Telugu News

జమిలి ఎన్నికలు సాధ్యమేనా..?

మిని ‘జమిలి’కి  పై కేంద్రం ప్లాన్

0

జమిలి ఎన్నికలు సాధ్యమేనా..?

== మిని ‘జమిలి’కి  పై కేంద్రం ప్లాన్..?

== 11 రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలకు ఏర్పాట్లు

== జమిలి ఎన్నిక కష్టమంటున్న రాజకీయ విశ్లేషకులు

(పొలిటికల్ ఎనాలిసిస్ విత్  పెండ్ర అంజయ్య)

భారతదేశంలో జమిలి ఎన్నికల నిర్వాహాణ సాధ్యమేనా..? వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అనే నినాదం బాగానే ఉన్నప్పటికి అది అచరణలో సాధ్యమవుతుందా..? అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తాయా..? అసలు చట్టం ఏం చేబుతున్నది..? పార్లమెంట్, రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉందా..? అధికార పార్టీకి బలమేంతా..? బిల్లు పాస్ అవ్వాలంటే బలమెంతా ఉండాలి..? రాజ్యసభలో బిల్ పాసవుతుందా..? కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నేరవెరతుందా..? జమిలి ఎన్నికలపై ‘పెండ్ర అంజయ్య’ అందించే అద్భుత పొలిటికల్ ఎనాలసిస్ కథనం మీకోసం..

ఇది కూడా చదవండి: పాలేరు కు మరో రైల్వేలైన్

ఒక వైపు ఐదు రాష్ట్రాలకు ఎన్నికల సమయం దగ్గరపడుతుండటం, జనవరి 2024లోపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయం రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం సమయంలోపే ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తుండగా, మరో వైపు  కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్రంతో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాలకు ఈ ఏడాది ఎన్నికలు జరుగుతాయా..? లేదంటే మరో ఆరు నెలల పాటు వాయిదా పడే అవకాశం ఉందా..? అనేది ప్రజల్లో మేదులుతున్న సందేహం. ఇప్పటికే జమిలి ఎన్నికలకు వెళ్లేందుకే కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికను సిద్దం చేసింది. అందు కోసం ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. జమిలి ఎన్నికల బిల్లుతో పాటు పలు బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టి బిల్లులను పాస్ చేయించుకోవాలని కేంద్రప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.. అందుకు గాను ఇప్పటికే కేంద్రప్రభుత్వం జమిలి ఎన్నికలపై ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. పలు రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోవాలని ఆ కమిటీ భావిస్తోంది..

== జమిలి ఎన్నికలు ఇప్పుడు సాధ్యమేనా..?         

 

ఇది కూడా చదవండి:  తైతక్కలు ఆడితే ప్రజలు నమ్ముతారా..?: మంత్రి

కేంద్రప్రభుత్వం జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు దూకుడు పెంచింది. ఆ మేరకు కావాల్సిన చర్యలు చేపట్టింది.. అయితే జమిలి ఎన్నికలు ఇప్పుడు నిర్వహించడం సాధ్యమేనా..? అనే ప్రశ్నలు, సందేహాలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నా.. వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనే నినాదంతో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను ఒకే సారి నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలు ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చింది. అయితే   భారత దేశంలో వివిధ రాష్ట్రాల్లో పలు దఫాలుగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.  భారతదేశంలో ఇప్పటి వరకు మొత్తం 31 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా,  2023 నవంబర్ లో చత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, మీజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాల్సి ఉంది.. అలాగే 2023 డిసెంబర్ లో రాజస్తాన్, తెలంగాణ, 2024 ఏప్రిల్ మాసంలో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఓడిసా రాష్ట్రాల్లో, 2024 అక్టోబర్ లో హార్యాన, మహారాష్ట్ర, 2024 నవంబర్ లో జార్ఖాండ్, 2025 పిబ్రవరిలో ఢిల్లీ, అక్టోబర్ లో బీహార్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే  ఒక ఏడాది సమయంలో 14 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పటికే ఇన్నికలు జరిగిపోయాయి. కొన్ని రాష్ట్రాలకు మూడేళ్ల సమయం ఉండగా, కొన్ని రాష్ట్రాలకు నాలుగేళ్ల సమయం ఉంది. ఈ క్రమంలో ఆ రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించడానికి ఆ ప్రభుత్వాలు ఒప్పుకునే అవకాశం లేదు. గత కొద్ది నెలల క్రితమే త్రిపురా, మేఘాలయ, నాగాలాండ్,  కర్నాటక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు మళ్లీ ఎన్నికలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునే అవకాశం లేదు. అక్కడ ప్రజలు కూడా వ్యతిరేకించడం ఖాయం. అంతే కాకుండా 2023 సంవత్సరంలో జరగాల్సిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను మరో ఆరు నెలల పాటు పొడగించాల్సి ఉంటుంది.. అదే జరిగితే రాష్ట్రపతిపాలన ఖాయం.

