Telugu News

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో నెంబర్ 714 వెంటనే రద్దు చేయాలి…!

ఆటో డ్రైవర్స్ యూనియన్ మహబూబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రవాణా బంద్..!

0

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో నెంబర్ 714 వెంటనే రద్దు చేయాలి…!

—ఆటో డ్రైవర్స్ యూనియన్ మహబూబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రవాణా బంద్..!

(మహబూబాబాద్- విజయం న్యూస్)

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ టౌన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రవాణా బంద్ కార్యక్రమం తెలంగాణ అమరవీరుల స్థూపం మరియు మదర్ తెరిసా సెంటర్లో ధర్నాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు నలమాస సాయి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో నెంబర్ 714 వెంటనే రద్దు చేయాలని కేంద్రం తీసుకొచ్చిన రోడ్డు భద్రత చట్టాన్ని సాగుగా చూపించి వాహనాల ఫిట్నెస్ ఆలస్యమైతే రోజుకి 50 రూపాయలు ఫైన్ విధించడానికి వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలో నిరసనలు ధర్నాలు రవాణా బంద్ లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు.

also read;-జిల్లా గిరిజన వెల్ఫేర్ శాఖ – ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న అవినీతి అక్రమల పై సమగ్ర విచారణ జరపాలి…!

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన లైఫ్ టాక్స్ తగ్గించాలని రోజురోజుకు పెరుగుతున్న డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు రోజురోజుకు ఫైనాన్స్ సమస్యల వల్ల ఆటో డ్రైవర్లు మన జిల్లాలో 13 మంది ఆటో డ్రైవర్లు చనిపోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరాకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ అడ్డ రమేష్, బాలాజీ, శ్యామ్, లక్ష్మణ్, యూసుఫ్ బద్య, జానీ మియా, శ్యామ్ ప్రసాద్, సుక్క సుమన్, పచ్చిపాల మల్లేష్, అశోక్, రమేష్, సింగారం యాకన్న, అంజత్, ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.