Telugu News

నైట్ కర్ప్యూ పక్కా…?

నేడు తెలనున్న రాష్ట్ర భవిష్యత్

0

నైట్ కర్ప్యూ పక్కా…?
నేడు తెలనున్న రాష్ట్ర భవిష్యత్
 సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యవసర కెబినెట్ సమావేశం
 రాష్ట్రంలో రోజురోజుకు భారీగా పెరుగుతున్న కోవిడ్ కేసులు
 అప్రమత్తమవుతున్న ప్రభుత్వం..
 కోవిడ్ కేసులపై పూర్తి స్థాయిలో చర్చ
పటిష్టమైన అంక్షలు పెట్టే అవకాశం
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి నైట్ కర్ప్యూ తప్పదా..? లాక్ డౌన్ వైపు కాకుండా నైట్ కర్ప్యూను పూర్తి స్థాయిలో అముల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందా..? రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో అంక్షల వైపు వైపు అడుగులు వేయనుందా.? అవసరమైతే సోమవారం నుంచే నైట్ కర్ప్యూ అమలు చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందా..? నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగబోయే కెబినెట్ సమావేశం అదే నిర్ణయం తీసుకోబోతుందా..? అంటే నిజమేనంటున్నారు విశ్లేషకులు. అత్యవసరంగా సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశం నిర్వహించడం వెనకాల రహాస్యమేంటంటే..? కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో రాష్ట్రంలో అంక్షలను అమలు చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు, బెడ్స్, కిట్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని భావిస్తున్నారు.

also read :-వాళ్లేం పాపం చేశామ్ సార్..?

పూర్తి వివరాల్లోకి వెళ్తే కోవిడ్ 19 మరోసారి తన ప్రభావాన్ని చూపిస్తోంది. పస్ట్, సెకండ్ వేవ్ లను తప్పించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని థర్డ్ వేవ్ వణికిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా మూడవ వేవ్ ప్రభావం తీవ్రతరమవుతున్న తరుణంలో దేశంలోని పలు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. కోవిడ్ పెద్దగా ప్రభావం చూపించకపోయినప్పటికి కేసులు మాత్రం తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి. దేశంలోని ఢిల్లీ,మహారాష్ట్ర, తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజురోజుకు రాష్ట్రంలో లక్షకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలోకూడా గత కొద్ది రోజులుగా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే కొన్ని అంక్షలను అమలు చేసిన తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు ఈనెల 31 వరకు సెలవులను పెంచింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్కూల్స్ కు సెలవు ప్రకటించడమే మంచిదని భావించిన తెలంగాణ ప్రభుత్వం ఈనెల ఆఖరు వరకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్హులు జారీ చేసింది. అయితే అత్యవసరంగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావించి సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. కేవలం కోవిడ్ అంశంపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలు, ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించడం, రెండు డోస్ లు పూర్తి స్థాయిలో అందించడం, ప్రంట్ వారియర్స్ కు బూస్టర్ డోస్ ఇవ్వడం లాంటి సంఘటనలతో పాటు మరోసారి అంక్షలను కఠినతరం చేసే విషయంలో చర్చించే అవకాశం ఉంది.

also read :-ఘనంగా గోశాలలో విజయం దినపత్రిక ప్రారంభోత్సవం..,..
నైట్ కర్ప్యూ పక్కా…?
కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో రాష్ట్రంలో మరోసారి నైట్ కర్ప్యూ పెట్టే అవకాశం కనిపిస్తోంది. సోమవారం జరిగే మంత్రి వర్గ సమావేశంలో ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. అలాగే మరోసారి పంక్షన్ హాల్స్, సినిమా హాల్, పార్కులు మూసివేసే అవకాశం ఉంది. మీటింగ్ లకు అనుమతులు లేకుండా అంక్షలను విధించే అవకాశం లేకపోలేదు. అయితే రాష్ట్ర వైద్యశాఖ అందించిన నివేదిక ప్రకారం కచ్చితంగా సోమవారం రాత్రి నుంచి లేదంటే ఈనెల 20 నుంచి 31 వరకు నైట్ కర్ప్యూ విధించే అవకాశం లేకపోలేదు. పండుగ వాతావరణ పూర్తిగా అయిపోయిన సందర్భంలో నైట్ కర్ప్యూ విధిస్తే మంచిదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక లాక్ డౌన్ ఇప్పుడు అవసరం లేదని ప్రభుత్వం కరాకండిగా తెల్చేసింది. వైద్యారోగ్యశాఖ కూడా లాక్ డౌన్ అవసరం లేదంటోంది. ఇక మాస్క్ పెట్టుకోవడం, పదిమంది ఒకే వద్ద ఉండకుండా పెద్ద ఎత్తున అంక్షలను విధించే అవకాశం లేకపోలేదు. అయితే సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర భవిష్యత్ తేలనుంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందేమోనని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వేచి చూస్తున్నారు.. అయితే నైట్ కర్ప్యూ విధించి, సమావేశాలు, ధర్నాలు, పంక్షన్లు లేకుండా చూడాలని, రద్దీ ప్రాంతాల్లో జన సమీకరణ నివారించాలని ప్రజలు కోరుతున్నారు. తద్వారా కేసులు పెరుగుతున్నాయని, వాటిని నివారిస్తే కచ్చితంగా కరోనాను నివారణ చేయోచ్చని, లాక్ డౌన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేయోద్దని, అదే జరిగితే కచ్చితంగా పేద ప్రజలు ఇబ్బందులు పడతారని చెబుతున్నారు. చూద్దాం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో..?