Telugu News

ప్రజల మధ్య ఐకమత్యం, మతసామరష్యం, సోదరభావము అవసరం – తాతా మధుసూదన్

ఈద్ మిలాప్ కార్యక్రమము వలన ప్రజల మధ్య ఐకమత్యం, మతసామరష్యం, సోదరబావము పెంపొందుతాయని ఎమ్మెల్సీ & టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ అన్నారు.

0

ప్రజల మధ్య ఐకమత్యం, మతసామరష్యం, సోదరభావము అవసరం
== ఎమ్మెల్సీ & టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్
(ఖమ్మం-విజయంన్యూస్)
ఈద్ మిలాప్ కార్యక్రమము వలన ప్రజల మధ్య ఐకమత్యం, మతసామరష్యం, సోదరబావము పెంపొందుతాయని ఎమ్మెల్సీ & టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ అన్నారు. జమాతే ఇస్లామీ హింద్ ఖమ్మం పట్టణ శాఖ ఆధ్వర్యంలో రంజాన్‌ పండుగను పురస్కరించుకొని షాదీఖానా నందు జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ ఇల్యాస్ అధ్యక్షతన జరిగిన ఈద్‌ మిలాప్‌ (పండుగ పరస్పర కలయిక) కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని తాతా మధుసూదన్ మాట్లాడుతు సర్వ మతాలకు పుట్టినిల్లుగా భారతదేశం కొనసాగుతుందని, కొన్ని దుష్ట శక్తులు వర్గాల పేరుతో విభజించి పాలించి, రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని ప్రతి భారతీయుడికి రాజ్యాంగబద్ధంగా ఈ దేశంలో స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని, మతం అనేది ఎవరికి వారికే వ్యక్తిగతమని మత కలోహాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న వ్యక్తులతో దేశానికి పెను ప్రమాదం ఉందని ప్రజలంతా చైతన్యవంతంగా మెలగాలని వారు తెలిపారు.

ఖమ్మం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా జమాతే ఇస్లామ్ హింద్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను వారు కొనియాడారు. అనంతరం విశిష్ట అతిథిగా పాల్గొన్నమహ్మద్ సాదిఖ్ అహ్మద్ జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతు దివ్యఖుర్ఆన్ బోదనలు మానవాళికి మార్గదర్శకమన్నారు. ముస్లింలు పాటించే ఉపవాసాలు ఉన్నత వ్యక్తిత్వాన్ని ఆలవర్చేందుకు దోహద పడతాయన్నారు. మనిషి మంచి బుద్ధితో మెలగాలని, చెడు పనులకు దూరంగా ఉండాలన్నారు. యవత వ్యబిచారం, మధ్యపానం సేవనం తదతర అన్ని రకాల చెడు అలవాట్లు , దుర్వసనాలకు దూరంగా ఉండాలని ఖుర్ఆన్ ద్వారా భగవంతుడు సెలవిచ్చారన్నారు. అప్పుడే మన దేశం ఉజ్వల భారత దేశంగా మారుతుందన్నారు. అనంతరం ఎర్ర శ్రీకాంత్ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, పోటు ప్రసాద రావు జిల్లా కార్యదర్శి సి.పి.ఐ. గోకినపల్లి వెంకటేశ్వర్లు జిల్లా కార్యదర్శి సి.పి.ఐ.ఎం.ఎల్, లక్కినేని సుదీర్ వై ఎస్ ఆర్ సి పి జిల్లా అధ్యక్షులు, ఎస్.డి.ఎం.హుస్సేన్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ నాయకులు, పులిపాటి ప్రసాద్ జిల్లా అధ్యక్షులు పౌరసమితి, తదితరులు ప్రసంగించారు.

also read :-వరంగల్ కు తరలివచ్చిన పార్టీశ్రేణులకు ధన్యవాదాలు :రాయల

also read ;-మమ్మి అధ్యక్షురాలు .డమ్మీ రాహుల్ గాంధీ: మంత్రి కేటీఆర్

చివరిగా సభాధ్యక్షులు మహ్మద్ ఇల్యాస్ మాట్లాడుతు మానవులందరికి దేవుడు ఒక్కడేనని, అన్ని మతాలు మంచినే బోధిస్తాయన్నారు. తమ మతాలను అనుసరిస్తూ ఇతర మతాల వారిని గౌరవిస్తూ జీవిస్తే సమాజంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరుస్తాయని పేర్కోన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఉల్ హఖ్, మాజీ కౌన్సిలర్ షౌకత్ అలీ, సుడా డైరెక్టర్ ముక్తార్ జమాతే ఇస్లామీ హింద్ అర్బన్ జిల్లా అధ్యక్షులు అబ్రార్ అలీ .రూరల్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ ముజీబ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు జైనుల్ పాషా, ఖిల్లా డివిజన్ అధ్యక్షులు ఖలీల్ అహ్మద్ ఖాన్, , ఇందిరా నగర్ డివిజన్ అధ్యక్షులు జమిల్ అహ్మద్ ఖాన్,ఇస్లాం పేట డివిజన్ అధ్యక్షులు అబ్దుస్ సుబూర్ యమ్. పి.జె జిల్లా అధ్యక్షులు షక్ ఖాసిం జమాత్ కార్యకర్తలు, జాఫర్ మతిన్, అబ్దుల్ రజాక్ ,అబ్దుల్ మలిక్, నెహల్ అహ్మద్, గౌస్, నాసర్, హకీమ్ ఎస్ ఐ ఓ జిల్లా అధ్యక్షులు అతీక్ అహ్మద్ ఖాన్ పట్టణ అధ్యక్షులు తౌసిఫ్ అహ్మద్ ఖాన్ సభ్యులు అబ్దుల్ అజిజ్, హలీమ్, అమెర్ ఉసామా, మరియు పట్టణ పలువురు ముస్లిం మరియు ముస్లిమేతర సోదరులు పాల్గొన్నారు.