జేపీఎస్ లను బేషరతుగా రెగ్యులర్ చేయాలి.
== ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు డిమాండ్.
== 10వ రోజు కొనసాగిన పంచాయతీ కార్యదర్శుల సమ్మె
(కూసుమంచి-విజయంన్యూస్)
రాష్ట్రంలో పనిచేస్తున్న జేపిఎస్ లను చెక్ పవర్ తో కూడిన రెగ్యులర్ చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పదవ రోజు సమ్మెలో కూర్చున్న జేపిఎస్ ల సమ్మెకు కూసుమంచి లో మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పంచాయతీ కార్యదర్శులు ఉండాలని చట్టం చేసినందు వల్లనే జేపీఎస్ లు ఎంపిక అయ్యారన్నారు. ఆ చట్టంలో పటిష్టం గా అమలు చేయడంలో జేపిఎస్ ల పాత్ర కీలకమైంది అన్నారు.
ఇది కూడా చదవండి: `9వ రోజు కార్యదర్శుల రంగవల్లికలతో నిరసన
గతంలో గ్రామపంచాయతీ కార్యదర్శులకు ఉన్న చెక్కు పవర్ తో పాటు అన్ని అధికారాలను జెపిఎస్ లు కూడా అన్వయించాలని అందుకోసం పంచాయతీరాజ్ చట్టం 2018 ని సవరణ చేయాలని ఆయన కోరారు. చనిపోయిన జెపిఎస్ కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయంతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి కారుణ్య నియమాంకం కింద ఉద్యోగం ఇవ్వాలని,నాలుగు సంవత్సరాల ప్రవేశం పిరియడ్ ని కూడా ఇన్ సర్వీస్ గా పరిగణించి రెగ్యులర్ చేయాలని, OPS, కన్వర్టెడ్ జెపిఎస్,లను కూడా భేషరతుగా రెగ్యులర్ చేయాలన్న తదితర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేట్ ప్రకటించిన దీన్ దాయాల్ ఉపాధ్యాయ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థాయిలో నిలిచిందని అందుకు పంచాయతీ కార్యదర్శులతో పాటు మల్టీపర్పస్ వర్కర్ల కృషి కూడా ఉందని ఆయన కొనియాడారు. ఏజెన్సీ ప్రాతంలో లో జి. వో 494 ద్వారా నియమించబడిన జేపిఎస్ లకు కూడా మిగిలిన వారితో సమానంగా రెగ్యులర్ చేయాలన్నారు . 317 జి వో కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన 17 మంది ఓపిఎస్ లను చేస్తున్న వెంటనే తిరిగి తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గుండెపోంగు మల్లేష్, పి. తిరుపయ్య, పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు అంబాల అంజయ్య, బాధ్యులు సృజన, నరేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: పంచాయతీ కార్యదర్శులకు అండగా ఉంటాం: కాంగ్రెస్