ఖమ్మం కాంగ్రెస్ లో పదవుల జోష్
== నూతన కమిటీలను ప్రకటించిన అధిష్టానం
== భద్రాద్రికొత్తగూడెం జిల్లా బాస్ గా ‘పోడేం వీరయ్య’
== మరోసారి అవకాశం కల్పించిన అధిష్టానం
== పీసీసీ పొలిటికల్ అఫైర్ కమిటీలో భట్టి, రేణుక, బలరాం
== ఎగ్జిక్యూటీవ్ కమిటీలో భట్టి, రేణుక, బలరాం, సంబానీ, పొడెం వీరయ్యలకు చాన్స్
== పీసీసీ ఉపాధ్యక్షుడిగా పోట్ల నాగేశ్వరరావు
== ప్రధాన కార్యదర్శులుగా తాటి, నూతి, యడవల్లి, మానవత్ రాయ్, రాంరెడ్డి గోపాల్ రెడ్డి
== ఖమ్మం జిల్లా అధ్యక్ష పదవి కి ఎంపికకు బ్రేక్
== సంబరాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉన్నట్లుండి జోష్ వచ్చింది.. ఎవరు ఊహించకుండానే పీసీసీ పూర్తి స్థాయి కమిటీతో పాటు జిల్లా కమిటీలను ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఆయా జిల్లాలో సమర్థవంతంగా పనిచేస్తున్న నాయకత్వానికి అధిష్టానం పెద్దపీట వేసింది. సీనియర్లు, జూనియర్లను కలగలపుతూ కమిటీలో బాధ్యతలను అప్పగించారు. అంతేకాకుండా ఎక్కడ ఇబ్బందులు రాకుండా కమిటీలో జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎవరిని నొప్పించకుండా కమిటీలు నియమించారు. ప్రధాన కమిటీలో అందరికి అవకాశం కల్పిస్తూనే పీసీసీ కమిటీలో ఉమ్మడి జిల్లాలో కీలక నాయకత్వానికి పదవులను అప్పగించింది ఏఐసీసీ.
== పీసీసీ ప్రధాన కమిటీలో ఉమ్మడి జిల్లా నేతలు ఇది కూడా చదవండి : కోమటిరెడ్డి లేకుండానే..? అందులో నోచాన్స్
పీసీసీకి అత్యంత బలమైన పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ఎగ్జిక్యూటీవ్ కమిటీలను ఏఐసీసీ శనివారం అధికారికంగా ప్రకటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. పీసీసీ పొలిటికల్ ఆపైర్స్ కమిటీలో మణిక్యం ఠాగూర్ చైర్మన్ గా నియమిస్తూ 17మంది సభ్యులను నియమించింది. అందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ కేంద్రమంత్రులు రేణుక చౌదరి, బలరాంనాయక్ లను నియమించింది.
అలాగే ఎగ్జిక్యూటీవ్ కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డితో పాటు 39 మంది సభ్యులను నియమించింది. అందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ కేంద్ర మంత్రులు రేణుకచౌదరి, బలరాం నాయక్, మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే పోడేం వీరయ్యలను నియమించింది. అయితే సంబాని చంద్రశేఖర్, పొడెం వీరయ్యలు ఇప్పటికే పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతుండగా, ప్రస్తుతం పోడెం వీరయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైయ్యారు.
== పీసీసీ ఉపాధ్యక్షుడిగా పోట్ల నాగేశ్వరరావు
పీసీసీ ప్రత్యేక కమిటీలతో పాటు ఉపాధ్యక్షులను కూడా నియమించింది. మొత్తం 24 మంది ఉపాధ్యక్షులను నియమించగా, అందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒక్కరికి మాత్రమే అవకాశం లభించింది. సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావుకు పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం నియమించింది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆయనకు అభినందనలు చెబుతున్నారు. ఆయన అభిమానులు సంబరాలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: మహిళా కాంగ్రెస్ కు భట్టి విక్రమార్క దశదిశ
== ప్రధానకార్యదర్శులుగా ఐదుగురికి అవకాశం
పీసీసీ ప్రధాన కార్యదర్శులను పార్టీ అధిష్టానం నియమించింది. అందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఐదుగురికి అవకాశం కల్పించింది. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సోదరుడు రాంరెడ్డి గోపాల్ రెడ్డిని పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ నియమించింది. అలాగే మాజీ ఎమ్మెల్యే, ఇటివలే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తాటి వెంకటేశ్వర్లకు ప్రధాన కార్యదర్శి పదవిని ఇవ్వగా విద్యార్థి సంఘం నాయకుడు మానవతరాయ్, వైరా నియోజకవర్గంలో కీలక నాయకుడిగా ఉన్న సీఎల్పీ భట్టి విక్రమార్క ప్రధాన అనుచరుడు నూతి సత్యనారాయణ గౌడ్ ను ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశారు. అలాగే సీనియర్ నాయకుడు, రేణుక చౌదరి ప్రధాన అనుచరుడు యడవల్లి క్రిష్ణకు ప్రధాన కార్యదర్శిగా నియమించింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో సంబరాలు మిన్నంటాయి..
== భద్రాద్రికొత్తగూడెం జిల్లా బాస్ గా పోడెం వీరయ్య.. పెండింగ్ లో ఖమ్మం…?
పీసీసీ ప్రధాన కమిటీలతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులను కూడా ఏఐసీసీ అధిష్టానం ప్రకటించింది. మొత్తం 26 జిల్లాలకు అధ్యక్షులను నియమించగా, ఖమ్మం జిల్లాను పెండింగ్ లో పెట్టారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ కొనసాగుతుండగా నూతన అధ్యక్షుడి నియామంకు విషయంలో కొంత పెండింగ్ పెట్టారు. అతి త్వరలో నూతన అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్యను అధిష్టానం నియమించింది. ఇప్పటికే భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఏర్పాటు అయిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షడు బాధ్యతలను నెరవేరుస్తున్నప్పటికి అదిష్టానం ఆయనకు మరోసారి అవకాశం కల్పించింది.