Telugu News

ఇది రౌడీల రాజ్యం

కేసీఆర్ అంటే గారడీ మాటలు.. గలీజు తిట్లు

0

ఇది రౌడీల రాజ్యం

== కేసీఆర్ అంటే గారడీ మాటలు.. గలీజు తిట్లు

== తెలంగాణలో దొంగల రాజ్యం..దోపిడీ రాజ్యం

== సింగరేణి తెలంగాణ కు సిరుల తల్లి

== సింగరేణి వైపు తిరిగి చూడని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్

== మిగులు రాష్ట్రం..అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్ ది

== పాదయాత్ర సందర్భంగా కొత్తగూడెం బహిరంగ సభలో ప్రభుత్వంపై ద్వజమెత్తిన షర్మిళ

==  కొత్తగూడెం నియోజక వర్గం లో కొనసాగుతున్న ప్రజా ప్రస్థానం పాదయాత్ర

== బహిరంగ సభ కి భారీగా హాజరైన వైఎస్సార్ అభిమానులు

(భద్రాద్రికొత్తగూడెం బ్యూరో-విజయంన్యూస్)

తెలంగాణ రాష్ట్రంలో రౌడిల రాజ్యం నడుస్తోందని, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం రాజ్యమేలుతుందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ ఆరోపించారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆమె చేపట్టిన ప్రజాప్రస్తాన పాదయాత్ర కొత్తగూడెం నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా కొత్తగూడెం పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి అంటే వైఎస్ఆర్ అని, ఆయన పాలనలో  ప్రతి ఒక్కరికీ అండగా నిలిచారని అన్నారు.

కులాలకు,మతాలకు,పార్టీలకు అతీతంగా అందరికి న్యాయం చేశారని,  ఫీజు రీయింబర్స్మెంట్ తో ఉచితంగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకుని లక్షలు సంపాదిస్తున్నారని తెలిపారు. 46 లక్షల పక్కా ఇల్లు కట్టించారని,  ఉచితంగా రాజీవ్ ఆరోగ్య శ్రీ తో కార్పొరేట్ వైద్యం అందించారని అన్నారు. ఖమ్మం జిల్లా పై వైఎస్సార్ కి ప్రత్యేక ప్రేమ ఉండేదని, ఎస్సీల అభివృద్ధి పై వైఎస్సార్ ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. ఎస్సీల కోసం 200 వందల బాయ్స్ హాస్టల్స్ కట్టించిన చరిత్ర వైఎస్ఆర్ దేనని అన్నారు. సింగరేణి తెలంగాణ కు సిరుల తల్లి అని, అలాంటి సింగరేణి వైపు  కేసీఆర్ ఏ రోజైనా దృష్టి సారించారా..? తిరిగి చూశారా..? అని ప్రశ్నించారు. సింగరేణి ఆస్తులు కూడా పక్క దారి పడుతున్నాయని ఆరోపించారు.  వైఎస్సార్ హయాంలో ఒక కార్మికుడు విధి నిర్వహణ లో చనిపోతే వెంటనే వచ్చి పరామర్శించారని, ఆకుటుంబానికి అండగా ఉన్నారని,  కేసీఆర్ హయాంలో 68 మంది చనిపోతే వచ్చి చూసిన దిక్కు లేదని ఆరోపించారు.

also read ;-బుట్టాయిగూడెం గ్రామంలో చలివేంద్ర ప్రారంభం

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పై అమ్మ పెట్టదు అడక్కు తిననివ్వదు అనే సామెత లా ఉంది కేసీఆర్ పరిస్థితి అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విభజన హామీ అని, ఒక ఉద్యమం చేస్తా అని చెప్పి ఒక రోజు ధర్నా చేసి వదిలేశాడని ఆరోపించారు. కేసీఆర్ కి తెలిసింది గారడీ మాటలు.. గలీజు తిట్లని, ఎక్కడ చూసినా దొంగల రాజ్యం..దోపిడీ రాజ్యం నడుస్తోందన్నారు. ఇది రౌడీల రాజ్యం అని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ కో గెలిచి టీఆరెఎస్ కి జంప్ అయ్యాడని, ఆయన కొడుకు కి మహిళల మాన ప్రాణాలు కావాలని కోరుకుంటున్నాడని ఆరోపించారు.  ఆయన కొడుకుతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఎమ్మెల్యే కొడుకు పై 12 కేసులు పెట్టినందుకు ఆ బాధ్యత ఎమ్మెల్యేది కాదా..? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ప్రోద్భలంతోనే కొడుకు ఇష్టానుసారంగా వ్యవహరించాడని, మానప్రాణాలను కోరుకున్నాడని అన్నారు.

