కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో రేగా..!!
(మణుగూరు రూరల్ విజయం న్యూస్):-
శనివారం నాడు అశ్వాపురం మండలం రైతు వేదిక నందు జరిగిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, కార్యక్రమంలో పాల్గొని 32 మంది లబ్ధిదారులకు సుమారు 32 లక్షలరూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేసిన పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల వారు ఆనందంగా ఉన్నారని అన్నారు. అలాగే అభివృద్ధి, సంక్షేమంలో, తెలంగాణ మొదటి స్థానంలో ఉంది అన్నారు.
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు 11 లక్షల మంది లబ్ధిపొందారు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడబిడ్డ పుడితే 130000/రు. మగబిడ్డ పుడితే 120000/రు లతో కెసిఆర్ కిట్ అందజేస్తున్నామని వివరించారు.
also read;-భారీ మొత్తంలో పి. డి. ఎస్ రైసు డంపులు స్వాధీనం: సీపీ
రాష్ట్రంలోనే పేద బడుగు వర్గాలకు చెందిన వారు పెళ్లిళ్లు చేసుకున్న యువతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా పెళ్లిళ్లు ఖర్చు కింద లక్ష నూట పదహారు రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.రాష్ట్ర ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు అన్నారు.
మైనార్టీ అభివృద్ధికి పెద్దపీట.
రంజాన్ మాస పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరీ సోదరులకు బట్టలు పంపిణీ చేశారు.
సీఎం కేసీఆర్ అన్ని మతాల వారిని ఒకేలా గౌరవిస్తారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని బట్టలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ సీనియర్ నాయకులు, పలు శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.