Telugu News

జోష్ లో ఖమ్మం జర్నలిస్టులు

ఒక్క అడుగు దూరంలో ఇండ్ల స్థలాలు

0

జోష్ లో ఖమ్మం జర్నలిస్టులు

== ఒక్క అడుగు దూరంలో ఇండ్ల స్థలాలు

== ఇండ్ల స్థలాల పంపిణికి కేబినెట్ అమోదంతో సంబరాల్లో విలేకర్లు

== సీఎం, మంత్రుల  చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నజిల్లా జర్నలిస్టులు

== అదే జరిగితే ఏళ్ల తరబడి ఎదురుచూపులకు పుల్ స్టాఫ్ పడే అవకాశం

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఏన్నో ఏళ్ల కల.. వేయ్యికండ్లతో ఏళ్లతరబడి ఎదురుచూపులో.. అదిగో..ఇదిగో అనడం తప్ప..అచరణలోకి సాధ్యం కాని దుస్థితి.. ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు చేస్తున్న సమయంలో తాత్కాలిక అనందాలకు నెలవుగా మాటల గారడితో మాయచేసిండ్రు తప్ప ఏనాడు జర్నలిస్టుల సంక్షేమం గురించి ఆలోచించలేదు.. గత ప్రభుత్వాలు స్థలాలిచ్చినప్పటికి కోర్టుల చుట్టు తిరగలేక వదిలేసుకున్న పరిస్థితి.. ఏళ్ల తరబడి పోరాటాలు.. ఉద్యమాలు.. హామిలు అంతలోనే మర్చిపోవటాలు.. ఇదంతా చూసిచూసి, వినివిని వేసారిపోయిన జర్నలిస్టులు ఇక ఇండ్ల స్థలాల సమస్య అటుకెక్కినట్లేనని భావించారు..

ఇది కూడా చదవండి: ఖమ్మం లో సీఎం కేసీఆర్, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం.

ఉద్యమాలను వదిలేశారు.. పోరాటాలను విరమించారు.. వినతిపత్రాలకే పరిమితమైయ్యారు.. ఇంతలో ఉన్నట్లుండి చిరు ఆశ చిగురించింది సీఎం ఖమ్మం పర్యటన  ద్వారా.. ఇండ్ల స్థలాలు సార్ అంటూ మొత్తుకున్న జర్నలిస్టులకు తీపికబురును అందించిన సీఎం కేసీఆర్ ఫీల్డ్ జర్నలిస్టులందరికి ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. వేదికపై చేసిన ప్రకటనకు అనుగుణంగా ఖమ్మంలో పనిచేసే ప్రతి జర్నలిస్టుకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఏకంగా కేబినెట్ ఆమోదింపజేసీ జర్నలిస్టుల మదిలో చిరుఆశలను రేకిత్తించే ప్రయత్నం చేశారు. అయితే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయం ఒక్క అడుగు దూరంలోనే ఉంది.. ఖమ్మం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు పంపిణి చేసే ప్రక్రీయకు కేవలం ఒక్క అడుగుదూరంలోనే ఉంది. ఆ అడుగు దూరం పూర్తి అయితే కచ్చితంగా జర్నలిస్టులు ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్న ఎదురుచూపులకు పుల్ స్టాఫ్ పడే అవకాశం ఉంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే

ఇది కూడా చదవండి: జర్నలిస్టుకు అండగా జర్నలిస్టులు.. మంత్రి పువ్వాడ

ఖమ్మం జిల్లా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి అడుగుదూరం మాత్రమే మిగిలింది. గత 25 ఏళ్ల నుంచి ఇండ్ల స్థలాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళనలు చేశారు. ధర్నాలు, దీక్షలు చేశారు. బంద్ పాటించారు. నిరహర, నిరవదిక దీక్షలు చేశారు. అయినప్పటికి అప్పటి ప్రభుత్వాలు ఇస్తామంటూనే నాన్చుడూ దోరణి అవలంభించాయి. కొన్ని ప్రాంతాల్లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వగ అక్కడ చాలా చోట్ల కోర్టు కేసులు అధికమైయ్యాయి. ఈ క్రమంలో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్య సుప్రీం కోర్టుకు చేరింది. అక్కడ స్టే విధించడంతో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల ప్రక్రీయ పూర్తిగా నిలిచిపోయింది. సమైఖ్యాంధ్రలో పెద్ద ఎత్తున ధర్నాలు చేసిన జర్నలిస్టులు, రాష్ట్ర విడిపోయి తెలంగాణ ఏర్పడిన అనంతరం కూడా జర్నలిస్టులో పోరాటం తప్పలేదు.  సీఎం కేసీఆర్ అనేక మీటింగ్ లలో  జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఉన్నప్పటికి కోర్టులో కేసులు ఉండటం వల్ల ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. దీంతో జర్నలిస్టులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఇంతలో..?

