జాలుముడి కాలువను పరిశీలించిన సీఎల్పీ నేత భట్టి
== త్వరగా పిచ్చిమొక్కలను తొలగించాలని అధికారులకు సూచన
(మధిర-విజయంన్యూస్)
మధిర మండలంలోని జాలముడి కాలువను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శనివారం స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. జాలముడి కాలువ వెంబడి పిచ్చి మొక్కలు పెరగడంతో దిగివనున్న రైతుల పొలాలకు సాగునీరు సక్రమంగా పారడం లేదని బాధిత రైతులు సీఎల్పీ నేత భట్టి దృష్టికి తీసుకువచ్చారు రైతుల సమస్యపై వెంటనే స్పందించిన ఆయన అక్కడికి వెళ్లి కాలువ పనితీరును పరిశీలించారు. ఇరిగేషన్ డిఈ ని పిలిపించుకొని కాలువ వెంబడి పేరుకుపోయిన పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. కాలువ నీరు చివరి ఎకరానికి సైతం పారే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట మండల ప్రెసిడెంట్ కిషోర్ పారుపల్లి విజయ్ యూత్ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి సర్పంచ్ మదర్ వంశి శ్రీనివాస్ కర్నాటి రామారావు కొంతమంది రైతులు పాల్గొన్నారు
allso read- ఖమ్మంరూరల్ సీఐ నీ తోలు తీస్తాం: కూనంనేని