Telugu News

కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ చేసి: జెడ్పిటిసి పొశం.నరసింహారావు

0
కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ చేసి: జెడ్పిటిసి పొశం.నరసింహారావు
మణుగూరు నవంబరు 01 (విజయం న్యూస్):
పేదల సంక్షేమానికి కెసిఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని వారికి అన్ని విధాల ఆదుకునేందుకు కెసిఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని మణుగూరు జడ్పిటిసి పోశం  నరసింహ రావు అన్నారు గురువారం నాడు మణుగూరు మండలంలోని కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తూ ఆయన మాట్లాడుతూ అత్యంత నిరుపేదలైన ప్రజలు తమ పిల్లల వివాహాల సమయంలో అయ్యే ఖర్చులు వలన అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని గుర్తించిన కేసీఆర్ వివాహ సమయంలో ఎంతో ఆసరాగా ఉపయోగపడే కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టి ఎంతో అండగా నిలుస్తున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మణుగూరు ఎంపీపీ కారం విజయ కుమారి మండల తహసిల్దార్  కె నాగరాజు, సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, బి ఆర్ ఎస్ మండల పట్టణ అధ్యక్షులు ముత్యం బాబు, బొలిశెట్టి నవీన్, మహిళా నాయకులు రమాదేవి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.