Telugu News

మానవత్వాన్ని చాటుకున్న కందాళ

గొర్రెకు రూ.1000 చొప్పున రూ.2లక్షలు అర్థిక సహాయం అందించిన మాజీ ఎమ్మెల్యే

0

మానవత్వాన్ని చాటుకున్న కందాళ

== రాజారాం గ్రామంలో 200గొర్రెలు మృతి

== గొర్రెకు రూ.1000 చొప్పున రూ.2లక్షలు అర్థిక సహాయం అందించిన మాజీ ఎమ్మెల్యే

(తిరుమలాయపాలెం-విజయం న్యూస్)

తిరుమలయపాలెం మండలం రాజారం గ్రామంలో ఇటీవల గడ్డి మందు తిని దాదాపు 200 పైన గొర్రెలు చనిపోయిన విషయాన్ని కందాళ ఉపేందర్ రెడ్డికి తెలియగానే వెంటనే స్పందించి బాధితులతో వీడియోకాల్ మాట్లాడి వారికి తక్షణ సహాయంగా ఒక్కో గొర్రేకు రూ.1000/- చొప్పున (సుమారుగా 2 లక్షల) రూపాయలు ప్రకటించి ప్రభుత్వం నుండి ఒత్తిడిచేసి సహాయం అందేవిధంగా చూస్తానని భవిష్యత్తులో అండాగా వుంటానని హామీ ఇచ్చారు.బాధిత కుటుంబాలు కందాళ ఉపేందర్ రెడ్డికి* కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాణాల మధుసుధన్ రెడ్డి,కొప్పుల ఉపేందర్ రెడ్డి, రంగాపురం బాలకృష్ణ గౌడ్, పేర్ల కొమరయ్య, సంపత్, గణేష్, నరేష్, బిక్షం,సైదులు,నాగయ్య,వేల్పుల మల్లయ్య,T. రవీందర్ రెడ్డి,గుండాల సైదులు,జంపాల రమేష్,మందుల ఎల్లయ్య,శ్రీరంగం దినేష్,సామా వినయ్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.