Telugu News

గజ్జెల రామారావు కుటుంబానికి న్యాయం చేయాలి

- నిందితులను కఠినంగా శిక్షించాలి!

0

గజ్జెల రామారావు కుటుంబానికి న్యాయం చేయాలి

– నిందితులను కఠినంగా శిక్షించాలి!
– కేసును దర్యాప్తును సమగ్రంగా త్వరగా పూర్తి చేయాలి!
– బాధిత కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇల్లు,ప్రభత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి!
– దళిత బహూజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్ డిమాండ్!

(కన్నాయిగూడెం విజయం న్యూస్):-

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం చింత గూడెం గ్రామానికి చెందిన నిరుపేద దళితుడైన గజ్జెల రామారావును అతి కిరాతకంగా నరికి చంపిన హంతకులను కఠినంగా శిక్షించాలని దళిత బహూజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్ డిమాండ్ చేశారు.మంగళవారం చింత గూడెం గ్రామంలో ఈనెల 7న హత్య గావించబడిన రామారావు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుడైన రామారావును ఈ నెల 7 న చత్తీస్ఘడ్ నుండి వలస వచ్చిన బీసి యాదవ సామాజిక వర్గానికి చెందిన గొల్ల జోగయ్య మరికోంత మందితో కలిసి హత్య చేశాడని కావున నిందితునిపై ఎస్సీ, ఎస్టీ, అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసి బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరిహారం అందించాలని, అదే విధంగా కుటుంబంలో ఓకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలన్నారు.బాధిత కుటుంబానికి ఎలాంటి వ్యవసాయ భూములు లేవని, ఉండేందుకు ఇల్లు కూడా లేదని కాబట్టి డబుల్ బెడ్ రూమ్ ఇల్లుతో పాటు 3 ఎకరాల ప్రభత్వ భూమిని పంపిణి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.హత్యలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో తెలియాలంటే కేసును పారదర్శకంగా,వేగవంతంగా విచారణ పూర్తి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో దళిత బహూజన ఫ్రంట్ హన్మకోండ జిల్లా ఇంచార్జి కొమ్ముల కర్ణాకర్,జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ తదితరులు పాల్గోన్నారు.

also read :- రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య.