ఎమ్మెల్యే కొడుకుకు పాలకుల అండ ఉందని, తక్ష్ణమే ఎమ్మెల్యే బాధ్యత తీసుకుని రాజీనామా చేయాల్సి ఉండే అన్నారు. పదవుల కోసం పాకులాడే వారు రాజీనామాలు చేయబోరని, ప్రజలే రాబోయే ఎన్నికల్లో బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. యదా లీడర్.. తదా క్యాడర్, పాలకులకు మదమెక్కిందని ఆరోపించారు. మిగులు రాష్ట్రం..అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్ దేనని, బీడీ బిచ్చం..కళ్ళు ఉద్దెర లా ఉంది కేసీఆర్ పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. తెలంగాణ లో ఏ పథకానికి డబ్బు లేదని, మరి తెచ్చిన అప్పులు అన్ని ఎటు పోయాయో, అన్ని కేసీఆర్ ఇంట్లోకే పోయాయని అన్నారు. అమ్మకు అన్నం పెట్టడు కానీ..పిన్నమ్మకి గాజులు చేస్తాడట

అన్నట్లుగా ఉంది సీఎం కేసీఆర్ పరిస్థితి అని ఆరోపించారు. ఇక్కడ ఎం ఉద్ధరించాడో అర్థం కావడం లేదు కానీ, ఇప్పుడు దేశాలు ఏలబోతాడు అంటా అని యద్దేవా చేశారు. ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలువు అని సూటిగా ప్రశ్నించారు. ఇది తాలిబన్ల ప్రభుత్వం.. గుండాలా ప్రభుత్వం .రౌడీ రాజ్యం నడుస్తోందన్నారు. ఓట్లు వేయించుకోవడం…ఫామ్ హౌస్ కి వెళ్లిపోవడం కేసీఆర్ కి ఇదే తెలుసని, గాడిద కి రంగు పూసి ఇదే ఆవు అనడంలో కేసీఆర్ దిట్టా అని అన్నారు.

also read :-విద్యుత్ ఘాతుకానికి ముగజీవాలు మృతి

నాతో ఒక్క రోజు కలిసి పాదయాత్ర చేస్తారా..? అని కెటిఆర్ కి, కేసీఆర్ కి సవాల్ చేశారు. సమస్యలు ఉంటే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి దళితుడిని ముఖ్యమంత్రి చేయాలని సవాల్ చేశారు. సమస్యలు లేకుంటే ముక్కు నెలకు రాసి ఇంటికి వెళ్లి పోతా అని అన్నారు. బీజేపీ కూడా చేసింది ఏమీ లేదని, రెండు కోట్ల ఉద్యోగాలు ఏవో అర్థం కావడం లేదన్నారు. ఇంధన,గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతున్నారని, టీఆరెఎస్,బీజేపీ లు ప్రజల రక్తాన్ని పీల్చే రాబందులని ఆరోపించారు. వైఎస్సార్ పాలన కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ ని స్థాపించానని, వైఎస్సార్ బిడ్డ నేను, ఇక్కడే పుట్టా…ఇక్కడే పెళ్లి చేసుకున్నా…కొడుకును కన్నా అని అన్నారు. ఈ గడ్డ కు సేవ చేసే హక్కు నాకు లేదా..? అని ప్రజలను అడిగారు. ఆశీర్వదిస్తే వ్యవసాయం పండుగ చేస్తానని, కౌలు రైతుల సంక్షేమం కోసం పని చేస్తానని, ప్రతి పేదింటికి ఇల్లు. అది కూడా మహిళ పేరు మీద మంజూరు చేస్తానని, ఆరోగ్య శ్రీ మళ్ళీ బ్రమ్మండంగా అమలు చేస్తానని,

also read :-కన్నాయిగూడెం, వైన్స్ షాప్ లో ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు

