Telugu News

జమాలపురం లో వెంకన్నను దర్శించుకున్న ఎంపీలు

  ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, 

0
జమాలపురం లో వెంకన్నను దర్శించుకున్న ఎంపీలు
==  ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, 
ఎర్రుపాలెం/ఖమ్మంప్రతినిధి, జూన్ 26(విజయంన్యూస్)
ఎర్రుపాలెం మండల పర్యటన లో భాగంగా తెరాస లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, తెరాస జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు జమాలపురం లో శ్రీ వేంకటేశ్వరస్వామి  ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ప్రజాప్రతినిధులకు ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో తుళ్ళూరి కోటేశ్వరరావు, చావా రామకృష్ణ, పంబి సాంబశివరావు, గ్రామ సర్పంచ్ మూల్పూరి స్వప్న, ఎంపీటీసీ మూల్పూరి శైలజ, ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత, డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వర రెడ్డి, సొసైటీ చైర్మన్ మూల్పూరి శ్రీనివాసరావు, ఆలయ ఈఓ, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.