Telugu News

కందాళకు షాడోల భయం

అందరికి అప్తుడే... అదరించేనా..?

0

కందాళకు షాడోల భయం

== అందరికి అప్తుడే… అదరించేనా..?

== సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి కందాళ

== సామాన్యుల గుండెలను తాకిన బీఆర్ఎస్ నేత

== షాడోల తోనే అసలు సమస్య..?

(కూసుమంచి-విజయంన్యూస్)

అతి తక్కువ కాలంలో ఎమ్మెల్యే అయ్యారు.. అందరికి అప్తుడైయ్యారు.. అవసరాన్ని భట్టి సహాయం చేస్తూ వచ్చారు.. అవసరమైన చోట అన్నగా మారారు.. కన్నోళ్లే దగ్గరకి చేరని నేటి రోజుల్లో అండగా నిలిచారు.. అవసరమైతే అన్నగా మారారు.. అందరి మనుసులకు దగ్గరైయ్యారు..అనిత కాలంలోనే అతి సామాన్యుడి మనసును గెలుచుకున్నారు.. కులమతబేదాలు లేకుండా చేయూతనందించుకుంటూ వస్తున్న పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి.. పాలేరు ప్రజల్లో ఆశాజ్యోతిగా మారారు..

ఇది కూడా చదవండి:- కాంగ్రెస్ గూటికి తుమ్మల..?

అందరివాడిగా మారిపోయారు.. పల్లెలను అభివద్ది వైపు తీసుకెళ్తున్న కందాళ, సంక్షేమ పథకాలను అర్హులకు అందించే ప్రయత్నం చేశారు.. అక్రమాలకు అడ్డుకట్ట వేసిన పాలేరు ఎమ్మెల్యే ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.. సామాన్యుడిని సైతం ప్రేమగా పిలిచే కందాళ ఉపేందర్ రెడ్డి, అన్నా అంటే పలికే మంచి మనుసున్న నాయకుడైయ్యారు. కష్టం ఉంది సార్ అంటూ కరిగిపోతున్నారు.. కష్టాన్ని తన కష్టంగా భావిస్తున్నారు.. ఉన్నఫలంగా చేయూతనందిస్తు పేదల మనుసులను గెలుచుకున్నారు. పార్టీలకు అతీతంగా అందరి ఇండ్లకు వెళ్తున్న కందాళ, రాష్ట్రంలోనే ఎవరు చేయని  విధంగా చనిపోయిన వారి కుటుంబానికి రూ.10వేల చొప్పన అర్థిక సహాయం చేస్తున్నారు.. ఐదేళ్లలో వేలాధి మంది కుటుంబాలకు రూ.10వేల చొప్పున చేయూతనందించి ప్రతి ఇంటకి పెద్దకొడుకైయ్యాడు. అలాంటి ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ కి రాష్ట్రంలోనూ, జిల్లాలోనూ  ఏ ఎమ్మెల్యేకి లేని  మాస్ ఫాలోయింగ్ ఉంది.

ఇది కూడా చదవండి:- నేడు ఖమ్మానికి అమిత్ షా..

కానీ అది మాస్ బలం కాదు.. కాసుల బలమే అంటూ కొందరు చెప్పడం గమనర్హం.  అయితే అనుకోకుండా పార్టీ మారిన ఆయన అధికార పార్టీలో కీలకనాయకుడిగా మారారు.. అభివద్ది ప్రధాతగా పేరుగాంచిన మాజీ మంత్రిని సైతం కాదని అధినేత మనుసును గెలుచుకున్న కందాళ ఉపేందర్ రెడ్డి పాలేరు నియోజకవర్గ టిక్కెట్ ను దక్కించుకున్నారు.. మరోసారి ఎమ్మెల్యే గా  గెలిచేందుకు ప్రచారం షూరు చేశారు.. అయితే పాలేరు నియోజకవర్గంలో కందాళ ఉపేందర్ రెడ్డిపై ప్రజలు కొంత కోపంగా ఉన్నారు.. కష్టకాలంలో మంత్రిని కాదని ఓట్లేసి గెలిపిస్తే ఏ ఒక్కరికి చెప్పకుండా అధికార పార్టీలో చేరారనే కోపం ప్రజల్లో ఇప్పటికి పోలేదు.. అంతే కాకుండా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోవడానికి కారణమైన కొందరు వ్యక్తులను వెంటవేసుకుని తిరుగుతుండటం పట్ల కూడా పాలేరు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.. తుమ్మల నాగేశ్వరరావుతో ఉన్నప్పుడు గాలిలో తెలియాడిన ఆ నేతలు, తిరిగి ఎమ్మెల్యే దగ్గర చేరి సామాన్యులను సార్ వద్దకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.. రహస్యంగా మాట్లాడుకునే అవకాశం ఇవ్వడం లేదని చెబుతున్నారు.. ముఖ్యంగా తన కోసం కష్టపడి పనిచేసి ఓట్లు వేసి గెలిపించిన నాయకులపై కేసులు బనాయించడంపై కొంత మేరకు ఆగ్రహం తో ఉన్నట్లుగా కనిపిస్తోంది.. అయితే ఇదంతా పాలపై పొంగులాంటిదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది..

