Telugu News

చెక్ డ్యాంలను పరిశీలించిన జాయింట్ కమిషనర్

రికార్డులను పరిశీలించిన శేషుకుమార్

0

చెక్ డ్యాంలను పరిశీలించిన జాయింట్ కమిషనర్

== రికార్డులను పరిశీలించిన శేషుకుమార్

(ఏన్కూరు-విజయం న్యూస్):
మండల పరిధిలోని పలు గ్రామాల్లో నిర్మించిన చెక్ డ్యాంలను పంచాయతీరాజ్ శాఖ జాయింట్ కమిషనర్ శేషు కుమార్
బుధవారం పరిశీలించారు.తిమ్మారావుపేట,సూర్యతండాలలో వాటర్ షెడ్ పథకం కింద నిర్మించిన చెక్ డ్యాంలను ఆయన పరిశీలించారు.చెక్ డ్యాముల నిర్మాణం ద్వారా నీటి నిల్వలతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు.అనంతరం ఉపాధి హామీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. జరుగుతున్న ఉపాధి హామీ పనుల గురించి,కూలీల సంఖ్య గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో అదనపు డిఆర్ డిఓ శిరీష ,ఏపీడి వెంకటరాజు, ఎండిఓ ఎస్ రమేష్, ఏపీవో చిత్తలూరి సూరయ్య ,టి ఏ లు ,కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.