు స్వభావం ఆయన్ను ఇబ్బందులు కల్గించే పరిస్థితి కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: ‘సంక్షేమ భారత్’ మా లక్ష్యం: సీఎం కేసీఆర్

ముఖ్యంగా ఆయన మంత్రి పదవిపై కన్నేసినట్లుగా తెలుస్తోంది. ఐదవ సారి గెలిస్తే సీనియర్ ఎమ్మెల్యేగా మంత్రి పదవిని పొందోచ్చు అనే భావనతో ఉన్న  సండ్ర వెంకటవీరయ్య స్వతంత్రంగా ఎదగాలని భావించినట్లుంది.. సత్తుపల్లిలో కీలక నాయకులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జలగం వెంకట్రావులను కాదని  ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దపెద్ద కార్యక్రమాలు చేయడం, భారీప్రచారం కల్పించుకోవడం, ఆ కార్యక్రమాలకు సీనియర్లైన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జలగం వెంకట్రావ్, మట్టా దయానంద్, మువ్వా విజయ్ బాబులను పిలవకపోవడంతో సండ్రపై సీనియర్లు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ నాయకులందరు, సండ్ర స్పీడ్ కు కత్తెర వేసేందుకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే తుమ్మల, పొంగులేటి, మువ్వా విజయ్ బాబు, మట్టా దయానంద్ సత్తుపల్లి నియోజకవర్గంలో సండ్రను పిలవకుండా పర్యటనలు చేస్తున్నారు.  ముఖ్యనాయకులతో సమావేశం అవుతున్నారు. పరామర్శలు, పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ విషయాన్నిపసిగట్టిన సండ్ర వెంకటవీరయ్య, తను ప్రత్యర్థులుగా భావిస్తున్న తుమ్మల, పొంగులేటి, మువ్వా, మట్టాలపై విమర్శలకు పదును పెట్టారు. షెటేర్లు వేస్తూ తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పాడు. ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గంలో మీకేం పని అంటూ షేటర్లు వేయడం, మీటింగ్ లలో వారిపై ఆరోపణలు చేయడం ప్రారంభించిన సండ్ర వెంకటవీరయ్య తన గెలుపుకు ఒంటరిగా ప్రయత్నాలు ప్రారంభించుకున్నాడు. ఈ క్రమంలో తుమ్మల వర్గీయులు సండ్రకు దూరమైనట్లు తెలుస్తోంది. అంతే కాకుండా పొంగులేటి, మువ్వా, మట్టాదయానంద్ వర్గీయులు ఇప్పటికే పార్టీ మారే యోచనలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: ఖమ్మం జిల్లాకు సీఎం కేసిఆర్ వరాల జల్లు

దీంతో సుమారు 30శాతం ఓటింగ్ సండ్రాకు వ్యతిరేకంగా బయటకు పోయే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉంటే  సత్తుపల్లిలో ఇటీవలే టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సండ్రను ఓడించేందుకు వారంత ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు, వారి వెనక కీలక నాయకుడి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఇదింతా ఒకేత్తు అయితే సత్తుపల్లి నియోజకవర్గంలో అవసరం లేకపోయినప్పటికి  పదేపదే పెద్దపెద్ద కార్యక్రమాలను చేస్తూ ప్రజాప్రతిధులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ రకాల చైర్మన్లు కార్యక్రమాలకు ఖర్చు చేయలేక అప్పులు చేస్తున్న వదలడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సారి 2023లో జరగబోయే ఎన్నికల్లో సండ్ర ను నియోజకర్గంలో ఓడించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లుగా ఒంటెత్తు పోకడలు, ప్రజాప్రతినిధుల్లో వ్యతిరేకత సండ్రను దెబ్బతిసే అవకాశం లేకపోలేదు. సీనియర్లంతా ఒక్కటై, అందర్ని కలుపుకుని సండ్రను ఇంటికి పంపించాలనే లక్ష్యంతో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.చూడాలి.. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పును ఇవ్వనున్నారో..? వేచి చూడాల్సిందే..?