16వేల పోడు పట్టాలిచ్చిన మొగోడేవ్వరైనా ఉన్నారా..?: మంత్రి
చాతిలోతు నీళ్లలో ఉండి రక్షించినం.. అప్పుడు మీరెక్కడున్నరు
16వేల పోడు పట్టాలిచ్చిన మొగోడేవ్వరైనా ఉన్నారా..?: మంత్రి
== సీఎం కేసీఆర్ ఇచ్చిండు..
== 60ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేసింది
== వరదలోస్తే ఒక్క ప్రాణం పోకుండా కాపాడినం
== చాతిలోతు నీళ్లలో ఉండి రక్షించినం.. అప్పుడు మీరెక్కడున్నరు
== పినపాకను అభివృద్ధి చేసింది మేం కాదా..? మీరేం చేసిండ్రు
== పినపాకలో కాంగ్రెస్ పై మండిపడిన మంత్రి పువ్వాడ అజయ్
== పినపాకలో రూ.35.40 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి పువ్వాడ.
(మణుగూరు-విజయంన్యూస్)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు 16వేల మందికి పోడు భూములు పట్టాలు ఇచ్చినం.. కేసీఅర్ ఇచ్చారు.. మేం పంచినం.. ఇన్ని వేల పట్టాలిచ్చిన మొగుడేవ్వరైనా ఉన్నారా.? అది సీఎం కేసీఆర్ మాత్రమే ఇచ్చారు.. కొన్ని ఏళ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్ ఏం చేసింది. మీరేం చేశారు..? అంటూ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించి రూ.35.40కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే రేగ కాంతారావుతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పినపాక నియోజకవర్గం బూర్గంపాడు లో ఆర్ఎంఎస్ఏ నిధులు రూ.2.70 కోట్లతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ విప్ రేగ కాంతా రావు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: మీరు గర్వపడేలా అభివృద్ది చేస్తా: మంత్రి పువ్వాడ
బూర్గంపహాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అవరణలో డీఎంఎఫ్టీ నిధులు రూ.2.70 కోట్లతో నిర్మించనున్న నూతన భవనం, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మణుగూరు శివారు హనుమాన్ టెంపుల్ వద్ద నూతనంగా ఎర్పాటు చేసిన రథంగుట్ట అర్బన్ పార్క్ ను ప్రారంభించారు. అనంతరం పార్క్ అవరణంలో మొక్కలు నాటారు. మణుగూరులోఎస్డీఎప్ నిధులు రూ.5 కోట్లతో టీఎస్ ఆర్టీసి నూతన బస్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మణుగూరు పురపాలక సంఘం పరిధిలో ఎస్డీఎఫ్ నిధులు రూ.25 కోట్లతో నిర్మించనున్న నూతన మున్సిపల్ కార్యాలయ భవనం, సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్ తదితర అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు.
== రేగా బుల్లెట్ మాదిరి ఉన్నాడు: మంత్రి పువ్వాడ
మణుగూరు మండల కేంద్రంలోని కిన్నెర కల్యాణ మండపంలో ప్రభుత్వ విప్ రేగ కాంతారావు అధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశంలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ పినపాక ఎమ్మెల్యే బుల్లెట్ మాదిరి ఉన్నాడు.. పని చేసే ఎమ్మెల్యే దొరకడం పినపాక నియోజకవర్గ అదృష్టమని అన్నారు. తన సమయం మొత్తం కేవలం నియోజకవర్గ అభివృద్ది కోసం పని చేస్తున్నాడని, నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసని అన్నారు. సెక్రటేరియట్ లో చూస్తూనే ఉంటానని పేర్కొన్నారు. ఆర్టీసి నూతన బస్ స్టాండ్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఅర్ ఇచ్చిన ఎస్డీఎఫ్ నిధుల నుండి రూ.5 కోట్లు వెచ్చించడం మంచి విషయమన్నారు. ప్రజా రవాణా, ప్రజల అస్తి, పౌర సేవల కోసం, మణుగూరు అభివృద్ది కోసం రూ.25 కోట్లు కేటాయించడం వారికే సాధ్యమైందన్నారు.
