Telugu News

కమ్మ సంఘం భవన నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపన.

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ0.

0

కమ్మ సంఘం భవన నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపన.

(సూర్యపేట-విజయం న్యూస్) :-
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ కేంద్రంలో కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, సంఘం అధ్యక్షుడు ఎర్నేని వెంకటరత్నం బాబు నేతృత్వంలో 2 ఎకరాల్లో నూతనంగా నిర్మించనున్న కమ్మ వారి కళ్యాణమండపం నిర్మాణ పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్థాపన చేశారు.

అనంతరం కార్తీక మాస వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.సంఘం ఆధ్వర్యంలో కల్యాణ మండపం నిర్మించడం పట్ల వారికి శుభాకాంక్షలు తెలిపారు.

కమ్మ సంఘం కోదాడ అధ్యక్షుడు వెంకటరత్నం బాబు, తుమ్మలపల్లి భాస్కర్ రావు, వేమూరి సత్యనారాయణ, సాధినేని అప్పారావు, ఈదర సత్యనారాయణ, ముత్తవరపు రామారావు, పోటు కోటేశ్వరరావు, నెల్లూరి లీలావతి, సురేష్ తదితరులు ఉన్నారు.

also read :- గురుకుల పాఠశాలలో కరోనా కలకలం..