కన్న పిల్లల్ని బావి లో పడేసిన కసాయి తండ్రి
(మహబూబాబాద్ విజయం న్యూస్);-
పసిమొగ్గలు అని చూడకుండా ఓ కసాయి తండ్రి పేగు బంధం పంచుకుని పుట్టిన కూతురు, కుమారుడు, ని బావిలో పడేసి హత్య చేసిన సంఘటన మహబూబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామ శివారు. గడ్డి గూడెం లో మంగళవారం చోటు చేసుకుంది గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం భూక్యా రామ్ కుమార్, శిరీష దంపతులకు అమ్మి జాక్సన్( 8 )అనే కుమార్తె జానీ బెస్ట్ (6) అనే కుమారుడు ఉన్నారు. పాఠశాలకు సెలవు కావడంతో ఇద్దరు ఇంటివద్దనే ఉంటున్నారు.
also read :-పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసిన ఖమ్మం డీసీసీ, నగర కాంగ్రెస్ అధ్యక్షులు
భార్యభర్తలిద్దరూ తరచూ ఊ గొడవలు పడుతుండగా భర్త వేధింపులు భరించలేక శిరీష తండ్రికి తన గోడును తెలియజేసింది. దీంతో కన్నకూతురి ఆవేదనను తెలుసుకొని అల్లుడిని మందలించాడు. మీ నాన్న నన్ను ఎలా తిడుతాడంటూ ఆవేశంతో నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలను ఇంటి పక్కనే ఉన్న బావిలో పడేసినట్లు తెలిపారు. కాగా రామ్ కుమార్ పరారీలో ఉన్నాడు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.