Telugu News

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

110 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ

0

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

** 110 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)

ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో మంజూరైన 56- కల్యాణలక్ష్మీ/షాదిముభారక్ చెక్కులు, 110-సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  స్వయంగా పంపిణీ చేశారు.

Allso read-నూతన కలెక్టరేట్ భవననిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి- మంత్రి పువ్వాడ.

56-కల్యాణలక్ష్మి/షాది ముభారక్ చెక్కులకు గాను రూ.56లక్షలు, 110- ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులకు గాను రూ.39.06లక్షల విలువైన చెక్కులను మంత్రి పువ్వాడ స్వయంగా పంపిణీ చేశారు.

** మంత్రి పువ్వాడ కు అభినందనల వెల్లువ..*


తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఅర్ గారి క్యాబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మండల నాయకులు ఎర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు.

Allso read:- బాలాపూర్ లడ్డు 24.60లక్షలు

అనంతరం మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మంత్రి పువ్వాడ కు జ్ఞాపిక లు, పుష్పగుచ్చాలు, శాలువాతో సత్కరించారు.

** కాళోజీకి నివాళులు..*
స్వరాష్ట్ర ఉద్యమానికి తన రచనలతో స్ఫూర్తిని నింపిన తెలంగాణ సాంస్కృతిక సౌరభం, ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు కాళోజీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.