Telugu News

జలగం దారేటు..?

బీజేపీ  నేతల చూపు.. జలగం వైపు..?

0

జలగం దారేటు..?

== బీజేపీ  నేతల చూపు.. జలగం వైపు ..?

== టచ్ లోకి వెళ్తున్న కేంద్ర,రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు

== ఆపర్లను ప్రకటించిన బీజేపీ

== కాంగ్రెస్ కు వెళ్లాలని కార్యకర్తల ఒత్తిడి

== ఆలోచనలో పడిన జలగం వెంకట్రావ్

== రెండు రోజుల్లో కార్యాచరణ

మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారా..? బీజేపీ కేంద్ర నాయకత్వం జలగంతో చర్చలు జరుపుతున్నారా..? రాష్ట్ర పార్టీ అధ్యక్షుడితో సహా పలువురు నేతలు జలగంతో టచ్ లోకి వెళ్ళారా..? కొత్తగూడెం టిక్కెట్ ఇస్తామని అఫర్ ఇచ్చారా..? అందుకే కోనేరు చిన్ని పార్టీ నుంచి  బయటకు వెళ్లిపోయారా..? ఆయన బీఆర్ఎస్ గూటిలో చేరుతున్నారా..? కొత్తగూడెంలో ఏం జరుగుతోంది..? రాజకీయం ఎటువైపు టర్న్ తిరుగుతోంది..? కాంగ్రెస్ అశించిందే జరుగుతుందా..? బీజేపీ పాగా వేస్తుందా..? బీఆర్ఎస్ దూకుడు పెంచుతుందా..?

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది.. బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ల లొల్లి పెరుగుతున్న కొద్ది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.. కొత్తగూడెం టిక్కెట్ వనమా వెంకటేశ్వరరావుకు బీఆర్ఎస్ కేటాయించడంతో అక్కడ రాజకీయం మరింత రంజుకుంది.. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నేత జలగం వెంకట్రావ్ చుట్టూ రాజకీయం తిరుగుతోంది.. ఆయనకు టిక్కెట్ రాకపోవడంతో ఆయన వర్గీయులు అసమ్మత్తిని వ్యక్తం చేశారు. కొత్తగూడెం టిక్కెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు కేటాయించడంతో జలగం అసంత్రుప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆయన వర్గీయులు మండిపడుతున్నారు. వయస్సులో సీనియర్ అయి నడవలేని పరిస్థితుల్లో ఉన్న వనమా, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాఘవేంద్రలను మరింత దోచుకోమ్మని బీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చినట్లుగా ఉందని మండిపడుతున్నారు. పార్టీ కోసం కష్టపడి గెలిపించి, పార్టీకి అండగా ఉంటూ వస్తున్న జలగం వెంకట్రావ్ కు టిక్కెట్ కేటాయించకపోవడంపై  సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా వనమాకు సపోర్టు చేసేది లేదని, పార్టీని వీడుతున్నామని ప్రకటించగా, జలగం వెంకట్రావ్ మాత్రం చాలా మౌనంగా ఉన్నారు. ఆయన హైదరాబాద్ లో  ఉండగా, ఆయన అనుచరులు మాత్రం తాడోపేడో తెల్చుకుంటామని చెబుతున్నారు.

== జలగం వైపు బీజేపీ చూపు..?                                     allso read- బీఆర్ఎస్ కు తుమ్మల గుడ్ బై..?

బీజేపీ పార్టీ అకర్ష్ ప్రదర్శిస్తోంది.. టిక్కెట్లు రానీ వారిని, అసంత్రుప్తులను తమ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నాల్లో నిమగ్నమైంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ టిక్కెట్ దక్కకపోవడంతో అసంత్రుప్తిగా ఉన్న కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ ను బీజేపీలో చేర్చుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే జలగం వెంకట్రావ్ కు టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయి నాయకులతో పాటు ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటెల రాజేందర్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి జలగం వెంకట్రావ్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి బీజేపీ సీటును కేటాయించి, ఉమ్మడి జిల్లా బాధ్యతలను అప్పగిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రభుత్వం వస్తే కచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా పది నియోజకవర్గాల్లో మరో రెండు స్థానాలను అప్పగిస్తామని, మీకు నచ్చిన వారికి ఇచ్చుకునే అవకాశం ఉంటుందన్నారు. దీంతో జలగం వెంకట్రావ్ మెత్తబడినట్లుగా తెలుస్తోంది. కొత్తగూడెం వచ్చి కార్యకర్తలతో మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకుంటానని హామినిచ్చినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వచ్చి  కార్యకర్తలతో మాట్లాడే అవకాశం ఉంది. అయితే కార్యకర్తల నిర్ణయమే పైనల్ అన్నట్లుగా తెలుస్తోంది..

== జలగం వెంకట్రావ్ ను సంప్రదిస్తున్న కాంగ్రెస్

మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ ను కాంగ్రెస్ పార్టీ సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. టిక్కెట్ విషయంలో స్పష్టత లేకపోయినప్పటికి పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ద్వారా సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.. కొత్తగూడెం టిక్కెట్ ఇస్తే పార్టీలోకి వస్తానని  చెప్పినట్లుగా విశ్వసనీయ సమాచారం. అయితే కొత్తగూడెం టిక్కెట్ ను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడుగుతున్న నేపథ్యంలో ఆయనతో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో చర్చించిన తరువాత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

allso read- మట్టాదయానంద్ కు  బిగ్ షాక్

అయితే కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జలగం వెంకట్రావ్ ను తీసుకొని కొత్తగూడెంకు జలగం, ఖమ్మంకు పొంగులేటి, పాలేరుకు తుమ్మలను పోటీ చేయిస్తే 10కి పది స్థానాలు గెలవడం ఖాయమని అంటున్నారు. దీంతో జలగం ఆలోచనలో పడ్డారంటా..? ఒక వైపు కార్యకర్తలు, అభిమానులు జలగం ను కాంగ్రెస్ వైపు వెళ్లాలని ఒత్తిడి తీసుకోస్తుండగా, మరో వైపు బీజేపీ అఫర్ల మీద ఆపర్లు ఇస్తుండటంతో జలగం కొంత ఆలోచనలో పడ్డారు. రెండు రోజుల్లో ఆయన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. ఇదిలా ఉంటే జలగంకు టిక్కెట్ కన్ఫామ్ అయ్యిందని సోషల్ మీడియాలో ఓ ప్రచారం చెక్కర్లు కొట్టడంతో తొందరపడిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని ఆ పార్టీకి రాజీనామా చేశాడు. అంతేకాదు బీజేపీ పార్టీ కూడా కొనేరు చిన్నిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో కొత్తగూడెం జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది..