Telugu News

పట్టపగలే తోడెస్తున్న భూ బకాసురులు

కరకగూడెం మండలంలో ఇష్టానుసారంగా మట్టి, ఇసుక తోలకాలు

0
  1. పట్టపగలే మట్టిని తోడేస్తున్నారు

** భూ బకాసురులుగా మరీనా ఇసుక ర్యాంపు నిర్వాకుల
* అధికారుల అండదండలే కారణం
* మట్టిని, ఇసుకను మింగేస్తున్నారు 
(కరకగూడెం – విజయం న్యూస్)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతరం గ్రామంలో ఇసుక ర్యాంప్ నిర్వాహకులు ర్యాంపు లోని ఇసుక సరఫరా చేయడం కోసం నడి వాగులో గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులను పట్టపగలు జెసిబి, ట్రాక్టర్ల సాయంతో చేపట్టారు. మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు, మాకు ఎవరు ఎదురు లేరు, మేం చెప్పిందే శాసనం అన్నట్టుగా నిర్వాహకులు వ్యవహరిస్తున్న తీరు అమానుషం గా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు ఎటువంటి పర్మిషన్ తీసుకో కుండా రెవెన్యూ అధికారులకు లంచాలు ముట్ట చెప్పడంతో వారిని ఆపే వారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఇసుక ర్యాంపు అనుమతులు తీసుకుని అనుమతులకు భిన్నంగా ఇసుకను తోడవడంతో పాటు రహదారి కి కావలసిన గ్రావెల్ కూడా గ్రామాలలోని ట్రాక్టర్ల సాయంతో పట్టపగలు తోలుతున్న రెవెన్యూ అధికారులు కానీ, అటవీ అధికారులు గాని వారిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం

విక్రమ్ కుమార్ కరకగూడెం తాసిల్దార్ : ఇసుక ర్యాంపు నిర్వాహకులకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు మేము మా సిబ్బంది సంఘటన స్థలానికి పంపిస్తాం అంతకుమించి నాకేం తెలియదు
వంగరి సతీష్ సీపీఎం ప్రధాన కార్యదర్శి : రెవెన్యూ అధికారుల అండదండలతో ర్యాంపు నిర్వాహకులు మట్టిని తీడేస్తున్నారు. ట్రాక్టర్లు పట్టపగలే రాయి రాయి మంటూ ఒకదాని వెనుక ఒకటి అతివేగంతో రవాణా చేస్తుండడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు ర్యాంపు నిర్వాహకులు కుమ్మక్కై మట్టిని, ఇసుకను కబ్జా చేస్తున్నారు. అక్రమార్కులపై, అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలి

Allso read:- పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన ఏపీ సర్కార్..ఎంతంటే..?