Telugu News

కరాటేను పాఠ్యాంశాల్లో చేర్చాలి…

విద్యతో పాటు క్రీడలు, కరాటే కూడా అవసరమే...

0

కరాటేను పాఠ్యాంశాల్లో చేర్చాలి…
* విద్యతో పాటు క్రీడలు, కరాటే కూడా అవసరమే…
*ఆత్మరక్షణ కోసం కరాటే తప్పనిసరి…

వినోద్ కరాటే స్కూల్ వారి ఆధ్వర్యంలో స్థానిక వర్తక సంఘ భవనంలో స్టేట్ లెవల్ కరాటే పోటీలు నేడు ప్రారంభమయ్యాయి. కరాటే మాస్టర్ చింతమల్ల వినోద్ ఆధ్వర్యంలో ఈ పోటీలు పెద్ద ఎత్తున అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరాటే నిపుణులు,. మాస్టర్స్, స్టూడెంట్స్, పాల్గొన్న ఈ పోటీలను ముఖ్య అతిధి గా ఖమ్మం సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జావీద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జావీద్ మాట్లాడుతూ….. సౌత్ ఇండియా లెవెల్ కరాటే ఛాంపియన్షిప్స్ నిర్వహించటమనేది చాలా శ్రమతో కూడుకున్న విషయమని, దీని నిర్వహణ కత్తిమీద సాము లాంటిదని అలాంటి ఛాంపియన్షిప్ ను మన ఖమ్మంలో 2 వ సారి నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎంతో పట్టుదలతో , శ్రమతో నిర్వహించిన పోటీలు అద్భుతంగా జరగాలని ప్రతిభావంతులు వెలుగులోకి రావటానికి ఈ పోటీలుమరింత దోహద పడతాయని, వీటిని నిర్వహించిన కరాటే మాస్టర్ చింతమల్ల వినోద్ కుమార్ ను మనస్పూర్తిగా అభినందిస్తున్నామని అన్నారు.

ఇలాంటి కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు.అంతే కాకుండా రాబోయే రోజుల్లో కరాటే ను పాఠ్యపుస్తకాలు లో చేర్చి ప్రతి రోజు ఒక పీరియడ్ కరాటే విద్యను నేర్చుకునేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పూనుకుంటుందని తెలియచేస్తున్నాం అన్నారు. ఆడపిల్లలకు కరాటే అనేది ఈ రోజుల్లో చాలా అవసరమని ఆత్మ రక్షణ కొరకు మానసిక ఉల్లాసానికి దేహ దారుఢ్యానికి అన్ని విధాలా సహకరిస్తుంది మరియు ఈ కరాటే విద్యను నాలుగు సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల లోపు విద్యార్థులందరూ నేర్చుకోవచ్చని తెలిపారు.

మాకు నేర్చుకోవాలని అనిపించినా వయస్సు దాటి పోయిందని చమత్కరించారు కరాటే పోటీలు ఈ సంవత్సరం దక్షిణాది రాష్ట్రాలకు మాత్రమే పెట్టాడని రాబోయే రోజుల్లో ఆలిండియా స్థాయి కరాటే పోటీలు కూడా ఖమ్మం నగరంలో నిర్వహించాలని సభాముఖంగా వినోద్ ని కోరారు ….అనంతరం కార్యక్రమ నిర్వాహకులు జావీద్ గారిని శాలువా తో సత్కరించి మెమెంటో అందచేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోశాధికారి తూములూరి లక్ష్మి నరసింహారావు, నగర కాంగ్రెస్ నాయకులు బాణాల లక్ష్మణ్, 46 వ డివిజన్ అధ్యక్షుడు Sk. రజ్జి, తదితరులు పాల్గొన్నారు.

also read :- తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి గా తాతా మధు..?