Telugu News

కరకగూడెం టిఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ.. 

పార్టీకీ రాజీనామా చేసిన జడ్పీటీసీ..

0
కరకగూడెంలో ఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ
== పార్టీకి రాజీనామా జడ్పిటిసి
== త్వరలో కాంగ్రెస్ గూటికి
మణుగూరు/కరకగూడెం.జూన్23.(విజయం న్యూస్)
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో అడుగులేస్తున్న టీఆర్ఎస్ కచ్చితంగా ఇది షాకింగ్ న్యూసే..?

ప్రభుత్వ విఫ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావుకు ఆ జిల్లా టీఆర్ఎస్ కు అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి షాక్ ఇచ్చాడు.  తను పార్టీ వీడుతున్నట్లు, రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు.దీంతో  కరకగూడెం మండల అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బతగిలినట్లైంది. కరకగూడెం మండల అధికార  పార్టీ జెడ్పిటీసీ కొమరం కాంతారావు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి గురువారం  రాజీనామా చేశారు. పార్టీ పట్ల ప్రజల్లో అసంతృప్తి, ఎమ్మెల్యే రేగా అవలంబిస్తున్న  విధి విధానాలు తన రాజీనామాకు ప్రధాన  కారణాలని ఆయన విలేకర్లకు వివరించారు. పార్టీ కోసం ఎంతగానో పనిచేశానని, జడ్పీటీసీగా ఉన్న తన పట్ల చాలా చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. చాలా అవమానిస్తున్నారని, అందుకే అవమానం ఉన్న చోట నేను ఉండోద్దని నిర్ణయించుకుని బయటకు వెళ్తున్నానని అన్నారు.  ఈ మేరకు ప్రజల కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నానని, అదివాసిలకు అక్క.. పేద ప్రజలకు దిక్క్సూచి  ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెసులో చేరుతున్నట్లు ప్రకటించారు. నాతో పాటు కొందరు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కూడా పార్టీ మారుతున్నారని, కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు. ఫలితంగా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా నిశబ్ధం పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలైతే ప్రతిపక్షంలో ఉన్న ప్రజాప్రతినిధులు అధికారపార్టీలో చేరడం కామన్, కానీ అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీ ప్రతి పక్షపార్టీలో చేరడం అంటే ఇది కచ్చితంగా గులాబీ పార్టీకి ఎదురుదెబ్బేనని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏ జరుగుతుందో వేచి చూడాల్సిందే..

allso read-ఆ పార్టీ వైపు తాటి చూపు