Telugu News

జర్నలిస్టు న్యాయ పోరాట దీక్ష

పలువురు మద్దతు...కలెక్టర్ హామీతో భవిషత్ కార్యాచరణకు బ్రేక్

0

జర్నలిస్టు న్యాయ పోరాట దీక్ష
– పలువురు మద్దతు
– కలెక్టర్ హామీతో భవిషత్ కార్యాచరణకు బ్రేక్

ఖమ్మం, ఆగస్టు8(విజయంన్యూస్)
33 ఏళ్లు గ జర్నలిస్ట్ వృత్తి లో ఉన్న తనకు మొదటి లిస్టు లో అక్రడేషన్ మంజూరు లేక పోవడానికి కారణాలు తెలియ చేయాలి అని, పిఐబి నిర్ణయం మేరకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ మీడియా కు గుర్తింపు ఇచ్చి అక్రిడేషన్ అవకాశం కల్పించాలి అని డిమాండ్ చేస్తూ,ఇండిపెండెంట్ జర్నలిస్ట్ శనగపాటి మురళి కృష్ణ సోమవారం ఖమ్మం కలెక్టరెట్ ఎదురుగా ఉన్న ధర్నా చౌక్ లో దీక్ష చేయడం జరిగింది.అనంతరం కలెక్టర్ విపి గౌతం కు వినతి ఇవ్వడం జరిగింది.స్పందించిన కలెక్టర్ అర్హత పరిశీలించి మంజూరు కు హామీ ఇచ్చారు.అంతకు ముందు కలెక్టర్ గ్రీవెన్స్ లో ఉన్న డిపిఆర్వో మాట్లాడుతూ రెండవ లిస్ట్ లో ప్రతిపాదన చేస్తానని పేర్కొన్నారు.ఈ సందర్భంగా శనగపాటి మురళి కృష్ణ మాట్లాడుతూ అవేదన తో నే దీక్ష అన్నారు.ఎందుకు మంజూరు చెయ్య లేదు అన్న విషయంగురించివ్రాతపూర్వకంగా అడిగినా సమాధానం లేదు అని,ఎవరికి వ్యతిరేకంగా,అనుకూలంగా,మరెవరి ప్రోద్బలం తో ఆందోళన కార్యక్రమం కాదు అన్నారు.కలెక్టర్ హామీ మేరకు భవిషత్ కార్యచెరణ ఉపసంహరణ చేసుకొంటున్న అన్నారు.దీక్షకు ప్రత్యక్ష ముగా,పరోక్షం గా మద్దతు తెలిపిన ట్రాన్స్ జెండర్ లు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు దోమల మేరీ తో పాటు,అందరికీ పేరు,పేరున మురళి కృష్ణ ధన్యవాదాలు తెలిపారు.

allso read- గోల్డ్ మెడల్ సాధించిన తెలుగుమ్మాయి