పాలేరు నియోజవకర్గంలో కందాళ సుడిగాలి పర్యటన
పలు కుటుంబాలను పరామర్శించి, అర్థిక చేయూతనిచ్చిన ఎమ్మెల్యే
పాలేరు నియోజవకర్గంలో కందాళ సుడిగాలి పర్యటన
పలు కుటుంబాలను పరామర్శించి, అర్థిక చేయూతనిచ్చిన ఎమ్మెల్యే
కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కలు పంపిణి
(కూసుమంచి-విజయంన్యూస్)
పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి శనివారం పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు. కూసుమంచి మండలంలోని భగత్ వీడు గ్రామంలో విద్యుత్ షాక్ గురై మరణించిన మాలోత్ గోబ్రియా చిత్ర పటానికి పులువేసి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అర్థిక చేయూతనందించారు. అలాగే కూసుమంచి మండలం బికారి తండాలో అనారోగ్యంతో బాధపడుతున్న యర్రనాగుల సాలిని పరామర్శించి,వారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈశ్వరమాధారం గ్రామంలో వివిధ కారణాలతో ఇటీవల మరణించిన చందా నాగిరెడ్డి,ముర్తాల అంజిరెడ్డి,కొలిశెట్టి చిలకమ్మ,దోనకొండ కనకమ్మ కుటుంబాలను పరామర్శించి,వారి కుటుంబ సభ్యులను ఓదార్చి,ప్రగాఢ సానుభూతిని తెలిపి రూ.10వేలచొప్పున ఆర్ధిక సహాయాన్ని ఈనాలుగు కుటుంబాలకు అందించారు. రాజుపేట గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న డాక్టర్ షేక్ యాకూబ్ ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల మృతి చెందిన అభణపూరి మల్సూర చారి కుటుంబాన్ని పరామర్శించి రూ.10వేలను ఆర్థిక సహాయాన్ని అందించారు.
also reaad :-సుడా చైర్మన్ పై అసత్య ఆరోపణలు తగదు
== తిరుమలాయపాలంలో
తిరుమలాయపాలెం మండలం రఘునాథపాలెం గ్రామ శాఖ అధ్యక్షులు గౌని మల్లయ్య-జ్యోతి కుమార్తె వివాహ వేడుకకు హాజరై,నూతన వధూవరులు యమున-గౌతమ్ లను ఆశీర్వదించిన పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి, అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న గుండు మహేష్ ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హస్నాబాద్ గ్రామ మాజీ సర్పంచ్ శ్రీపతి ప్రవళిక తల్లి ధనలక్ష్మి ఇటీవల మరణించ విషయం తెలుసుకొని,వారి నివాసానికి వెళ్లి వారి చిత్రపటానికి పూలువేసి,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపి,వారి కుమార్తె ప్రవళిక ని ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించి ఆర్థిక సహాయాన్ని అందించారు.
== ఖమ్మంరూరల్ లో
ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం,పొల్లేపల్లి,గోళ్ళపాడు గ్రామంలో కళ్యాణలక్ష్మీ షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేసిన పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి, అనంతరం పల్లెగూడెంలో వల్లపు సమ్మక్క,ఆకుల జానకమ్మ,కళోజ్ సులోమాన్ పొల్లేపల్లిలో మద్దెల పుల్లమ్మ,చాల్ల శీరీష గోళ్ళపాడులో అనారోగ్యంతో బాధపడుతున్న పోనేకంటి రాంమోహన్ ని పరామర్శించారు.పోనేకంటి కృష్ణ,నిడిగొండ వెంకన్న,అయితగాని చుక్కమ్మ కుటుంబాలను పరామర్శించి రూ.10వేల చొప్పున ఆర్ధిక సహాయాన్ని ఈతొమ్మిది కుటుంబాల సభ్యులకు అందించారు. తీర్ధాల,డాక్యా తండా,మద్దివారిగూడెం,పోలిశెట్టిగూడెం,మంగళగూడెం గ్రామాల్లో కళ్యాణలక్ష్మీ షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
also read :-కూసుమంచి మండలంలో పలు కుటుంబాలను పరామర్శించి పొంగులేటి
టీవల మరణించిన తీర్ధాలలో పిట్టల ఉపేంద్రమ్మ డాక్యా తండాలో మాలోత్ శంకర్,బాణోత్ సామ్య మద్దివారిగూడెంలో షాబాద్ కృష్ణరెడ్డి,గుండ్ల ముత్యాలమ్మ,గుర్రం పుష్ప పొలిశెట్టిగూడెంలో షేక్ గంగలాల్ మంగళగూడెంలో చల్లా అచ్చమ్మ గారు పిట్టలవారిగూడెంలో గటికొప్పుల పార్వతమ్మ గారి కుటుంబాలను పరామర్శించి రూ.10వేల చొప్పున ఆర్ధిక సహాయాన్ని ఈతొమ్మిది కుటుంబాలకు అందజేశారు. మంగళగూడెంలో అయ్యప్పస్వామి మలాధారణ భక్తులకు పూజ చేసుకొనుట కొరకు గది నిర్మాణానికి రూ.50,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు హాజరైయ్యారు.