Telugu News

టీడీపీ అభ్యర్థులుగా జనసేన పార్టీ నేతల పోటీ

సైకిల్ గుర్తుపై పోటీ చేయనున్న జనసేన

0

టీడీపీ అభ్యర్థులుగా జనసేన పార్టీ నేతల పోటీ

== సైకిల్ గుర్తుపై పోటీ చేయనున్న జనసేన..?

== ఇప్పటికే పార్టీ నేతలకు సాంకేతం

== గ్లాస్ గుర్తుకు పుల్ స్టాఫ్

(అమరావతి-విజయం న్యూస్)

జనసేన పార్టీ సంచల నిర్ణయం తీసుకుని రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై పోటీ చేయనున్నారు. ఇది వినటానికి ఆశ్చర్యంగా అనిపించిన ఇది వాస్తవమైన మాట.

ఇది కూడా చదవండి:- బీఆర్ఎస్ పార్టీ కి తుమ్మల గుడ్ బై

జనసేన పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించకపోవడం, ఓటు బ్యాంకు తక్కువగా రావటంతో కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి రాష్ట్రస్థాయి జాతీయ స్థాయి గుర్తింపును రద్దు చేయడంతో పాటు ఆ పార్టీకీ కేటాయించిన గ్లాస్ గుర్తును కూడా రద్దు చేయడం జరిగింది. దీంతో జనసేన పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా స్వతంత్ర గుర్తులతోని పోటీ చేయాల్సి ఉంది ఈ క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య నాయకులు సుదీర్ఘంగా చర్చించిన అనంతరం తెలుగుదేశం పార్టీ తో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది.

ఇది కూడా చదవండి:- ప్రసవానికి పోవాలంటే వాగు దాటాల్సిందేనా..?

అందుకు సంబంధించిన సమావేశం అతికొద్ది రోజుల్లో జరగాల్సి ఉండగా ఇంతలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో జైలుకెల్లటం తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడును ములకతైన పవన్ కళ్యాణ్ రాజకీయ విషయాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తుపై జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని అందుకు అవకాశం కల్పించాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని కోరగా ఆయన అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం.

ఇది కూడా చదవండి:- చంద్రబాబు  పై రాజకీయ వేధింపు కేసులు సరికాదు : ఎమ్మెల్యే కందాళ

పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి రాబోయే ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టం చేశారు ఈ మేరకు జనసేన పార్టీ అభ్యర్థులు రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్రం రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు ఈ మేరకు ఒక లేఖను కూడా విడుదల చేశారు దీంతో జనసేన పార్టీకి కేటాయించిన గ్లాస్ గుర్తు రాబోయే ఎన్నికల్లో కనిపించినట్లే.