Telugu News

జర్నలిస్టుల ఇళ్లస్థలాల కోసం ఉద్యమ కార్యాచరణ

యూనియన్ సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన

0

జర్నలిస్టుల ఇళ్లస్థలాల కోసం ఉద్యమ కార్యాచరణ
-టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రామ్ నారాయణ
-యూనియన్ సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన

రాష్ట్రంలో జర్నలిస్టుల ఇళ్లస్థలాల కోసం ఉద్యమ కార్యాచరణ చేపట్టడం జరుగుతుందని టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె నారాయణ పేర్కొన్నారు. టీ యుడబ్ల్యు జే (ఐ జే యు) ఖమ్మం నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం ప్రెస్ క్లబ్ ఎదురుగా ఉన్న ఐఎంఏ ఫంక్షన్ హాల్ లో జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రామ్ నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఖమ్మం నగర కన్వీనర్, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు మైస పాపారావు, కో కన్వీనర్ చెరుకుపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రామ్ నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం యూనియన్ ఎప్పుడూ పోరాటాలు నిర్వహిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. జర్నలిస్టులకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, పాలకులు ఎవరు ఉన్నా సమస్యలు పరిష్కరించుకోవడం లక్ష్యంగా యూనియన్ పని చేస్తుందని స్పష్టం చేశారు.

also read :-ట్యాoకర్ పేలి నలుగురు మృతి

కరోనా కష్ట కాలంలో ఎంతో మంది జర్నలిస్టులు ఇబ్బందులు పడ్డారని, అనేక మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హెల్త్ కార్డులు ఎందుకూ పనికి రాకుండా పోయాయని ఆరోపించారు. జర్నలిస్టులకు సీఎం కేసీఆర్ ఇళ్ల స్థలాలు ఇస్తే సంతోషిస్తామని, మార్చి నెల రెండవ వారంలో గా ఇవ్వని చో ఉద్యమ కార్యాచరణ చేపడతామని స్పష్టం చేశారు. ఉద్యమాలకు జర్నలిస్టులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్కార్డులు, అక్రిడేషన్ లు సాధించే దిశలో యూనియన్ ముందు వరుసలో ఉంటుందని పేర్కొన్నారు. యూనియన్ రాష్ట్ర నాయకులు, సీనియర్ జర్నలిస్టు బి ప్రసేన్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఐక్యతగా సమస్యలు పరిష్కరించుకునే దిశలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం యూనియన్ ఉద్యమ కార్యాచరణ చేపట్టనుందన్నారు.

also read :-కూసుమంచి మండలంలో విషాదం.. రైతు హత్య..

యూనియన్ జిల్లా కార్యదర్శి షేక్ ఖాదర్ బాబా, రాష్ట్ర జిల్లా నాయకులు ఏనుగు వెంకటేశ్వరరావు, ఆవుల శ్రీనివాస్, వనం వెంకటేశ్వర్లు, మోయినుద్ధిన్, మా రెడ్డి నాగేందర్ రెడ్డి, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు గోగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సామినేని మురారి, ఎం.భూపాల్, నలజాల వెంకట్రావు, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాటేటి వేణుగోపాల్, కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అప్పారావు, జాకీర్, ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కమటం శ్రీనివాస్, జనతా శివ, ఏగినాటి మాధవరావు, జనార్దనాచారి తదితరులు ప్రసంగించారు. అనంతరం సభ్యత్వ నమోదును యూనియన్ నాయకులు లాంఛనంగా ప్రారంభించి అందరికీ సభ్యత్వాలు అందజేశారు.

-సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన :
టీయూడబ్ల్యూజే (ఐ జే యు) ఖమ్మం నగర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జర్నలిస్టుల నుండి అనూహ్య స్పందన లభించింది. ఒక్కరోజే సుమారు 250 మంది జర్నలిస్టులు తమ పేర్లను నమోదు చేసుకుని సభ్యత్వ రుసుము చెల్లించారు. కన్నుల పండువగా జరిగిన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఖమ్మం నగర కమిటీ నిర్వహణ తీరును నాయకులు అభినందనలతో ముంచెత్తారు. అనంతరం ముఖ్య అతిథులుగా వచ్చిన ఖమ్మం ఉమ్మడి జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, యూనియన్ బాధ్యులను ఖమ్మం నగర కమిటీ బాధ్యులు ఘనంగా శాలువాలు, కండువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఆత్మీయ విందు తో ఆతిథ్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, యూనియన్ ఖమ్మం నగర, జిల్లా, రాష్ట్ర నాయకులు, డెస్క్, కెమెరా, ఫోటో జర్నలిస్టులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గొప్ప మానవతావాది అన్నం శ్రీనివాసరావు ఘనసత్కారం..:

యూనియన్ సభ్యత్వ నమోదు సమావేశం సందర్భంగా కరోనా కష్టకాలంలో సామాజిక సంఘ సేవ తో పాటు జర్నలిస్టులకు సైతం గొప్ప సేవలు అందించి న అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ అన్నం శ్రీనివాసరావు ను ఘనంగా జర్నలిస్టు యూనియన్ నేతలు సత్కరించి అభినందనలు తెలిపారు. అన్నం శ్రీనివాసరావు సేవలను కె రామ్ నారాయణ, ప్రసేన్, వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, ఆవుల శ్రీనివాస్, మోయినుద్ధిన్ , మైసా పాపారావు, చెరుకుపల్లి శ్రీనివాసరావు, జనార్దనాచారి తో పాటు పలువురు జర్నలిస్టులు అభినందనలతో ముంచెత్తారు.