Telugu News

కబడ్డి ఆడిన పొంగులేటి.

కబడ్డి పోటీల ప్రారంభ కార్యక్రమంలో హాజరైన మాజీ ఎంపీ.

0

కబడ్డి ఆడిన పొంగులేటి.

కబడ్డి పోటీల ప్రారంభ కార్యక్రమంలో హాజరైన మాజీ ఎంపీ.

(నేలకొండపల్లి/ కూసుమంచి – విజయంన్యూస్):-
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కబడ్డి ఆడారు.. జట్టుతో పోటీపడీ మరీ పాయింట్ సాధించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని రాజేశ్వరపురం గ్రామంలో కార్తీకపౌర్ణమి వేడుకల సందర్భంగా ప్రతి ఏడాది ఎద్దుల పంద్యాలు, కబడ్డి, వాలీబాల్ పోటీలను నిర్వహించడం అచారంగా వస్తోంది..

అందులో భాగంగానే ఈ ఏడాది ఎద్దుల పంద్యాలు, కబడ్డి పోటీలను నిర్వహించగా, మంగళవారం కబడ్డి పోటీలను మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కొద్ది సేపు కబడ్డి క్రీడాకారులతో కలిసి కబడ్డి ఆట అడారు. సుమారు 25 నిమిషాల పాటు ఆయన కబడ్డి ఆడటంతో చూసేవారంతా సంబుర పడ్డారు. జై పొంగులేటీ, జైజై పొంగులేటి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.అనంతరం ఎద్దుల పోటీలను ప్రారంభించారు. ఎద్దుల పోటీలు, కబడ్డి పోటీలు అద్భుతంగా జరిగాయి. ఈ పోటీలను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దండా పుల్లయ్య, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్థులు తదితరులు హాజరైయ్యారు.

also read :-అర్ధరాత్రి అక్రమంగా గంజాయి రవాణా..తప్పించుకున్న స్మగ్లర్లు.