మొట్ట మొదటి సంతకం చదువు కున్న బిడ్డలకు ఉద్యోగాల మీద నే పెడతానని హామినిచ్చారు. కేసీఆర్ నియంత పాలన పోవాలి..అక్రమ పాలన పోవాలి . రౌడీ రాజ్యం పోవాలంటే కచ్చితంగా వైఎస్ఆర్ టీపీని హక్కున చేర్చుకోవాలని కోరారు. ప్రజల సంక్షేమం కోసం పాటు పడే వైఎస్సార్ తెలంగాణ పార్టీ రావాలని కోరారు.

 

కేసీఆర్ పాలన ప్రజల కోసం కాదు.. నేతల కోసం 

== రైతులంటే కేసీఆర్ కేందుకు చిన్నచూపు

== ఆత్మహత్యలు పెరుగుతున్న ఈసంత పాపమనించదా..? 

== కౌలు రైతులను గాలికి వదిలేశారు

== పంటపండించేది అసలైన కౌలు రైతు

==కౌలు రైతులకు రుణాలిచ్చి అదుకున్న ఘనత రాజన్నదే

== వనమా రాఘవేంద్ర బాధితులు కుప్పలుతెప్పలుగా ఉన్నారు

== తండ్రి ప్రోద్భలంతోనే వనమా రాఘవ తప్పుడు పనులు

== ఎమ్మెల్యే వనమాను భర్తరఫ్ చేయాలి

== రైతు దీక్షలో ప్రభుత్వంపై మండిపడిన వైఎస్ షర్మిళ 

కేసీఆర్ పాలన ప్రజల కోసం కాదు.. నేతల కోసం, నేతలకు బుజాలు తడిపై కాంట్రాక్టర్ల కోసమేనని వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిళ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ పరిపాలనలో ఏ ఒక్క సామాన్యుడు సంతోషంగా లేడని, మనో వేదనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని షర్మిళ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు గాను చేపట్టిన ప్రజాప్రస్తాన పాదయాత్ర భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో కొనసాగుతోంది. అందులో భాగంగా సోమవారం కొత్తగూడెం నియోజక వర్గం గరీబ్ పేట గ్రామం లో రైతు గోస ధర్నా లో పాల్గొన్న వైఎస్ షర్మిల మాట్లాడారు.  తెలంగాణ లో రైతును మనిషిగా చూడటం లేదని,  కనీసం గౌరవం కూడా లేదని ఆరోపించారు. రైతు కటపడితే పరామర్శించే దిక్కు కూడా లేదని,  సీఎం దగ్గరకు వెల్తే కూడా పరిష్కరించరా…? అని ప్రశ్నించారు. సాయం చేయమని మొఖం మీద చెప్తున్నారని ఆరోపించారు.

also read :-కేసీఆర్ పాలన ప్రజల కోసం కాదు.. నేతల కోసం

కేసీఆర్ కి కళ్ళు ఉండి కనిపించవని, చెవులు ఉండి వినిపించవని ఆరోపించారు.  ఫామ్ హౌస్ లో బోగాలు అనుభవిస్తున్న సీఎం కేసీఆర్ చేసిన మోసం తో అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు.  అప్పులమీద అప్పులు..మిత్తి ల మీద మిత్తిలు కట్టలేక హత్మహత్యలు చేసుకుంటున్నారని,  పంట నష్టం జరిగితే పరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదని పేర్కొన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పి రైతు బందు ఇస్తే ఉపయోగం ఎంటి..? అని ప్రశ్నించారు. ఒక చేత్తో రైతు బందు ఇచ్చి..మరో చేత్తో బ్యాంక్ ల పేరిట గుంజుకుంటున్నారని అన్నారు. భూమిలేని అతి పేద రైతు కౌలు రైతు,  కౌలు రైతుకు వ్యవసాయం మాత్రమే తెలుసని  ప్రభుత్వం నుంచి ఏవి ఇవ్వక పోయినా వ్యవసాయం చేసుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ దృష్టిలో సంక్షేమం అంటే ఒక చేత్తో ఇవ్వడం …మరో చేత్తో తీసుకోవడమని దుయ్యబట్టారు. వైఎస్ హయాంలో ఏ పంట పండించినా పెట్టుబడి తక్కువ…రాబడి ఎక్కువ ఉండేదని,  అందుకే వైఎస్ హయం లో వ్యవసాయం బంగారంలా ఉండేదని, కానీ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం దండగా అనేవిధంగా మారిందన్నారు.