ఇది కూడా చదవండి: ఖమ్మంలో నలు దిక్కుల అభివృద్ది చేసి:మంత్రి పువ్వాడ
దండాలు పెట్టుకుంటు.. తల నిమురుకుంటు.. మెడ వంకర పేట్టి కౌగిలించుకుంటే జరిగుతదా అభివృద్ది.. కష్టపడితే జరుగుతుందని అభివృద్ది అని పొంగులేటిని ఉద్దేశించి ఆరోపణలు చేశారు. నిధుల వేట కోసం రేగ కాంతారావు నిత్యం తిరుగుతారని, అలాంటి మంచి ఎమ్మేల్యే ఉండటం మీ అదృష్టమని అన్నారు. ఇలాంటి వాళ్ళను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంను తెచ్చుకోవాలని, లేకపోతే ప్రజలను దోచుకునే రాజ్యం వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి బ్యాటరీ ఛార్జింగ్ ఏ ఉండదని, అది ఏనాడో ఎప్పుడో తుప్పుపట్టిపాయిందన్నారు. తుప్పుపట్టిన బ్యాటరీ పనిచేస్తుందా..? పనిచేసేందుకు కొందరు దొంగప్రేమలను చూపిస్తూ కష్టపడుతున్నారని, కానీ తుప్పుపట్టిన బ్యాటరీకి ఎంత ఖర్చు చేసిన చెరువులో పోసిన పన్నీరే అవుతుందన్నారు.
== కరోనా సమయంలో కాంగ్రెస్ ఎక్కడుంది..? : మంత్రి
కరోనా సమయంలో మీరేం చేశారు..? గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్తాం. మేం పనిచేశామని. బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేసింది..బీఆర్ఎస్ కార్యకర్తలు తమకు తోచిన రీతిలో పని చేశారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు 16వేల మందికి పోడు భూములు పట్టాలు ఇచ్చినం.. కేసీఅర్ ఇచ్చారు. కొన్ని ఏళ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్ ఏం చేసింది. మీరేం చేశారని ప్రశ్నించారు. గోదావరి వరదలు వచ్చాయి.. ప్రజల ప్రాణాలు ఒక్క ప్రాణం అంటే ఒక్క ప్రాణం పోకుండా కంటికిరెప్పలా కాపాడుకున్నాం. గోదావరి అటువైపు నేను .. ఇటు వైపు రేగ కాంతారావు వరదల్లో పని చేశాం. ప్రజలకు అండగా నిలబడ్డామని గుర్తు చేశారు. వరదల సమయంలో కాంగ్రెస్ ఎక్కడుందని ప్రశ్నించారు. ప్రజలకు మీరేం చేశారు..?
ఇది కూడా చదవండి: చాకలి ఐలమ్మ జీవితం ఆదర్శం: మంత్రి పువ్వాడ
ఇక్కడ నిద్రపోయారు చెప్పాలని నిలదిసే ప్రయత్నం చేశారు. అలాంటి వాళ్ళను మనం గెలిపించుకోవాలా..? మనకు పని చేసే వారినే మనం గెలిపించుకోవాలో ప్రజలు తెల్చుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఅర్ మన జిల్లా రైతాంగం కోసం, ప్రజల కోసం రూ.13వేల కోట్ల రూపాయల సీతారామ ప్రాజెక్ట్ ను తీసుకొచ్చి లక్షల ఎకరాలకు సాగునీరు, త్రాగునీరు అందించేందుకు ప్రాజెక్ట్ తెచ్చారని అన్నారు.మనం కేసీఅర్ కి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5సీట్లు, ఖమ్మం జిల్లా లోని 5 సీట్లు గెలిపించుకుని కేసీఆర్ కి కనుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈసారి మనం మన పార్టీ నీ గెలిపించుకోవాలని కోరారు.