Telugu News

.కందాళలో కబడ్డి జోష్.

కూతకు పోయి పాయింట్ తెచ్చిన ఎమ్మెల్యే.

0

.కందాళలో కబడ్డి జోష్.

— కూతకు పోయి పాయింట్ తెచ్చిన ఎమ్మెల్యే.

–రాజేశ్వరపురంలో కబడ్డి అడిన ఎమ్మెల్యే కందాళ.

— కబడ్డి పోటీల ప్రారంభ కార్యక్రమంలో హాజరై పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే.

(నేలకొండపల్లి/ కూసుమంచి-విజయంన్యూస్) :-

పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మొదటి సారిగా ఆయన క్రీడాకారుడిగా చూశారు.. అంతే కాదు..ఆయన కబడ్డి కూతకు పోయి పాయింట్ తీసుకొచ్చి.. నేను పాయింట్ తీసుకొచ్చా అంటూ చెప్పడంతో అభిమానుల్లో, చూపరుల్లో నూతన ఉత్తేజం.. ఉల్లాసం వచ్చినట్లైంది.. ఎంతో ఉత్సహాంతో కబడ్డి ఆడిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అందరికి ఆదర్శమైయ్యారు..

అందరిలో కలిసిపోయి నేను సామాన్యుడినే అన్నట్లుగా వ్యహరించిన తీరు పలువుర్ని ఆకట్టుకుంది.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని రాజేశ్వరపురం గ్రామంలో కార్తీకపౌర్ణమి వేడుకల సందర్భంగా .ప్రతి ఏడాది ఎద్దుల పంద్యాలు, కబడ్డి, వాలీబాల్ పోటీలను నిర్వహించడం అచారంగా వస్తోంది.. అందులో భాగంగానే ఈ ఏడాది ఎద్దుల పంద్యాలు, కబడ్డి పోటీలను నిర్వహించగా, బుధవారం రెండవ రోజు కబడ్డి పోటీలు జరుగుతుండగా వాటిని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ప్రారంభించేందుకు వచ్చారు. రాజేశ్వరపురం వచ్చిన కందాళకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. పూలవర్షం కురిపించారు. ఎడ్లబండిపై ప్రదర్శనగా క్రీడా మైదానానికి వచ్చారు. దీంతో రెండవ రోజు కబడ్డిపోటీలను ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.

క్రీడాపోటీలను క్రీడాస్పూర్తిగా తీసుకుని మంచి క్రీడా ప్రతిభను చూపించాలని సూచించారు. అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆయన కూడా కొద్ది సేపు కబడ్డి క్రీడాకారులతో కలిసి కబడ్డి ఆట అడారు. సుమారు 10 నిమిషాల పాటు ఆయన కబడ్డి ఆడటంతో పాటు కబడ్డి కూతకు వెళ్లి పాయింట్ తీసుకోచ్చి ఆవుట్ అంటూ అందర్ని ఆశ్చర్యపరిచారు. చూసేవారంతా సంబుర పడ్డారు. జై కందాళ, జైజై కందాళ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.అనంతరం ఎద్దుల పోటీలను ప్రారంభించారు. ఎద్దుల పోటీలు, కబడ్డి పోటీలు అద్భుతంగా జరిగాయి. ఈ పోటీలను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దండా పుల్లయ్య, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్థులు తదితరులు హాజరైయ్యారు.

also read ;-కార్యకర్తలే సర్కార్ కు సైనికులు.. ఖమ్మం మేయర్ నీరజ.

also read :-నేటి సటి సావిత్రి||