Telugu News

జీవో 317ను రద్దు చేయాలి

== ఆ జీవో ఉద్యోగుల కుటుంబాలను చిన్నాబిన్నం చేస్తోంది

0

జీవో 317ను రద్దు చేయాలి
== ఆ జీవో ఉద్యోగుల కుటుంబాలను చిన్నాబిన్నం చేస్తోంది
== ప్రభుత్వం ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది
== ఉద్యోగుల పక్షాన పోరాడతాం
== విలేకర్ల సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్):-
జీవో 317 ఉద్యోగుల పాలిట శాపంగా మారిందని, ఉద్యోగులందరు భయబ్రాంతులకు గురవుతున్నారని, అందుకే ఆ జీవోను తక్షణమే రద్దు చేసి ప్రణాళిక ప్రకారం ఉద్యోగ బదిలీలు చేయాలని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం నగరంలోని సీఎల్పీ క్యాంఫ్ కార్యాలయం ప్రజాభవన్ లో ఎస్ టీఎఫ్ సంఘం నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశాంతవాతావరణంలో ఉద్యోగులు తమ విధులను నిర్వహించుకుంటుంటే, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా, వారు ఎక్కడ ప్రభుత్వంపై తిరగబడతారేమోననే భయాందోళనలో పడిన తెలంగాణ ప్రభుత్వం కొత్తగా జోన్ ల వ్యవస్థను తీసుకొచ్చిందని ఆరోపించారు.

also read :-రేప‌టి నుంచి 15-18 ఏండ్ల‌ పిల్ల‌ల‌కు వ్యాక్సినేష‌న్ షురూ…

ఆ జోన్ వ్యవస్థను కూడా ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటూ జీవో నెంబర్ 317ను తీసుకొచ్చి ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం హాయంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తమైందని, సంక్షోభంలో పడిపోయిందని ఆరోపించారు. విద్యార్థుల సంఖ్య ఎప్పుడు లేని విధంగా పెరిగిపోయినప్పటికి, అందుకు సరిపడ ఉపాధ్యాయులు లేక తీవ్ర పనిభారంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కొరతతో మళ్లీ గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలపై నియంత్రణ లేదని, ప్రభుత్వ పాఠశాలలో సరైన సౌకర్యాలు, సరిఫడ ఉపాధ్యాయులు లేరని ఆరోపించారు.

అలాగే ప్రభుత్వ ఉద్యోగులు అన్ని శాఖల్లో కూడా పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం వచ్చిన 8ఏళ్ల కాలంలో వేయ్యి పోస్టులు భర్తి చేసిన పరిస్థితి లేదన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్, ఊరుకో ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్థితిల్లో లేడని ఆరోపించారు. అంతే కాకుండా ఇప్పడు 317 జీవో పట్టుకొచ్చి ఉద్యోగులందర్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. 317 జీవో ఉద్యోగుల పాలిట శాపంగా మారిందని, స్థానికతను పరిగణించకుండా ఉద్యోగుల కుటుంబాలను చిన్నాబిన్నం చేస్తున్నారని ఆరోపించారు. స్వరాష్ర్టంలోని ఉద్యోగులను స్థానికేతరులుగా మార్చారని, వేలాధి కుటుంబాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోంటున్నారని అన్నారు. ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను పరిగణంలోకి తీసుకోకుండా ఏకపక్షం నిర్ణయాలతో తెచ్చిన ఉత్తర్హులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె చేసిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బహుమతి జీవో 317 అని తెలిపారు.

also read :-ఐటీ హబ్ దేశానికే అదర్శం

ఈ జీవోను రద్దు చేయకపోతే ఉద్యోగసంఘాల తరుపునా, ఉపాధ్యాయ సంఘాల తరుపున కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోట్లాడుతుందని, అసెంబ్లీలో కూడా ఈ విషయంపై పోరాటం చేస్తామని, జీవో రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నగర కమిటీ అధ్యక్షుడు ఎండి.జావిద్, జిల్లా నాయకులు రాయల నాగేశ్వరరావు, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు డి.సౌజన్య, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్, ఎస్ టీఎఫ్ రాష్ర్ట్ ప్రధాన కార్యదర్శి దేవరకొండ సైదులు, జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి, జిల్లా ఉపాధ్యక్షులు పోశగాని వెంకన్న, ఎస్.కె. మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.