ఇది కూడా చదవండి: జలగం దారేటు..?

దానికి తెలంగాణ తో పాటు చత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, మీజోరం, రాజస్తాన్ రాష్ట్రాలు అంకగీరంచే అవకాశం లేదు. దాంతో పాటు ఢిల్లీ, బీహార్ రాష్ట్రాలకు ఇంకా రెండేళ్ల పాటు పరిపాలించే అవకాశం ఉంది.. వాళ్లు ఏడాదిన్నర పాటు ముందస్తు ఎన్నికలకు రావాల్సి ఉంటుంది.. దానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించే అవకాశం లేదు. అంతే కాకుండా జమిలి ఎన్నికలకు సంబంధించి లోక్ సభ, రాజ్యసభలో బిల్లు ప్రవేశపెడితే అక్కడ 60శాతం మెజారిటీ చూపించాల్సి ఉంది. కానీ  కేంద్రానికి పార్లమెంట్ లో 61శాతం బలంగా ఉండగా, రాజ్యసభలో 31 శాతం మాత్రమే బలం ఉంది. కొన్ని పార్టీలు మద్దతును ఇవ్వడం వల్ల 52శాతం బలం ఉంటుంది. అందువల్ల పార్లమెంటు లో బిల్ పాస్ అయినపప్పటికి రాజ్యసభ లో పాస్ అయ్యే అవకాశం లేదు. అందుకే కచ్చితంగా జమిలి ఎన్నికలు జరిగే అవకాశాలు లేనట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

== మిని జమిలి జరగనుందా..?

భారతదేశంలో వన్ నేషన్, వన్ ఎలక్షన్  పేరుతో జమిలి ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్న కేంద్రప్రభుత్వానికి లీగల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అనేక సవరణలు చేయాల్సి ఉంటుంది. అందుకే కేంద్రప్రభుత్వం రూట్ మార్చే అవకాశం కనిపిస్తోంది. సుమారు 11 రాష్ట్రాలను కలుపుకుని ‘మిని జమిలి’ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.. 2023 నవంబర్, డిసెంబర్ లో జరిగే ఐదు రాష్ట్రాలతో పాటు 2024లోని ఏప్రిల్ జరిగే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఓడిసా రాష్ట్రాల్లో, 2024 అక్టోబర్ లో హార్యాన, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఒకే సారి జమిలి ఎన్నికలను నిర్వహించాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాని ద్వారా ప్రజల్లో వ్యతిరేకత, ప్రభుత్వాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండదని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.. అయితే మిని జమిలి ఎన్నికలకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకరించే అవకాశాలున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే 2023 డిసెంబర్ లో జరిగే ఐదు రాష్ట్రాల్లో రాజస్తాన్, చత్తీస్ గడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మరో ఆరు నెలల పెరగడం వల్ల ఎన్నికలకు కొంత సమయం ఉండే అవకాశం ఉంది.. తద్వారా ఈ ప్రభుత్వాలు కూడా అంగీకరించే అవకాశం లేకపోలేదు. ఇదే అసరగా చేసుకుని కేంద్రప్రభుత్వం మినిజమిలి ఎన్నికలను నిర్వహించేందుకు బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే జమిలి ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వ్యతిరేకించగా, బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ  పార్టీలు తటస్తంగా ఉండిపోయాయి.