Telugu News

ఎన్నికలకు ముహూర్తం ఖరారైనా..?

నేడు కేంద్ర ఎన్నికల సంఘం కీలక భేటీ

0

ఎన్నికలకు ముహూర్తం ఖరారైనా..?

== నేడు కేంద్ర ఎన్నికల సంఘం కీలక భేటీ

== 5రాష్ట్రాల  ఎన్నికల పై సుదీర్ఘ చర్చ

(న్యూఢిల్లీ-విజయం న్యూస్)

అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు కానుందా..? అనుకున్న సమయానికి ఎన్నికలు జరుగుతాయా..? గడువులోపే ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైందా..? ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి..? కేంద్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకోబోతుంది..? మరింత సమాచారం కోసం దిగువ వార్తను చదవండి..

ఇది కూడా చదవండి:-;జమిలి ఎన్నికలు లేనట్లే..?

కొత్త సంవత్సరం ప్రారంభ మాసం లోనే దేశంలోని ఐదు రాష్ట్రాలకు కొత్త ప్రభుత్వాలు కొలువు తీరాల్సి ఉంది. ఐదు రాష్ట్రాల్లో కూడా జనవరిలోని వారి ప్రభుత్వ గడువు పూర్తి కానుంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, రాష్ట్ర ప్రభుత్వాలకు జనవరి 15 తేది లోపల గడువు పూర్తికానున్నాయి. భారతదేశంలో ఇప్పటి వరకు మొత్తం 31 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా,  2023 నవంబర్ లో చత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, మీజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాల్సి ఉంది.. అలాగే 2023 డిసెంబర్ లో రాజస్తాన్, తెలంగాణ లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీంతో కచ్చితంగా ఆ ఐదు రాష్ట్రాలలో డిసెంబర్లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అందుకుగాను కేంద్ర ఎన్నికల సంఘం గడువులోపే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఇప్పటికే ఓటర్ ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం, ఎన్నికలకు పూర్తిస్థాయిలో సమయుతమవుతుంది. అందులో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురితో కూడిన కమిటీ ఆయా రాష్ట్రాలలో పర్యటించి అన్ని పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిటీలతో సమావేశం అయ్యారు.

ఇది కూడా చదవండి:- జమిలి ఎన్నికలు సాధ్యమేనా..?

ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయిన కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు ఎన్నికలకు కావాల్సిన ప్రక్రియ పై చర్చించారు. ఈ మేరకు ఐదు రాష్ట్రాలకు సంబంధించిన సభ్యులు ఇచ్చే నివేదికను ఆధారంగా గడువులోపు ఎన్నికలను నిర్వహించాలా వద్దా అనే విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేకంగా భేటీ అయ్యి చర్చించనున్నారు. ఐదు రాష్ట్రాలకు సంబంధించిన సభ్యులు ఇచ్చే నివేదికను ఆధారంగా గడువులోపు ఎన్నికలు నిర్వహించాలా..? వద్దా..? అనేది చర్చించనున్నారు. అనంతరం పూర్తిస్థాయి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించి, ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం  నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేయునున్నారు. అయితే ఈరోజు జరిగే కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం ఆసక్తిని రేపుతుంది. గడువులోకి ఎన్నికలు నిర్వహిస్తుందా..? లేదా అనేదానిపై ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు, ఆయా పార్టీ ప్రతినిధులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది.

ఇది కూడా చదవండి:- విజయభేరితో  ఎన్నికల కదనభేరి : కాంగ్రెస్

దేశంలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎప్పుడు ఎన్నికలను నిర్వహిస్తుందా..? అనే దానిపై ఆసక్తి నెలకొంది. లోక్సభ ఎన్నికలకు ఎన్నికల సమయానికి కొద్ది రోజులు గడువు ఉండటంతో ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకంగా ఉన్నాయి. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం ఏం ప్రకటన చేస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.