ఐటీసీ లో ఆక్సిజన్ బాట్లింగ్ ప్లాంట్ ప్రారంభించిన కలెక్టర్ అనుదీప్
?ఐటీసీ యాజమాన్యాన్నికి అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్
ఐటీసీ లో ఆక్సిజన్ బాట్లింగ్ ప్లాంట్ ప్రారంభించిన కలెక్టర్ అనుదీప్
?ఐటీసీ యాజమాన్యాన్నికి అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్
?రూ.2కోట్ల 60 లక్షల సీయస్ఆర్ నిధులతో ప్లాంట్ ఏర్పాటు
(బూర్గంపహాడ్ -విజయం న్యూస్ )
ౠర్గంపాడ్ మండలం సారపాకలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐటీసీ పిఎస్పిడి కాగితం కర్మాగారంలో ఐటీసి నుండి రూ.2కోట్ల 20 లక్షలు, నవభారత్ వెంచర్ లిమిటెడ్ పాల్వంచ నుండి రూ.40 లక్షల సీయస్ఆర్ నిధుల నుండి ఆక్సిజన్ బాట్లింగ్ ప్లాంటు ను మంగళవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ప్రారంభించారు.
also read;-బిజెపి ప్రభుత్వానికి పతనం తప్పదు
అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఆక్సిజన్ బాట్లింగ్ ప్లాంటు మన జిల్లా లో ఏర్పాటు చేయడం సంతోషదాయకమని, గతంలో కరోన సెకండ్ వేవ్ లో కూడ ఐటీసీ ఆధ్వర్యంలో రోజుకు 6 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందించిందని,దానికి తోడుగా నేరుగా ఆక్సిజన్ బాట్లింగ్ ప్లాంట్ ఉండాలన్న ఉదేశ్యం తో సీయస్ఆర్ నిధుల నుండి ఐటీసీ పిఎస్పిడి పాల్వంచ నవభారత్ వెంచర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ద్వారా ఇటలీ నుండి కంప్రెసర్ సిస్టమ్ తీసుకవచ్చి వాల్ పుటింగ్ బేసిస్ ద్వారా ఇక్కడ ఆక్సిజన్ తయారు చేసి వాల్ పుటింగ్ ద్వారా బాటిల్స్ లో నింపే విధంగా సాంకేతికతను జోడించి త్వరితగతిన అందించేందుకు ఈ పరిశ్రమ చేస్తున్న కృషి గొప్పదని,దీని ద్వారా మనం రోజుకు 200సిలిండర్లు నింపుకొని సామర్థ్యం,
also read ;-పార్వతమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి పువ్వాడ..
స్థోమత మన జిల్లా కు ఉండటం భవిష్యత్తులో కోవిడ్ ఎదుర్కొంనేందుకు ఆక్సిజన్ కొరత లేకుండా సిధ్ధంగా ఉన్నామని ఒక జిల్లా కలెక్టర్ గా సంతోషంగా ఉందని, ఈ ప్లాంటు ఏర్పాటు కు క్రుషి చేసిన ఐటీసీ పీయస్పీడి యూనిట్ హెడ్ సిధ్ధార్ధ మహంతి, డీజీయం హెచ్ఆర్ శ్యామ్ కిరణ్ కు,అధికారి చెంగళ్రావు కు, నవభారత్ వెంచర్ లిమిటెడ్ వైస్ ప్రసిడెంట్ శ్రీనివాసమూర్తి ని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ సీతారాంనాయక్, బూర్గంపాడు తహశీల్దార్ భగవాన్ రెడ్డి,ఆర్ఐ అక్బర్ బాబ, ఐటీసీ ఉన్నతాధికారులు, ఐటీసీ పిఎస్పిడి టిఎన్టియుసి అధ్యక్షుడు కనకమేడల హరిప్రసాద్, గల్లా నాగభూషయ్య, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు శంకర్ రెడ్డి,ఐటీసీ రక్షణ అధికారి మణీశర్మ తో పాటు కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు.