కూసుమంచిలో ‘జన’జాతర
== ఘనంగా ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు
== ఉప్పొంగిన అభిమానం.. తరలివచ్చిన జనప్రవాహం
== కోలాట నత్యాలు.. మహిళల డ్యాన్సులు.. లంబాడీ డ్యాన్సులు
== అదిరిపోయిన కూసుమంచి సెంటర్
== కూసుమంచి శివాలయం నుంచి భారీ ర్యాలీ
== కేక్ కట్ చేసిన ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపిన పార్టీ నాయకత్వం
== రక్తదానం చేసిన యువకులు
(కూసుమంచి-విజయంన్యూస్)
తిరుమలాయపాలెంనుంచి తిరునాళ్ల లా వచ్చిన జనం.. కూసుమంచి నుంచి కదం తొక్కిన ప్రజాభిమానం..ఖమ్మం రూరల్ నుంచి జనప్రవాహం.. ‘నేలకొండపల్లి‘ నుండి ఉప్పొంగిన కార్యకర్తల ఉత్సహం.. వేరసి కూసుమంచి మండల కేంద్రంలో జనజాతరను తలపించింది.. వేలాధి మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలిరావడంతో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు తిరునాళ్ల జాతరగా మారిపోయింది..
ఇది కూడా చదవండి: ‘ఖమ్మం’ పై నేతల పోకస్
జనం ప్రవహానికి పాలేరు ఎమ్మెల్యే, ఆయన కుటుంబం సంతోషం పట్టలేకపోయారు. అభిమానులందరికి ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే జనవరి 9న పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు కూసుమంచి మండల కేంద్రంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ముందుగా స్వగ్రామమైన కూసుమంచి మండలం రాజుపేట గ్రామంలో కుటుంబ సభ్యుల నడుమ వేడుకలు జరుపుకున్నారు. ఆయన సతిమణి విజయలక్ష్మి, కుమార్తేలు, అల్లుళ్లు, మనవళ్లు నడుమ కేక్ కట్ చేయగా, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు దేవాలయాల్లో పూజలు చేశారు.
== కూసుమంచి శివాలయం నుంచి ర్యాలీ
కూసుమంచి శివాలయంలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సతీసమేతంగా పూజలు చేశారు. అర్చకుడు శేషగిరి శర్మప్రత్యేకంగా పూజలు చేసి, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కూసుమంచి శివాలయం నుంచి పాలేరు ఎమ్మెల్యే క్యాంఫ్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాధి మంది జనం తరలిరావడంతో కూసుమంచి మండల కేంద్రం మారుమోగింది.
ఇది కూడా చదవండి: పాలేరులో కందాళ గెలుపు ఆపగలరా..?: మంత్రి వేముల
కోలాట బృందాలతో, గిరిజన నృత్యాలతో, మహిళల చప్పట్లతో,కొమ్ము డ్యాన్సులతో, డప్పు వాయిద్యాలతో కూసుమంచి మండల కేంద్రం దద్దరిల్లింది. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని గంటల పాటు కూసుమంచి మండల కేంద్రం గులాబీ మయమైంది. అనంతరం మండల కేంద్రం నుంచి క్యాంఫ్ కార్యలయం వద్దకు వెళ్లిన కందాళ ఉపేందర్ రెడ్డి తన క్యాంఫ్ కార్యాలయంలో అభిమానులు, పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేశారు. కుటుంబ సభ్యులకు తినిపించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కందాళ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వచ్చిన ప్రతి ఒక్కరికి భారీగా భోజన సదుపాయం ఏర్పాటు చేశారు.
== రక్తదానం చేసిన యువకులు
కూసుమంచి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కందాళ యువసైన్యం ఆధ్వర్యంలో పార్టీ యువజన విభాగం ఆధ్వర్యలో రక్తదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, ఆ రక్తదాన శిబిరాన్ని కందాళ ఉపేందర్ రెడ్డి ప్రారంభించారు. యువకులు రక్తం ఇచ్చేందుకు పోటీ పడ్డారు. రక్తదానం చేస్తున్న యువకులందరితో కందాళ మాట్లాడి అభినందనలు తెలిపారు.
== అందర్ని మర్చిపోలేని వేడుక ఇది: కందాళ ఇది కూడా చదవండి: ఫ్లాన్-బీ దిశగా పొంగులేటి
నా జీవితంలో మర్చిపోలేని వేడుకను చేశారు. మీ అందరి రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. పుట్టిన రోజు కేక్ కట్ చేసిన అనంతరం ఆయన అభిమానులను ఉద్దేశించి కొద్ది సేపు మాట్లాడారు. అందరు కలిసి, నా పుట్టిన రోజుని నా పాలేరు నియోజకవర్గ పండగలా చేశారు. ఇది నా జీవితంలో ఒక మరిచిపోలేని పండగగా మార్చారు .. ఈరోజు మీరు నాపై చూపించిన అభిమానం, ప్రేమ.. నన్ను మరింత బాద్యుడుని చేసింది.. ఈ కర్తవ్యాన్ని మరింత శ్రద్ధ తో, పాలేరు ప్రగతి కోసం అనునిత్యం శ్రమిస్తాను అని మీకు మాట ఇస్తున్నానని అన్నారు. మరొక్కసారి,నా పాలేరు ప్రజల అందరికి పేరు పేరున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. మీ ప్రేమ ఇలాగే ఉండాలని కోరారు.