Telugu News

ఐటీ హబ్ దేశానికే అదర్శం

= నిరుద్యోగ యువతకు సమగ్రవేదిక

0

ఐటీ హబ్ దేశానికే అదర్శం
== నిరుద్యోగ యువతకు సమగ్రవేదిక
== 5వేల మంది యువతకు ఉపాధి కల్పించాం
== ఐటీ హబ్ మొదటి వార్షికోత్సవ సభలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)
ఖమ్మం ఐ.టి హబ్ దేశానికే అదర్శంగా నిలిచిందని, రాష్ట్రంలో ఏర్పాటైన ఐ.టి హబ్ లలో ఖమ్మం నగర ఐ.టి హబ్ సమగ్రమైన ఐ.టి హబ్ గా నిలిచిందని రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పునరుద్ఘటించారు. ఖమ్మం స్థానిక నిరుద్యోగ యువతకు సమగ్ర వేదికగా నిలిచిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసుకున్న ఐ.టి హబ్ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆదివారం ఐ.టి హబ్ లో జరిగిన మొదటి వార్షికోత్సవ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రివర్యులు, గౌరవ రాష్ట్ర పురపాలక, ఐ.టి శాఖ మంత్రి ప్రత్యేక చొరవతో ఖమ్మం నగరంలో ఐ.టి.హబ్ ను సంవత్సరం క్రితం ఏర్పాటు చేసుకొని ప్రసిద్ధిగాంచిన (19) ఐ.టి కంపెనీలలో 5 వందల మంది యువతకు ఉపాధి అవకాశం కల్పించామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ‘ రాష్ట్రంలో ఏర్పాటైన ఐ.టి హబ్ లలో ఖమ్మం నగర ఐ.టి హబ్ సమగ్రమైన ఐ.టి హబ్ గా నిలిచిందని, ఐ.టి రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, వివిధ రంగాలలో వృత్తినైపుణ్యతను పెంపొందించేందుకు టాస్క్ ద్వారా శిక్షణ కార్యక్రమాలను ఐ.టి హలో నిరుద్యోగ యువతకు అందుబాటులోకి తేవడం జరిగిందని మంత్రి తెలిపారు. టాస్క్ సి.ఈ.ఓ శ్రీకాంత్ సిన్హా ఆధ్యర్యంలో నగరంలో టాస్క్ శిక్షణ కేంద్రం అద్భుతంగా పనిచేస్తుందని మంత్రి అభినందించారు.

also read :-కాళేశ్వరం లో ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్లు

నాలుగైదు సంవత్సరాల క్రితం కేవలం హైద్రాబాద్ తో పాటు ఇతర నగరాలకే పరిమితమైన ఐ.టి. రంగాన్ని జిల్లా కేంద్రాలలో విస్తరింపచేయాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రివర్యుల ఆదేశాలతో రాష్ట్ర పురపాలక ఐ.టి. శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రత్యేక చొరవతో జిల్లా కేంద్రాలలో ఐ.టి హట్లు ఏర్పాటయ్యాయని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఖమ్మం నగరంలో అతి త్వరలోనే రెండవ దశ ఐ.టి హబ్ ను అందుబాటులోకి తెచ్చి స్థానిక నిరుద్యోగ యువతకు ఐ.టి రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. గ్లోబల్ ఐటీ మ్యాప్‌లో హైదరాబాద్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో, ఇప్పుడు దాని వంతు వచ్చింది తెలంగాణలోని టైర్ 2 నగరాలు దీనిని అనుసరించి, ఐటీ రంగం చుట్టూ కేంద్రీకృతమై ఆర్థిక ప్రయోజనాలను పొందుతాయి. ఈ లక్ష్యంతోనే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండలో ఐటీ హబ్‌లు ఏర్పాటయ్యాయి.

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ ఖమ్మం ఐ.టి హబ్ జిల్లాకు గర్వకారణంగా నిలిచిందని, గతంలో ప్రసిద్ధి చెందిన నగరాలలోనే ఐ.టి రంగంలో ఉపాధి అవకాశాలు వచ్చేవని, ప్రస్తుతం జిల్లా కేంద్రాలలోనే ఐ.టి రంగంలో స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. విదేశాలలో స్థిరపడిన జిల్లాకు చెందిన ప్రముఖ కంపెనీల బాధ్యులు,
జిల్లా కేంద్రంలో ఐ.టి రంగాన్ని విస్తరింప చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని, ఖమ్మం నగరం రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ, ప్రభుత్వ పరంగా అవసరమైన ప్రాథమిక మౌళిక సదుపాయాలు కల్పిస్తున్న నేపథ్యంలో మరిన్ని ఐ.టి కంపెనీలు ముందుకొస్తున్నాయని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.

also read :-న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
ఐ.టి హబ్ కో-ఆర్డినేటర్, టెక్నోజెన్ సి. ఈ.ఓ ల్యాక్ చేపూరీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కె.చంద్రశేఖర్ రావు, రాష్ట్ర పురపాలక, ఐ.టి శాఖ మంత్రి కె.తారకరామారావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గార్ల ప్రత్యేక చొరవతో 2017 జూన్లో ఐ.టి హబ్ పనులకు శంఖుస్థాపన చేసుకొని డిశంబరు 2020లో ప్రారంభించుకున్నామని, ఖమ్మం ఐ.టి హబ్ ఒక సంవత్సర కాలంలో 19 కంపెనీల ద్వారా సుమారు 5 వందల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిందన్నారు. రాబోయో కాలంలో రెండవ దశ ఐ.టి హబ్ ను కూడా అందుబాటులోకి తెచ్చి మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. టాస్క్ సి.ఈ.ఓ శ్రీకాంత్ సిన్హా టి.హబ్ వైస్ ప్రసిడెంట్ పన్నీరు సెల్వం,
జయచల్లా, ప్రకాష్ బత్తినేని, ప్రసంగించారు. వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులను, స్పోర్ట్స్ మీట్-2021 విజేతలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ట్రోఫీలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో
నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డి.సి.సి. బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, కార్పోరేటర్లు, వివిధ కంపెనీల సి.ఈ.ఓలు అర్వింద్, పులుసు శ్రీనివాస్, మధు, శ్రీధర్ చనుమోలు, సాగర్, సందీప్, ఐ.టి హబ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.