Telugu News

పేదింటి అమ్మాయి వివాహం కోసమే కళ్యాణలక్ష్మి పథకం: సండ్ర

సత్తుపల్లిలో 96 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణి చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర

0

పేదింటి అమ్మాయి వివాహం కోసమే కళ్యాణలక్ష్మి పథకం: సండ్ర

== సత్తుపల్లిలో 96 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణి చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర

== హాజరైన కలెక్టర్ వి.పి.గౌతమ్

సత్తుపల్లి, మే 20(విజయంన్యూస్):

పేదింటి అమ్మాయి వివాహం, తల్లిదండ్రులకు భారం కాకూడదని ప్రభుత్వం కళ్యాణలక్ష్మి/శాదిముబారక్ పథకాలను ప్రవేశపెట్టి, అమలుచేస్తున్నదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం సత్తుపల్లి లోని మాధురి ఫంక్షన్ హాల్లో 96 మంది లబ్ధిదారులకు చెక్కులను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తో కలిసి కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  సత్తుపల్లి మండలంలో గత 8 సంవత్సరాల కాలంలో  2,317 మందికి షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మికి సంబంధించి 19 కోట్ల 67 లక్షల రూపాయల విలువచేసే చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. లబ్ధిదారులకు 30 నుంచి 40 రోజుల్లో చెక్కులు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నిధులు కొరత లేకుండా లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరుగుతుందన్నారు.

ఇది కూడా చదవండి: నా అన్నవాళ్లకు అండగా ఎమ్మెల్యే సండ్ర
అకాల వర్షాలకు, ఈదురు గాలులకు పంట నష్టపోయిన మామిడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగిందని, త్వరలో పరిహారం అందుతుందని చెప్పారు. మొత్తం 300 ఎకరాల్లో మామిడి నష్టం జరిగిందని అంచనా వేయడం జరిగింది అన్నారు. చాలా ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న రైతులు కూడా వర్షాలతో పంట నష్టపోయారని, అయితే ఏప్రిల్, మే నెలలో వస్తున్న ఈదురుగాలులు అకాల వర్షాలు నేపథ్యంలో ముందస్తుగా వరి సాగు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కలెక్టర్ సూచించారు. ఈ ఏడాది వానాకాలంలో పంటలు తొందరగా వేసే విధంగా రైతులు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.

వ్యవసాయ శాఖ అధికారులు కూడా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని తరలించేందుకు తొలిదశలో లారీల కొరత కారణంగా కొంత ఆలస్యం జరిగిందని, కానీ ఇప్పుడు ఎటువంటి సమస్య లేదని చెప్పారు. పదివేల మంది రైతుల నుంచి 92 వేల 6 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి నేరుగా కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ కు జీవో 59 ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కనీస ధరకు డిమాండ్ జారిచేసి, డిమాండ్ జమ కాగానే పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన అన్నారు.  సత్తుపల్లి పట్టణంలో 129 మందికి ఈ జీవో ద్వారా రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
ఇది కూడా చదవండి: దమ్ముంటే  సత్తుపల్లి లో పోటీ చేసి గెలవాలి: ఎమ్మెల్యే సండ్ర
కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహకారంతో సత్తుపల్లి నియోజకవర్గంలో  వెయ్యికోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. నియోజకవర్గంలో బీటీ రోడ్లు, అంతర్గత సీసీ రోడ్లు, మరమ్మతులు, కమ్యూనిటీ హాల్స్ వంటి అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరైనట్లు ఆయన వివరించారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మార్క్ ఫెడ్ ద్వారా మక్కాలు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. దేశానికి రోల్ మోడల్ గా పరిపాలనందిస్తూ తెలంగాణ రాష్ట్రం ఖ్యాతి గడించిందన్నారు. గోదావరి జలాలను అందించే సీతారామ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతునట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని చెప్పారు. రైతు బంధు, రైతు భీమా, మిషన్ కాకతీయ, ఉచిత కరెంటు, సబ్సిడీ, ధాన్యం సేకరణ ఇలా అనేక కార్యక్రమాల ద్వారా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వమని ఎమ్మెల్యే అన్నారు.
ఇది కూడా చదవండి: ఒంటరైన సండ్ర..అవుతున్నాడా..? చేస్తున్నారా.?
ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, మునిసిపల్ చైర్మన్ మహేష్, గ్రంధాలయ చైర్మన్ ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, మునిసిపల్ కమీషనర్ సుజాత, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపిడిఓ సుభాషిణి,  జడ్పిటిసి రామారావు, ఎమ్.పి.పి. దొడ్డా హైమావతి, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.