Telugu News

కల్యాణలక్ష్మిపథకం ఆడబిడ్డకు వరం

== ఆడపిల్ల పెండ్లికి అప్పులు తేవాల్సిన అవసరం లేకుండా చేస్తున్నాం

0

కల్యాణలక్ష్మిపథకం ఆడబిడ్డకు వరం

== ఆడపిల్ల పెండ్లికి అప్పులు తేవాల్సిన అవసరం లేకుండా చేస్తున్నాం

== ఖమ్మం నియోజకవర్గంలో 181మందికి చెక్కులు పంపిణి చేసిన మంత్రి పువ్వాడ

(ఖమ్మంప్రతినిధి-విజయం న్యూస్);-

కల్యాణలక్ష్మి,షాదిముబారక్ పథకం ప్రతి ఆడబిడ్డకు వరంలాంటిదని, ఏ ఒక్క ఆడబిడ్డ పెండ్లికి అప్పు తేవాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటింటికి లక్ష్మిని అందిస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రతి ఇంటికి పెద్దన్నగా ఆడపిల్ల పెండ్లికి ఆర్ధిక చేయూతనివ్వడంతో పేదింటి ఆడపిల్ల తల్లిదండ్రులు ఆనందంగా తమ కూతురు వివాహం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. సోమవారం వీ.డి. ఓస్ కాలనీ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 181 మంది లబ్ధిదారులకు రూ.1.81 కోట్ల విలువైన చెక్కులను నగర మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజుతో కలిసి మంత్రి పంపిణీ చేసారు.

also read :-రైతుల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం

ఈ సందర్భంగా మంత్రి వారినుద్దేశించి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకం తెలంగాణ రాష్ట్రంలో నిరంతరాయంగా కొనసాగిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ పథకం ద్వారా పేద ఇంటి ఆడకూతురున్న తల్లిదండ్రులకు భరోసాను కల్పించిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల సహకారంతో ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ. 66.02 కోట్ల రూపాయలు కల్యాణ లక్ష్మి షాది ముభారక్ పథకం కింద అందించడం జరిగిందని ఇట్టి కార్యక్రమం సంతృప్తినిచ్చిందని మంత్రి అన్నారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహపంక్తి భోజనం చేసిన చేసారు.

also read :-సంక్షేమ పథకాలు అమలు పర్చడంలో తెలంగాణ నంబర్ వన్
– కార్యక్రమంలో డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, మధిర మున్సిపల్చైర్ పర్సన్ మొండితోక లత, రఘునాథపాలెం జడ్పీ.టి.సి. మాళోతు ప్రియాంక, ఎం.పి.పి భూక్యా గౌరీ, ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం తహశీల్దార్లు శైలజ, నర్సింహారావు, కార్పోరేటర్లు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.