Telugu News

కబడ్డి ఆడిన తుమ్మల.

కబడ్డి పోటీల ప్రారంభకార్యక్రమంలో హాజరైన మాజీ మంత్రి.

0

కబడ్డి ఆడిన తుమ్మల.

కబడ్డి  పోటీల ప్రారంభకార్యక్రమంలో హాజరైన మాజీ మంత్రి.

(నేలకొండపల్లి కూసుమంచి – విజయంన్యూస్)

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కబడ్డి ఆడారు.. నమ్మలేరా..? నిజమండి కబడ్డి ఆడారు.. నేలకొండపల్లి మండలంలోని రాజేశ్వరపురం గ్రామంలో కార్తీకపౌర్ణమి వేడుకల సందర్భంగా ప్రతి ఏడాది ఎద్దుల పంద్యాలు, కబడ్డి, వాలీబాల్ పోటీలను నిర్వహించడం అచారంగా వస్తోంది.. అందులో భాగంగానే ఈ ఏడాది ఎద్దుల పంద్యాలు, కబడ్డి పోటీలను నిర్వహించగా, మంగళవారం కబడ్డి పోటీలను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన కొద్ది సేపు కబడ్డి క్రీడాకారులతో కలిసి కబడ్డి ఆట అడారు. సుమారు 25 నిమిషాల పాటు ఆయన కబడ్డి ఆడటంతో చూసేవారంతా సంబుర పడ్డారు. జై తుమ్మల, జైజై తుమ్మల అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.అనంతరం కబడ్డి పోటీలు అద్భుతంగా జరిగాయి. ఈ పోటీలను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దండా పుల్లయ్య, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్థులు తదితరులు హాజరైయ్యారు.

also read :- తెలంగాణ రవాణా శాఖకు జాతీయ స్థాయి అవార్డు.