కేసీఆర్ ఇచ్చిన హామీలతో రెండు సార్లు రైతులు మోసపోయారని,  ఇక మోసపోయింది చాలని అన్నారు. వాగ్దానం చేసిన హామీలను నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి కేసీఆర్ గద్దె దింపుడే తరువాయి అన్నారు.  ప్రభుత్వ ఆసుపత్రులు అధ్వాన్నం గా మారాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకలు పీక్కుతింటుంటే…ప్రైవేట్ ఆసుపత్రుల్లో బిల్లుల మోత మోగిపోతున్నాయని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకలు… జనరల్ వార్డుల్లో కుక్కలు.. స్పెషల్ వార్డుల్లో పిల్లులు తీరుతున్నాయని ఆరోపించారు. డాక్టర్ ఉంటే నర్స్ ఉండడు..నర్స్ ఉంటే డాక్టర్ ఉండడని అన్నారు. కేసీఆర్ కి జబ్బు వేస్తే ఢిల్లీ కి పోతాడని, పేదలకు బాగా లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రి లకు పోవాలా..? అని ప్రశ్నించారు. కొండంత రాగం తీసి ఏదో పాట పడినట్లు ఉంది కేసీఆర్ పరిస్థితి అని దుయ్యబట్టారు. యాసంగి పంట ఎలా కొనరో అంటూ ఢిల్లీకి వెళ్లి ఉత్త చేత్తో తిరిగి వచ్చాడని ఆరోపించారు.  స్థానిక ఎమ్మెల్యే వనమా కొడుకు అరాచకాలు ఎక్కువ అయ్యాయని, కంచె చేను మేస్తే ఇక ఎవరికీ చెప్పుకోవాలి అన్నట్లు ఉందని అన్నారు.

also read :-కొత్త బాస్

ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రోద్బలంతోనే వనమా రాఘవ దాష్టికాలు ఎక్కువైయ్యాయని, అందుకే వనమా వెంకటేశ్వరరావు నైతిక బాధ్యత తీసుకుని రాజీనామా చేయాలని సూచించారు. లేదంటే అసెంబ్లీ స్పీకర్ సుమోటోగా తీసుకుని అసెంబ్లీ నుంచి తప్పించాలని, ప్రభుత్వం వనమా వెంకటేశ్వరరావును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలన ప్రజల కోసం కాదు …టీఆర్ఎస్ నేతల కోసమని ఆరోపించారు. పోలీస్ లను వాళ్ళకోసం నియమించుకుంటున్నారని పేర్కొన్నారు. పోలీస్ లను పనోల్లుగా వాడుకుంటున్నారని, వ్యవసాయ మంత్రి రైతుల ఆత్మహత్యల పై హేళన గా మాట్లాడుతుండటం హాస్యాస్పదమని అన్నారు. సినిమా టిక్కెట్లు తో పోల్చుతుంటే మరో ఎమ్మెల్సీ వరి కంకులతో కొట్టమని చెప్తారా..? అని ప్రశ్నించారు.

రైతు అంటే అసలు ఈ ప్రభుత్వానికి.. ఈ టీఆరెఎస్ నేతలకు లెక్క ఉందా..? అని ప్రశ్నించారు. తెలంగాణ లో అసలు ప్రతిపక్షం లేక పోవడమే కేసీఆర్ ఆడింది ఆట..పాడింది పాట లా సాగుతుందన్నారు. అందుకే రైతుల పక్షాన నిలిచేందుకే మీ ముందుకు వచ్చానని, ప్రజలందరు వైఎస్ఆర్ టీపీని ఆశీర్వదిస్తే కచ్చితంగా రైతు రాజ్యం తీసుకోస్తానని హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ గడుపల్లి కవిత, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.