Telugu News

జుజ్జులరావుపేట వెంచర్ పై అధికారుల నజర్ 

వెంచర్లలో పనులను నిలిపిన అధికారులు

0

జుజ్జులరావుపేట వెంచర్ పై అధికారుల నజర్ 

== విజయం కథనానికి స్పందించిన ఉన్నతాధికారులు

== వెంచర్లలో పనులను నిలిపిన అధికారులు

== అనుమతులు వచ్చే వరకు పనులు చేయోద్దని ఆదేశం
(కూసుమంచి-విజయంన్యూస్)
కూసుమంచి మండలంలోని అనుమతులు లేకుండా నిర్మాణం చేస్తున్న వెంచర్లపై ఉన్నతాధికారులు  చర్యలు తీసుకునే పనిలో పడ్డారు. కూసుమంచి మండలంలోని జుజ్జులరావుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారి పక్కనే  ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్ నిర్మాణ పనులు జరుగుతుండగా ‘విజయం’ తెలుగు దినపత్రిక, ‘విజయం టీవీ’లో గత మూడు రోజులుగా వరస కథనాలుప్రచురితమైయ్యాయి.. ఈ క్రమంలో స్పందించిన జిల్లా ఉన్నతాధికారులు, మండల అధికారులు అనుమతులు లేని వెంచర్లపై చర్యలు తీసుకునే పనిలో పడ్డారు.
కూసుమంచి తహసీ్లదార్   మీనన్, కూసుమంచి ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, ఎంపీవో రాంచంద్రయ్య, పంచాయతీ కార్యదర్శి సహాజ, సర్వేయర్ రవి తదితరులు జుజ్జులరావుపేట గ్రామంలో పర్యటించిన వెంర్ నిర్మాణం జరుగుతున్న స్థలాన్ని పరిశీలించారు. అక్కడ అనుమతులకు సంబంధించిన వివరాలను అక్కడ పనులు చేస్తున్నవారిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోవడంతో అక్కడ జరుగుతున్న పనులను తక్షణమే నిలిపివేశారు. పూర్తి స్థాయి అనుమతులు లేకుండా ఇక్కడ పనులు చేయోద్దని, పనులు చేస్తే వాహనాలను సీజ్ చేస్తామని కూసుమంచి తహసీల్దార్ మీనన్ హెచ్చరించారు. అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా పనులు చేయడమేంటని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి తప్పు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ముందుగా కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం అక్కడ పనిచేసే వాహనాలను బటయకు తరలించారు. నిత్యం ఇక్కడ పర్యవేక్షణ చేయాలని, పనులు జరుగుతే మాకు చెప్పాలని ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శికి సూచించారు.