Telugu News

ఉద్యోగాల ప్రకటన పేరుతో యువతను మోసం చేస్తున్న సీఎం: పువ్వాళ్ల

గత ఎన్నికల్లో కూడా ఇలాగే ప్రకటన చేసింది

0

ఉద్యోగాల ప్రకటన పేరుతో యువతను మోసం చేస్తున్న సీఎం: పువ్వాళ్ల
== గత ఎన్నికల్లో కూడా ఇలాగే ప్రకటన చేసింది
== ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఊసే లేదు
== యువత, నిరుద్యోగులు టీఆర్ఎస్ సర్కార్ ను నమ్మిమోసపోవద్దు
== విలేకర్ల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-
ఉద్యోగ నియామకాల ప్రకటన పేరుతో యువతను, నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని, సీఎం కేసీఆర్ మాయమాటలను ఏ ఒక్కరు నమ్మోద్దని, నిరుద్యోగులు, యువత తస్మత్ జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పేర్కోన్నారు. గురువారం ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు రోజులుగా అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నియామకంపై నిరుద్యోగులకు భ్రమలు కల్పించే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. గత ఎనిమిదేళ్ల నుండి ఉద్యోగాల పై అనేక వాగ్దానాలు చేస్తూ తెలంగాణ ఉద్యమ సారాంశమే నీరు,నిధులు,నియామకాల కొరకని ఉద్యోగాల పై ఎప్పటికప్పుడు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ మరోసారి అసెంబ్లీ సాక్షి గా నిరుద్యోగలకు వరాల జల్లు కురిపిస్తున్న సీఎం కేసీఆర్, గడిచిన నాలుగు ఉప ఎన్నికలలో కూడా ఇలాగే ప్రకటనలు చేశారని,

also read;-కమలం నెక్స్ట్ టార్గెట్ ‘తెలంగాణ’

కానీ ఇప్పటి వరకు ఎలాంటి నియమాకాలు లేవని అన్నారు. ఉప ఎన్నికల అయిపోయిన 50 వేల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ నియామకాలు చేపట్టకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర మనోవేదన కు గురైయ్యారని తెలిపారు. నోటిఫికేషన్ అని చెప్పగానే తల్లిదండ్రులు కూలీనాలి చేసుకుని సంపాధించే డబ్బులను కోచింగ్ సెంటర్లకు దారపోస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా నోటిఫికేషన్లు ఇస్తారా..? లేదంటే ఎన్నికల వరకు నాన్చి, ఎన్నికల అనంతరం ప్రభుత్వం వస్తేనే ఉద్యోగాలిస్తామని నాన్చుతారా..? అంటూ అనుమానాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు నిజంగా నిరుద్యోగుల పై ప్రేమ ఉంటే ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే లోపు 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి, ఉద్యోగాలు రాని వారికి ఇప్పటి నుండే రూ.3016 నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

also read;-కేసీఆర్ వ్యూహమేంటి..?

2018 లోనే బిస్వాల్ కమిటీ నివేధిక ప్రకారం 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి అని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం, ఆ తరువాత 90వేలకు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. చిత్తశుద్ధితో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో చాలా గొప్పగా ప్రజలను తప్పుదోవ పట్టించేటట్లుగా ఉన్నదని గత ప్రభుత్వాలను విమర్షించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం అని హెద్దేవా చేశారు. ధనిక రాష్ట్రంగా తెలంగాణ ను అప్పజెప్పితే 6 లక్షల కోట్ల అప్పుల తెలంగాణ గా మార్చి మాటల గారడీ తో ,కల్లబొల్లి కబుర్లు చెపుతున్నారని ఆరోపించారు. దీనిని జిల్లా కాంగ్రెస్ కమిటీ తరువున తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు…డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కు 8 లక్షల రూపాయల ఇవ్వాలని జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య,సయ్యద్ హుస్సేన్ పాల్గొన్నారు.