Telugu News

బొల్తా పడిన బస్సు.. 8మంది మృతి

ఇప్పటి వరకు 8మంది ప్రయాణికులు మృతి...

0

అశ్వారావుపేట విజయం న్యూస్

అశ్వారావుపేట నుండి జంగారెడ్డిగూడెం వైపు వెళ్లతున్న బస్సు అదుపు తప్పి జల్లేరు బ్రిడ్జ్ మీదనుండి వాగులో పడింది.వార్త రాసే సమయానికి తొమ్మిది మ్రుతి చెందినట్లు సమాచారం మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.మ్రుతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.నిన్న రాత్రి జంగారెడ్డిగూడెం నుండి  పశ్చిమ గోదావరి వేలేరుపాడు వచ్చిరాత్రి వేలేరుపాడు నైట్ ఆల్ట్ ఉండి అక్కడ నుండి ఉదయం భద్రాచలం వెళ్లి మరల కుక్కునూరు మీదుగా అశ్వరావుపేట నుండి జంగారెడ్డిగూడెం వరకు బస్సు గమ్యం పూర్తి అవుతుంది…. ఈ క్రమంలో జల్లేరు వాగు వద్ద అదుపు తప్పి జారీ పడిన బస్సు ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 40 మంది కి పైగా నే ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 9 మంది మరణించగా మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మ్రుతులను వెలికి తీస్తున్నారు. ఆ ప్రాంతం అంతా అర్తనాదాలతో ఉంది