ఇది కూడా చదవండి:- జలగం దారేటు..?

అయినప్పటికి పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ ను పొందిన కందాళ ఉపేందర్ రెడ్డి అందరికి అప్పుడే కానీ.. వచ్చిన అవకాశాన్ని సద్వీనియోగం చేసుకోవడంలో సక్సెస్ అవుతారా..? లేదా..? వేచి చూడాల్సిందే..?

== బయోడేటా..

పాలేరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి: కందాళ ఉపేందర్‌రెడ్డి

పుట్టిన తేదీ: 9 జనవరి 1960

జన్మస్థలం: రాజుపేట, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా

తల్లిదండ్రులు: కందాళ నర్సింహారెడ్డి, మోహినీదేవి

భార్య: కందాళ విజయమ్మ

కుమార్తెలు: దీపిక, దీప్తి

చదువు: బీఎస్సీ

కుటుంబ నేపథ్యం: తండ్రి నర్సింహారెడ్డి, మోహినీదేవి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు. తండ్రి  రాజుపేటలో కాంగ్రెస్ సర్పంచ్‌గా సేవలందించారు. కాంగ్రెస్‌పార్టీలో జిల్లాస్థాయి పదవులు పొందారు.

పనులు : రాష్ట్రంలో చిన్న కాంట్రాక్టర్ గా ప్రారంభమైన తన భవిష్యత్..నేడు దేశంలోనే బిగెస్ట్ కాంట్రాక్టర్ గా ఎదిగారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, ఆయన కుటుంబానికి అప్తమిత్రుడు..

రాజకీయ నేపథ్యం: 2009, 2014 లో కాంగ్రెస్ తరుపున పాలేరు టిక్కెట్ ఆశించిన కందాళ ఉపేందర్ రెడ్డి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తూ, పాఠశాలలకు ప్లేట్లు, బల్లాలు  పంపిణి చేస్తూ, దేవాలయాలకు అర్థిక చేయూతనందిస్తూ వచ్చారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మం పొలిటికల్ లో విచిత్రం..?

2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి మంత్రిగా పనిచేస్తున్న తుమ్మల నాగేశ్వరరావుపై 4వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. తర్వాత కొంతకాలానికి బీఆర్‌ఎస్‌లో చేరారు. రెండవ సారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగేందుకు సిద్దమైయ్యారు. తనకు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామికావడమంటే ఇష్టం. నిరుపేద విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పాటునందించడం, వారిని వృద్ధిలోకి తీసుకురావడం ప్రధాన ధ్యేయం. పిలుస్తే పలికే మనసు ఆయన స్వంతం.

== బలం

పాలేరు ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉండటం, పిలిస్తే పలకడం, సహాయం అని వస్తే వెనుచూడకుండా సహాయం చేయడం ఆయన బలం. కులమతాలకు తావులేకుండా అందర్ని అప్యాయతగా పలకరించడం ఆయన బలం. బీఆర్ఎస్ పార్టీ లో చేరడం, అధికార పార్టీ నుంచి టిక్కెట్ రావడం బలం. తను తిరగడమే కాకుండా కుటుంబాన్ని కూడా ఇంటింటికి తిప్పడం, ప్రజల యోగ క్షేమాలు  అడిగి తెలుసుకోవడం ఆయన బలం. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సండ్ర వెంకటవీరయ్య లాంటి వారి రాజకీయ చేయూతనందించడం ఆయన బలం. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉండటం, పాలేరు నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ వైపు ఉండటం బలం.

== బలహీనత..

17 రోజులకే పాలేరు ఎమ్మెల్యేను చేసిన కార్యకర్తలను, పార్టీ నాయకులను వదిలేసి, వాళ్లకు చెప్పకుండా పార్టీ మారడం బలహీనత. పార్టీ కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం రావడం బలహీనత. ప్రశ్నించే వారిపై, సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం, పోలీసుల ద్వారా ఇబ్బందులు స్రుష్టించే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం బలహీనత. సోషల్ మీడియాలో కొందరు కార్యకర్తలు పదేపదే యువకులపై కౌంటర్లు వేస్తూ బెదిరింపులకు దిగుతున్నారనే ప్రచారం బలహీనత..

ఇది కూడా చదవండి:- మట్టాదయానంద్ కు  బిగ్ షాక్

కొందరిని నమ్మడం..వాళ్లకే బాధ్యతలివ్వడం, వారిని నివారించే చర్యలు లేకపోవడం పట్ల ప్రజల్లో ఆగ్రహం ఉన్నట్లుగా ప్రచారం జరగడం, వారంత ఆసంతృ గా ఉండటమే బలహీనత.. పదవుల విషయంలో ఆలోచించకుండా ఇంటికి రెండు పదవులు ఇవ్వడం బలహీనత.. గ్రామాల్లో పట్టు లేకపోవడం.. ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం బలహీనత.. బీఆర్ఎస్ పార్టీ రెండు ముక్కలు కావడం బలహీనత.. రెండు ముక్కలు అయ్యే విధంగా చేసుకోవడం బలహీనత. కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులను నమ్మి నాకు ఓట్లేస్తారని నమ్మడం బలహీనత.