Telugu News

కమలం గూటికి మల్లన్న : **** ముహుర్తం ఖారారు..

అధికారికంగా ప్రకటించిన నవీన్ కుమార్ (మల్లన్న)

0

కమలం గూటికి మల్లన్న
** ముహుర్తం ఖారారు..
** అధికారికంగా ప్రకటించిన నవీన్ కుమార్
** పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో చేరిక
** అదే రోజున ప్రధాని మోడీ, అమిత్షా ను కలిసే అవకాశం.

(హైదరాబాద్ – విజయం న్యూస్)
ఆయన సంచలనాలకు నిలయం.. జర్నలిజంలోనే ఓ మెరుపు మెరిసిన యంగ్ జర్నలిస్ట్.. ఆయనంటే అందరి అడల్.. ఆయన ఒక వార్త పెల్చాడంటే లక్షల వ్యూవ్స్.. టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ ను, మంత్రి వర్గాన్ని వదలకుండా వద్దనకుండా దంచివాయించే కలం నుంచి ప్రత్యర్థి.. ఎవరికి ఎదరని బెదరని నాయకుడు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి చుక్కలు చూపించిన నాయకుడు.. స్వల్పతేడాతో ఓటమి చెందినప్పటికి విజయం సాధించిన ఆ జర్నలిస్ట్ ఎవరో కాదు.. దేశవ్యాప్తంగా ఒక్క వెలుగు వెలిగిన క్యూ న్యూస్ అధినేత, ప్రముఖ జర్నలిస్టు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్.

ఇటీవలే జైలుకు వెళ్లి, బెయిల్ పై వచ్చిన తీన్మార్ మల్లన్న బీజేపీ పార్టీలో చేరికకు రంగం సిద్దం చేసుకున్నాడు. ఈనెల 7న బీజేపీలో చేరుతున్నట్లు తన స్వంత ట్విట్టర్ ద్వరా ప్రకటించాడు. కానీ ఈసారి మల్లన్నస్వయంగా తెలుపడం తో సర్వం సిద్దమైంది. మోడీ సిద్ధాంతాలకు తాను ఆకర్షితునుడైనట్లు. ఈ నేపథ్యంలోనే బిజెపిలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు మల్లన్న. బిజెపిలో చేరేందుకు అన్ని అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయ్యాయని.

డిసెంబర్ 7వ తేదీన భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లు ట్వీట్ చేశారు. గతంలోనే మల్లన్న బిజెపి లో చేరబోతున్నారనే వార్తలు ప్రచారం జరిగినప్పటికీ అది కొంత ఆలస్యమైంది.

ఓ స్వామిజీని, అలాగే తెలంగాణ ప్రభుత్వంపై చేసిన ఆరోపణల నేపథ్యంలో మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. భర్తను విడుదల చేసుకునేందుకు మల్లన్న భార్య చాలా ప్రయత్నాలు చేసింది. చివరికి బీజేపీ పెద్దలను కలిసి వినతి చేసుకుంది.

ఇటీవలే ఆయన బెయిల్ ఫై బయటకొచ్చారు. ఇక మల్లన్న రిమాండ్ లో ఉన్న సమయంలో అతడి భార్య మమత పీఎం మోడీ, హోం మంత్రి అమిత్షాకు మెయిల్ ద్వారా ఓ విన్నపం విన్నవించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తన భర్త నిరంతరం పోరాడుతున్నారని అందులో పేర్కొన్నారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ వచ్చిన ప్రతిసారి ఇష్టారీతిన సెక్షన్ల కింద కేసులు పెడుతూ జైలు నుంచి బయటకు రాకుండా చేస్తున్నారని వివరించారు.

ఈ ఏడాది జనవరిలో జరిగిన నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బీజేపీ నుంచి టికెట్ ఆశించారని వివరించారు. ఇండిపెండెంట్గా పోటీ చేసి రెండో ప్లేస్లో నిలిచారన్నారు. తన భర్త తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరాలనుకుంటున్నారని, మోడీ నాయకత్వంలో రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేయాలనుకుంటు న్నారని తెలుపడం జరిగింది.

అవసరమైతే బీజేపీ పార్టీలో చేరతామని, మా ఆయనకు బెయిల్ ఇప్పించాలని వేడుకుంది. దీంతో మల్లన్న బీజేపీ గూటిలో చేరడం ఖాయమని అనుకున్నారు. కానీ ఆయన తొందరపడలేదు. అయితే ఉన్నట్టుండి వచ్చెనెల 7న బీజేపీలో చేరుతున్నట్లు ఆదివారం ఉదయం ఆయన అధికారిక ట్విట్టర్లో ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. బీజేపీలో చేరుతుండటంతో రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందా..? అనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి.

 

also read :-దర్గాలో ప్రార్థనలు చేసిన – ఈటేల

also read:- రోలర్ని తగలబెట్టిన మావోయిస్టులు

 


please share, subscribe, & like my channel :- smiling chaithu