Telugu News

కబడ్డి అడి ఉత్తేజపరిచన ఎమ్మెల్యే కందాళ.. పాఠాలు వింటూ భరోసా కల్పిస్తూ

** పైనంపల్లిలో రాష్ట్ర స్థాయి కబడ్డి పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

0

కబడ్డి అడి ఉత్తేజపరిచన ఎమ్మెల్యే కందాళ.. పాఠాలు వింటూ భరోసా కల్పిస్తూ
** పైనంపల్లిలో రాష్ట్ర స్థాయి కబడ్డి పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
** గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఉపేందర్ రెడ్డి
** పాలేరు నియోజకవర్గంలో విస్తత పర్యటన
(కూసుమంచి –విజయంన్యూస్);-
కబ్డడ్డి.. కబడ్డి అంటూ కూతకు పోయిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి క్రీడాకారులను ఉత్తేజ పరిచారు.. అంతేకాదు ఆకస్మీకంగా గురుకుల పాఠశాలను తనిఖీ చేసి, విద్యర్థలతో కుర్చోని పాఠాలను వింటూ విద్యార్థులకు భరోసా కల్పించారు.. పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే, అందరికి అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఇదంతా మంగళవారం పాలేరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే పాలేరు నియోజవకర్గంలోని పలు మండలాల్లో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పర్యటించారు. ముందుగా ఖమ్మం రూరల్ మండలంలోని 59వ డివిజన్ దాన్వాయిగూడెం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల అవరణంలోకి వెళ్లిన ఆయనకు విద్యార్థులు పూలు అందించి స్వాగతం పలికారు. అనంతరం నేరుగా తరగతి గదిలోకి వెళ్లిన ఎమ్మెల్యే విద్యార్థులతో కుర్చోని పాఠాలను విన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. వారికి ప్రస్తుత పోటి ప్రపంచం, చదువుకుని మంచి మార్కులు సాధించడం వల్లే ప్రయోజనాలు, ప్రభుత్వం అందించే సహాకారం గురించి వివరించారు. అనంతరం వంటగదిని పరిశీలించారు. కూరగాయలు నేలపై ఉండటంతో ప్రిన్సిపల్ కు సలహాలను అందించారు. బియ్యంను పరిశీలించారు. అనంతరం స్కూల్ అవరణాన్ని పరిశీలించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్కూల్ వార్డెన్ పలు సమస్యలను వివరించగా, స్పందించిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సమస్యలను పరిష్కరించేందుకు కఆషి చేస్తానని హామినిచ్చారు.
** పైనంపల్లిలో కబడ్డి ఆడిన ఎమ్మెల్యే
ఖమ్మం జిల్లా పాలేరు నియోజవర్గం నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి గ్రామం లో ఆటల పోటీల్లో పాల్గొన్న పాలేరు ఎమ్మెల్యే కందాళ కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్తేజ పరిచారు. క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కబడ్డి పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పాలేరు ఎమ్మెల్యే కందాళ మాట్లాడుతూ నేను కూడా ఆటలంటే ఇష్టపడతానని, ఆటల వల్ల మనకి శారీరక ఉల్లాసాన్ని ఇస్తుందని తెలిపారు. కావున ఆటలు పోటీలు ఆడడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. గ్రామీణ క్రీడాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు.
** పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలంలో పర్యటించిన కందాళ ఉపేందర్ రెడ్డి పలు కుటుంబాలను పరామర్శించారు. తిరుమలాయపాలెం మండలం ఏలువారిగూడెం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న K.చిన్న భద్ర రెడ్డి గారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల మరణించిన నందిగామ నిర్మలమ్మ ,కోట పెంటయ్య చిత్ర పట్టాలకు పులువేసి,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం గ్రామంలో మంగళవారం మృతి చెందిన ఆలేటి మల్లమ్మ పార్థివదేహానికి పూలమాలలువేసి,నివాళులర్పించి రూ.10వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య , బెల్లం వేణు, బాసబోయిన వీరన్న,ఎంపీపీలు బానోతు శ్రీనివాస్ నాయక్, బెల్లం ఉమా, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

also read :-పేదలకు సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరు చేపించడం లో ఎంపీ నామ కృషి మరువలేనిది