Telugu News

24గంటల్లో న్యాయం చేయాలి..లేకుంటే స్టేషన్ కు వస్తా: పొంగులేటి

ఓటేస్తాననంటే కొడతారా.?

0

24గంటల్లో న్యాయం చేయాలి..లేకుంటే స్టేషన్ కు వస్తా

== ఓటేస్తాననంటే కొడతారా.?

==  రామకృష్ణకు న్యాయం జరగాలి
== చేయకపోతే నేనే స్టేషనొకొస్తా…!
== అర్బన్ సీఐతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

== రామకృష్ణకు అండగా ఉంటా…! ఆదుకుంటా..!!

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్):

ఒకటి కాదు… రెండు కాదు… సంఘటన జరిగి 72 గంటలు కావొస్తుంది. కానీ ఇంతవరకు బాధితుడు రామకృష్ణకు అతని కుటుంబానికి న్యాయం జరగలేదు. రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా..? ఉంటే చెప్పండి పై అధికారులతో నేను మాట్లాడతా… ఏం చేస్తారో నాకు తెలియదు మరో 24గంటల్లో బాధితుడు రామకృష్ణకు న్యాయం జరగాలి… జరగకపోతే నేనే స్టేషనొకొస్తా… న్యాయం జరగే వరకు అక్కడే ఉంటాన్నంటూ ఖమ్మం అర్బన్ సీఐ రామకృష్ణతో ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్లో మాట్లాడారు. గత మూడు రోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన అభిప్రాయంలో శీనన్న గెలుస్తాడు అన్నందుకు ఓ నేత వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు వైఎస్సాఆర్ కాలనీకి చెందిన రామకృష్ణపై దాడి చేశారు. దాడి చేయడమే కాకుండా అతని ఆటోను ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై స్పందించిన పొంగులేటి శీనన్న గురువారం రాత్రి వారి ఇంటికి వెళ్లారు. అండగా ఉంటానని… అన్ని విధాల ఆదుకుంటానని రామకృష్ణకు అతని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అనంతరం అర్బన్ సీఐతో ఫోన్లో మాట్లాడారు. వీలైనంత త్వరగా న్యాయం చేయాలని లేనిచో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

allsp read- ఇల్లెందులో పొంగులేటి సంచలన వ్యాఖ్యలు