జైనూర్ దవాఖానా సందర్శించిన మంత్రి హరీష్ రావు.
-బైకార్యాలితో ఘన స్వాగతం.
-మంత్రికు వినతుల వెల్లువ.
( జైనూర్ విజయం న్యూస్) :-
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రినీ రాష్ట్ర ఆర్థిక , వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీషావు శుక్రవారం అటవి పర్యవరణశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి సందర్శించారు . మండలానికి వచ్చిన మంత్రులను మండల టీఆర్ఎస్ నాయకులు పోచ్చంలోద్ది గ్రామం నుండి మండల కేంద్రం వరకు భారీ బైక్ ర్యాలితో ఘన స్వాగతం పలికారు . ఆసుపత్రి చేరుకున్న మంత్రి హరీష్ రావు రోగులతో ముచ్చటిస్తు ఆసుపత్రిలో అందుతున్న వైద్యసేవలపై అడిగి తెలుసుకున్నారు .
also read :-పుతిన్‌కు మరో షాక్… ఉక్రెయిన్‌లోని రష్యన్ల ఆస్తుల సీజ్
ఆసుపత్రిలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకుని వసతులను పరిశీలించారు . అనంతరం సన్ రైజ్ ఫౌండేషన్ సభ్యులు జైనూర్ ఉర్దుపాఠశాలను ఉన్నతి కరించాలని , విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని , గిరిజనేతర రైతులకు సైతం రైతుబందు అందేలా చూడాలని కోరారు . దళిత సంఘం నాయకులు దళిత బందువు ఏజేన్సీ దళితులకు అందేలా చూడాలని , గిరిజనేతర రైతుల సమస్యలు పరిష్కరించాలని వినతి అందించారు . ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎంలు తమకు వేతనాలు పెంచి సమస్యలు పరిష్కరించాలని విన్నవించుకున్నారు .
also read :-మంత్రి పువ్వాడ చే టీఎస్ మేసా క్యాలెండర్ ఆవిష్కరణ.
గిరిజన సంఘాల నాయకులు ఆదివాసుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు . మండల పాత్రికేయులకు జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేసి , హెల్త్ కార్డు అందేలా చూడాలని పాత్రికేయులు మంత్రికు వినతిపత్రం అందజేశారు . ఈ సందర్భంలో మంత్రి అల్లో ఇంద్రకరణ్ రెడ్డి , జెడ్పీచైర్మన్ కోవలక్ష్మీ , ఎమ్మెల్యే ఆత్రం సక్కు , జిల్లా అడిష్నల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి , రాష్ట్ర హజ్ కమిటి సభ్యుడు ఇంతయాజాల , జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్వు , ఎంపీపీలు కుమ్ర తిరుమల , ఆడె సవిత ప్రెన్దాస్ , తోడసం భాగ్యలక్ష్మీ , వైస్ఎంపీపీలు చిర్లెలక్ష్మణ్ , ఆత్మరాం , ప్రకాష్ , మండల కోఆప్షన్ సభ్యులు ఫెరోజాఖాన్ , సలీం , సహకార సంఘం చైర్మన్ కోడప హన్నుపటేల్ , శివాజి , నాయకులు మెస్రం అంబాజిరావు , టీఆర్ఎస్ మండల అధ్యాక్షులు ఆత్రం అనిల్ , తోడసం ధర్మరావు , సన్రైజ్ ఫౌండేషన్ ఉమ్మడి జిల్లా అధ్యాక్షుడు షేక్ జమీల్ , డివిజన్ అధ్యక్షుడు ముజాహిద్ , సర్పంచులు పార్వతి లక్ష్మణ్ , కనక ప్రతిభ , గోవిందావు , భీంరావు , శ్యాంరావు , నాయకులు షేక్ అబ్బు , మన్నాన్ , ముజాహిద్ , మోయిన్ , తదితరులున్నారు.