== జర్నలిస్టుల భవిష్యత్ ను మార్చిన సీజేఏ

జర్నలిస్టులకు ఇండ్ల స్థళాలు ఇవ్వాలని పోరాటం చేస్తుండగా, ప్రభుత్వాలకు ఇవ్వాలని ఉన్నప్పటికి కోర్టులో కేసులున్నాయని తప్పించుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే చావు దశకు చేరుకున్న దశలో ఎగిరి గంతేసినట్లుగా తెలుగు వాధి చీఫ్ జస్టీస్ రమణ దేశంలోని జర్నలిస్టులందరి భవిష్యత్ ను మార్చేశారు.

ఇది కూడా చదవండి: జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డు ల సమస్య ను పరిష్కరించండి:టీజేఎఫ్

ఆయన ఒక్క నిర్ణయంతో జర్నలిస్టుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిందనే చెప్పాలి. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వోచ్చని చీఫ్ జస్టిస్ రమణ అతని పదవి విరమణ సమయం కంటే ముందుగా సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ‘జర్నలిస్టుల పితామహుడిగా’ మారిపోయారు జస్టిస్ రమణ. ఆయన నిర్ణయం అనంతరం తెలంగాణలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల ప్రక్రీయ షూరు అయినప్పటికి ఖమ్మం జిల్లాలో నెలల తరబడి పెండింగ్ అవుతూ వస్తున్నాయి. చివరికి..?

== సీఎం ఆధ్వర్యంలో క్యాబినెట్ అమోదం

ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. అర్హులైన జర్నలిస్ట్ లందరికీ ఇళ్ళ స్థలాలు ఇస్తామన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన మాట నిలుపుకున్నారు. ఇప్పటికే ఖమ్మం నగర జర్నలిస్ట్ లకు ఇళ్ళ పట్టాలు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ హామీ మేరకు 5ఎకరాల్లో జర్నలిస్ట్ లకు ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. 5 ఎకరాలు స్థలం సరిపోదని, అర్హులైన జర్నలిస్ట్ లందరికీ ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఅర్ ని కోరిన స్థానిక ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజ్ఞప్తి మేరకు నేడు హైద్రాబాద్ లో జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఅర్ ఆమోదం తెలిపారు. ఇప్పటికే స్థలం గుర్తించామని, ప్రతి జర్నలిస్టుకూ 200 గజాలు ఇవ్వనున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో పని చేసే జర్నలిస్టులందరికీ ఇళ్ళ స్థలాలు పంపిణీ చేస్తామన్నారు.

== మాట నిలుపుకున్న మంత్రి పువ్వాడ

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం అందిస్తానని నాడు చెప్పిన మాటను ఆచరణ సాధ్యం చేసి చూపిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, 20 ఏండ్ల జర్నలిస్టుల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.  ఖమ్మంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో సీఎం కేసీఆర్ ఖమ్మంలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తాననే మాటను నిలబెట్టుకున్నది. మాట ఇస్తే మనమతిప్పని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి జర్నలిస్టుల పక్షాన నిలిచారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర ప్రెస్ అకాడెమీ ఛైర్మెన్ అల్లం నారాయణల కృషి మేరకు ఇండ్లస్థలాల ప్రక్రియ కు ప్రభుత్వ ఆమోదం లభించింది.

ఇది కూడా చదవండి: జర్నలిస్టులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలుచేస్తాం:మంత్రి పువ్వాడ

== జోష్ లో జర్నలిస్టులు.. పాలాభిషేకాలు.. ధన్యవాదాలు చెబుతున్న జర్నలిస్టులు

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల ఇచ్చేందుకు గా23 ఎకరాల ఎన్ఎస్పీ స్థలాన్ని కేటాయిస్తూ మంత్రివర్గం అమోదించడంతో ఖమ్మం జిల్లా జర్నలిస్టులు జోష్ లో ఉన్నారు. ప్రభుత్వం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను పంపిణి చేసే ప్రక్రీయను షూరు చేయడంతో ఖమ్మం జిల్లా జర్నలిస్టులు సంతోషంతో ఊగిపోతున్నారు. ఇక మాకు ఇండ్ల స్థలాలు వచ్చినట్లేనని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మంత్రి తన్నీరు హారీష్ రావు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తుండగా, సీఎంకు, మంత్రులకు జర్నలిస్ సంఘాల నాయకులు, జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తారా..? ఎప్పటిలోపు ప్రక్రీయను పూర్తి చేస్తారో..? జర్నలిస్టు 25ఏళ్ల సుదీర్ఘ కళ ఎప్పుడు నేరవేరుతుందో వేచి చూడాల్సిందే..?