Telugu News

గాయపడ్డ మల్సూర్ ప్రాణాలను కాపాడిన కూసుమంచి ఎస్సై

సమయానికి పోలీస్ కార్ ఇచ్చి ప్రాణాల నిలబెట్టిన ఎస్సై

0

గాయపడ్డ మల్సూర్ ప్రాణాలను కాపాడిన కూసుమంచి ఎస్సై

== పోలీస్ కారులో ఆసుపత్రికి తరలింపు

== మరో ఐదు నిమిషాలు ఆలస్యం అయితే ప్రాణాలు పోయేవి అని చెప్పిన వైద్యులు

== సమయానికి పోలీస్ కార్ ఇచ్చి ప్రాణాల నిలబెట్టిన ఎస్సై

(కూసుమంచి-విజయంన్యూస్)

కూసుమంచి మండలంలో విషాదం నెలకొంది.. మోటర్ సైకిల్ పై వెళ్తున్న వారు రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఒకరు చనిపోయారు. మరోకరికి తీవ్రగాయాలు కాగా కూసుమంచి ఎస్ఐ రమేష్ కుమార్ మానవత్వం చాటుకున్నారు. అతని ప్రాణాలు కాపాడి అందరితో షెబాస్ అనిపించుకున్నారు.  పూర్తి వివరాల్లోి వెళ్తే కూసుమంచి మండలంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన  ఇద్దరు తమ మోటర్ సైకిల్ పై మోటాపురం వైపు వెళ్తున్నారు. దీంతో మార్గం మద్యలోని మల్లేపల్లి గ్రామ సమీపంలో  ప్రమాదవశాత్తు బైక్ పై నుండి పడిపోయి ఓ వ్యక్తి మృతి చెందగా, మల్సూర్ కు తీవ్ర గాయాలై పడిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న ఎస్సై రమేష్ కుమార్ సంఘటన ప్రదేశానికి వెళ్లి తీవ్ర గాయాలైన మల్సూరును 108 కోసం ఎదురు చూడకుండా తన  కారులో  ఎక్కించుకుని ఖమ్మంప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో వైద్యులు మరో ఐదు నిమిషాలు ఆలస్యం అయితే యువకుడు ప్రాణాలు పోయేవని అన్నారు. ఓ‌ నిండు ప్రాణాన్ని కాపాడిన కూసుమంచి ఎస్ఐ రమేష్ కుమార్ ను మండల వాసులు అభినందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: నువ్వా..నేనా..? కొత్తగూడెం ఎమ్మెల్యే ఎవరు..?